జి. మీనాక్షి
జి. మీనాక్షి M.D., D.G.O. (G. Meenakshi) సుప్రసిద్ధ స్త్రీల వ్యాధుల నిపుణురాలు. ఈమె 1990 దశాకం వరకు 30-40 సంవత్సరాలుగా కింగ్ జార్జి ఆసుపత్రిలో తమ సేవలను అందించారు, ఆంధ్ర వైద్య కళాశాలలో ఎందరో విద్యార్ధులను తయారుచేశారు.
జి. మీనాక్షి | |
---|---|
జననం | గెల్లా మీనాక్షి ఇండియా |
నివాస ప్రాంతం | విశాఖపట్నం |
వృత్తి | వైద్యుడు |
మతం | హిందూ |
భార్య / భర్త | జి.వి. సత్యనారాయణ మూర్తి |
పిల్లలు | 2; కుమారులు |
వీరి తండ్రి రావు సాహెబ్ బుద్ధవరపు పాపరాజు పంతులు డిప్యూటీ తహసీల్దారుగా పనిచేసి బ్రిటిష్ ప్రభుత్వం నుండి 1930 సంవత్సరంలో రావు సాహెబ్ బిరుదును పొందారు. వీరి పితామహులు బుద్ధవరపు రామమూర్తి పంతులు. వీరి మాతామహులు డా. సి. మల్లిక్ విశాఖపట్నంలో మొట్టమొదటి విదేశ డిగ్రీ పొందిన వైద్యుడు.
ఎం.డి. డి.జి.ఓ. పూర్తయిన తర్వాత ఆంధ్ర వైద్య సర్వీసులో చేరి ఆంధ్ర ప్రదేశ్ అంతటా పనిచేశారు. ప్రొఫెసర్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్ మెంట్ గా విశాఖపట్నం, కాకినాడ, కర్నూలు వైద్య కళాశాలలో పనిచేసి కింగ్ జార్జి ఆసుపత్రి సూపరింటిండెంట్ గా 1991 లో పదవీ విరమణ చేశారు.
ఆర్. ఎమ్. వైద్య కళాశాల, చిదంబరం లోను అన్నామలై విశ్వవిద్యాలయం లో మూడు సంవత్సరాలు పనిచేసి తర్వాత యెమెన్ దేశంలో 5 సంవత్సరాలు తన నైపుణ్యాన్ని అందించారు.
ఈమె భర్త కూడా ప్రసిద్ధిచెందిన వైద్య నిపుణులు జి.వి. సత్యనారాయణ మూర్తి వీరు ఆంధ్ర వైద్య కళాశాల ప్రధానోపాధ్యాయులుగా తమ సేవలను అందించి 1959లో పరమపదించారు. వీరికి ఇద్దరు కవలలు: భరత్, కమల్. ఇరువురూ ఇంజనీర్లుగా విదేశాలలో పనిచేస్తున్నారు.
అవార్డు
మార్చు- వింటేజ్ విశాఖ అనే సంస్థ 2004 సంవత్సరంలో గెల్లా మీనాక్షి గారికి ఉగాది పురస్కారంలో సన్మానించింది.