గృహప్రవేశం (1946 సినిమా)

గృహప్రవేశం ఎల్.వి.ప్రసాద్ దర్శకునిగా 1946 లో విడుదలైన చిత్రం. ఇందులో ఎల్వీ ప్రసాద్, భానుమతి ప్రధాన పాత్రలు పోషించారు. ఎల్. వి. ప్రసాద్ మొట్టమొదటగా దర్శకుడిగా మొదటి చిత్రం ఇది.[1] త్రిపురనేని గోపీచంద్ ఈ సినిమాకు కథ, మాటలు రాశాడు.

గృహప్రవేశం (1946 సినిమా)
(1946 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎల్వీ ప్రసాద్ (తొలి చిత్రం)
నిర్మాణం చల్లపల్లి రాజా,
కె.ఎస్.ప్రకాశరావు
కథ త్రిపురనేని గోపీచంద్
చిత్రానువాదం త్రిపురనేని గోపీచంద్
తారాగణం ఎల్వీ ప్రసాద్,
పి.భానుమతి,
చిలకలపూడి సీతారామాంజనేయులు,
శ్రీరంజని,
కస్తూరి శివరావు,
పి.హేమలత,
రంగస్వామి
సంగీతం బాలాంత్రపు రజనీకాంతరావు
నేపథ్య గానం వి.జె.వర్మ
గీతరచన బాలాంత్రపు రజనీకాంతరావు
నిర్మాణ సంస్థ సారధీ ఫిల్మ్స్
నిడివి 122 నిమిషాలు
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

భారత స్వాతంత్ర్య సిద్ధించిన సంధికాలం ఈ సినిమాకు నేపథ్యం. జానకి (భానుమతి) విద్యావంతురాలు, చైతన్యవంతురాలు. స్త్రీ స్వేచ్ఛ పట్ల సానుకూల దృక్పథాన్ని కలిగి ఉంటుంది. ఇంట్లో సవతి తల్లి తులశమ్మ (హేమలత) వేధింపులకు గురవుతూ ఉంటుంది. సోమలింగం (ఎల్‌.వి.ప్రసాద్‌)కు మహిళలంటే చిన్నచూపు. ఒకసారి జానకి సోమలింగం ఏర్పాటు చేసిన సభను తన స్నేహితురాళ్ళతో కలిసి చెడగొట్టి ఆ తరువాత అతనును అవమానించేలా వ్యంగ్య నృత్యనాటిక నొకదాన్ని ప్రదర్శిస్తుంది. తులశమ్మ నాటకాలరాయుడైన తన తమ్ముడు రమణారావు (సి.ఎస్‌.ఆర్‌.)కు జానకినిచ్చి పెళ్ళిచేయాలని ఉంటుంది. రమణారావు అప్పటికే ఓ నాటకాలమ్మాయి లలిత (జూనియర్‌ శ్రీరంజని)తో సహజీవనం చేస్తుంటాడు. అంతకు మునుపే మోసం చేసి సోమలింగం ఒడిలో ఉన్నట్టుగా దిగిన ఫొటో ఒకటి పేపర్లో అచ్చయి అతని ప్రతిష్ఠకు భంగం కలుగుతుంది. ఆ రాత్రి ఇంట్లోంచి బయటపడిన జానకి తాగుబోతుల నుండి తప్పించుకోవడానికి సోమలింగం ఇంట్లోకెళ్లి తల దాచుకుంటుంది. తన ఆశయం భంగం చేయడానికే వచ్చిందనుకుంటాడు. పోలీసులకు పట్టివ్వబోతే భార్యలా నటించి తప్పించుకుంటుంది. ఇంతలో సోమలింగం శిష్యుడు ఆచారి ఇదంతా గమనించి సోమలింగంపై దాడి చేస్తాడు. విరక్తి కలిగి సన్యాసం స్వీకరిస్తాడు. కథలో చాలా మలుపులు తిరిగి సోమలింగం లలితను ప్రేమించడం మొదలుపెడతాడు. రమణారావు ఎత్తుకు పైఎత్తు వేసి లలితతో అతని పెళ్ళి జరిపిస్తారు. జానకి తండ్రి సోమలింగానికి జానకినిచ్చి పెళ్ళి చేసి స్త్రీ పురుషులు సమానమే. ఇరువురు కలిసి సమాజ సేవ చేయాలని ఉద్బోధ చేస్తాడు.

పాటలు

మార్చు
 1. అనగనగా ఒక రాణి నోరులేని పసిపాపలపై ఎంతో జాలి - పి. భానుమతి
 2. అమ్మా అమ్మా నీ నయనమ్ముల ఆశాజ్యోతులు నిండుగ - పి. భానుమతి
 3. ఏమగునో నా జీవితమిక ఎటు పోవునోయీ చుక్కాని లేని - పి. భానుమతి
 4. గృహప్రవేశమిదే మహా గృహప్రవేశమిదే - పి. భానుమతి బృందం
 5. జానకి నాదేనోయి మదిలో కోరిక తీరేనోయి - సి. ఎస్. ఆర్. ఆంజనేయులు
 6. ధన్యుడనైతినహా తులసమక్కా తులసమక్కా - సి. ఎస్. ఆర్. ఆంజనేయులు
 7. బానిసలం బానిసలం భారతనారి మగువలం - పి. భానుమతి బృందం
 8. మారుతుందోయి ధర్మము యుగయుగమ్ముల లోకవర్తన - ఘంటసాల . రచన: బాలాంత్రపు రజనీకాంతరావు.
 9. వెదుకాడదేల నోయి వెదుకాడదేల నోయి - పి. భానుమతి
 10. స్వర్గసీమను కులుకు శ్రీదేవతవు నీవు ( పద్యాలు ) - సి. ఎస్. ఆర్. ఆంజనేయులు
 11. హాలహలమెగయునో మధురామృతమె కురియునో - ఎం. ఎస్. రామారావు, పి. భానుమతి

మూలాలు

మార్చు
 1. రమేశ్ బాబు, హెచ్. (1 October 2016). 70 ఏళ్ల 'గృహ ప్ర‌వేశం'. హైదరాబాదు: ప్రజాశక్తి. p. 12. Retrieved 2 October 2016.

వనరులు

మార్చు