గేట్ వాల్వు
గేట్ వాల్వులు లు ఒకరకమైన కవాటాలు. కవాటం అనగా పైపులలో ప్రవహించు ద్రవం లేదా వాయు పదార్థాల ప్రవాహాన్ని పూర్తిగా నిరోధించు లేదా నియంత్రణలో పంపించు పరికరం.ఎక్కువ పీడనం, ఎక్కువ ఉష్ణోగ్రతలో వున్నా ద్రవ, వాయు పదార్థాలయినచో లోహంతో చేసిన కవాటాలను ఉపయోగిస్తారు.తక్కువ పీడనం, సాధారణ వాతావరణ ఉష్ణోగ్రత కల్గిన నీరు వంటి ద్రవ పదార్థాలకైనచో ప్లాస్టిక్ రసాయనపదార్థాలనుపయోగించి తయారు చేస్తారు.
ముఖ్యంగా గేట్ వాల్వులను ద్రవ పదార్థాలప్రవాహాన్ని పూర్తిగా ఆపుటకు లేదా పూర్తిగా ప్రవహించునటుల వాల్వును మొత్తం తెరచి ఉపయోగిస్తారు.గ్లోబ్ వాల్వు వంటి వాటిని నియంత్ర ణ కవాటాలు అంటారు.ఈ రకం వాల్వులను పైపులలో ద్రవాల ప్రవాహాన్ని పూర్తిగా నిరోధించుటకు పూర్తిగా మూసి, లేదా అవసరమైన పరిమాణంలో, పీడనంలో ప్రవహించేలా వాల్వును కొంతమేర తెరచి వుంచెదరు.కాని గేట్ వాల్వులను కేవలం ప్రవాహాన్ని పూర్తిగా ఆపుటకు లేదా పూర్తిగా వదులుటకు ఉపయోగిస్తారు[1]. గేట్ వాల్వులో కూడా ద్రవాలు లేదా వాయువులు సరళ మార్గంలో పయనించును.ఇందులో వాల్వులో ప్రవాహాన్ని నిరోధించు భాగం గుండ్రంగా లేదా ఉలివంటి రూపము (wedge) లో వుండును. తెరచు మూయు వాల్వు భాగం తలుపు/వాకిలి (gate) వంటిది కావున ఈ కవాటాలను గేట్ వాల్వులు అని నామకరణం చేసారు.అందుకే ప్రవాహాన్ని ఆపు ఈ భాగం గుండ్రంగా లేదా టేపరుగా, ఉలి ఆకారంలో వుండును. గ్లోబ్ వాల్వులో వాల్వు డిస్కు లేదా బిళ్ళ గుండ్రంగా భూసమాంతరంగా వుండి వాల్వు సీట్ (సీట్) కున్న సిటింగురింగు పైకి, కిందికి కదులును. గేట్ వాల్వులో వాల్వు డిస్కు/బిళ్ళ కొన్నింటిలో గుండ్రంగా (వర్తులంగా) నిలువుగా వుండి పైకి, కిందికి కదులును.లేదా పైన వెడల్పుగా, కింద తక్కువ వెడల్పుతో నిలువుగా వున్న ఉలి వంటి బిళ్ల పైకి, కిందికి కదులును. అనగా బిళ్ళ అడ్డంగా కాకుండా నిలువుగా వుండి పైకి, కిందికి కదులును.వేడ్జ్/చీలిక బిళ్ళ మందం సమానంగా వుండి పైభాగం వెడల్పుగా కింది భాగం వెడల్పు తక్కు వగా వుండును.వాల్వులో వాల్వు సిటింగు అంచులు వాల్వును రెండు భాగాలుచేస్తూ నిలువుగా ఉండును.నిలువుగా వున్నవాల్వు సిటింగు మధ్య వేడ్జ్ పైకి కిందికి కదులును.
ఈ రకపు వాల్వులను పూర్తిగా తెరచి వుంచి ఉపయోగించడం వలన, ప్రవహించు పదార్థాల ప్రవాహ పీడనంలో తగ్గుదల తక్కువ ఉండును.గ్లోబ్ వాల్వులో వాల్వునియంత్రణ బిళ్ళను పాక్షికంగా తెరచి వుంచడంవలన లోపలికికి వెళ్ళు, బయటికి వచ్చు పదార్థాల పీడనం, ప్రవాహ వేగం /త్వరణములో తేడా వుండును. కాని గేట్ వాల్వును పూర్తిగా తెరచి ఉపయోగించడం వలన వాల్వులో ప్రవాహ పీడనంలో మార్పు పెద్దగా వుండదు.
వాల్వు నిర్మాణం
మార్చుగేట్ వాల్వులోని ప్రధాన భాగాలు
- బాడీ (body) (ఆకృతి నిర్మాణం)
- వాల్వు సిటింగు రింగు
- వాల్వు/వాల్వు డిస్కు లేదా వాల్వు బిళ్ళ
- బోనిట్ (కుళ్ళాయి వంటీ నిర్మాణం)
- వాల్వు డిస్కు కాడ (stem)
- గ్లాండ్
- తిప్పు చేతి చక్రం.
బాడీ
మార్చుపదార్థాలు లోపలి వచ్చు బయటికి వచ్చు బాడీరంధ్రం సరళ మార్గం (నేరుగా) లో వుండును. బాడీచివరలు ఫ్లాంజిలను లేదా మరలు కలగివుండును.తక్కువ సైజు వాల్వులను ఇత్తడి, కంచు లోహాలతో చేస్తారు.ఎక్కువ సైజు వాల్వులను పోత ఇనుము, క్యాస్ట్ స్టీలుతో చేస్తారు.
కాడ(stem)
మార్చుచిన్న వాల్వులు అయినచో ఇత్తడితో చేస్తారు. పెద్ద సైజు వాల్వులలో స్టెయిన్‌లెస్ ఉక్కుతో చేస్తారు.కాడ పనిచేయు విధానం రెండు రకాలు. ఈ విధానంలో బోనిట్ పైభాగాన, కాడ పైభాగాన మరలు వుండి, కాడను తిప్పినపుడు, కాడ పైకి కిందికి కదులును.దీనిని రైజింగు స్టెమ్ రకం అంటారు. మరో రకంలో బాడిలోపలవున్న కాడచివర, వాల్వు బిళ్ళ లోపల మరలు వుండి కాడను తిప్పినపుడు, వాల్వు డిస్కు కాడ మీద పైకి కిందికి కదులును. ఈ రకపు వాల్వును నాన్ రైజింగు స్టెమ్ రకం వాల్వు అంటారు.[2]
బోనిట్
మార్చుఇది వాల్వు బాడీ నుండి పైపులో ప్రవహించు ద్రవం లేదా వాయువు వాల్వు డిస్కుకు వున్న కాడ సందునుండి బయటికి రాకుండా/ కారకుండా చేయును.అంతేకాదు బోనిట్ వాల్వు డిస్కుకు బిగించిన కాడ/stem పైకి కిందికి కదులుటకు సహాయ పడును.బోనిట్‌కు బాడీకి బిగించు భాగానికి పైన వాల్వు డిస్కు కాడ సైజుకు సరిపడా రంద్రం వుండును.ఈ రంధ్రంనుండి లోపలి ప్రవహించు పదార్ధం బయటికి కారకుండా ఆస్బెస్టాస్ తాడును కాడ చుట్టూ చుట్టి, గ్లాండు అను ఇత్తడి రింగుతో నట్టుతో గట్టిగా బిగిస్తారు. ఈ గ్లాండు ఆస్బెస్టాస్ రోపును బోనిట్, కాడ మధ్య ఖాళీలో బలంగా సందులేకుండా వుండేలా నొక్కి వుంచడం వలన లోపలి ద్రవం లేదా వాయువు బయటికి కారాదు. బోనిట్ కింది భాగాన ఫ్లాంజి వుండును.ఈ ఫ్లాంజిని వాల్వు బాడీకి బోల్టుల ద్వారా బిగిస్తారు.చిన్న వాల్వులైన ఫ్లాంజి బదులు బోనిట్ కింది లోపలి బాగాన మరలు వుండును. బోనిట్ కున్న గ్లాండు అనేది ఆస్బెస్టాస్ రోపును/తాడును బలంగా నొక్కి వుంచుటకు మరలు వున్న నట్ ( లోపల మరలువున్న పలకల ఉపరితలం వున్న బిళ్ళ) ఉపయోగిస్తారు. కాస్ట్ స్టీలు లేదా కాస్ట్ ఐరన్ తోచేసిన వాల్వు బోనిట్ పైభాగన మరలు వుండీ, వాల్వు డిస్కు కాడకు కూడా మరలు వుండును
గేట్ వాల్వుల వినియోగం
మార్చుగేట్ వాల్వులను ఎక్కువగా నీటి సరాఫరా వ్యవస్థలో వాడుతారు. పవరు ప్లాంట్లలలో, నీటి శుద్ధికరణ ప్లాంట్లలలోఉపయోగిస్తారు[3] గరిష్ఠంగా 16 బారుపీడనం (అందాజుగా 16Kg/cm2) లో, -20 నుండి +70 °C ఉష్ణోగ్రత వున్న నిమిషానికి 5 మీటర్ల త్వరణంతో పయనించు/ప్రవహించు, నీరు లేదా నీటి వంటి తటస్థ ద్రవ పదార్థాల పంపిణికి అనుకూలం.అదే వాయువులైనచో, గరిష్ఠ ప్రవాహ వేగం 20 మీ/సెకనుకు,, ఉష్ణోగ్రత-20 నుండి +60 °C మధ్య వుండాలి.వ్యర్ధ జలాలను పంపిణి చేయుటకు ఉపయోగిస్తారు.
బయటి లింకుల వీడియోలు
మార్చుఈ వ్యాసాలు కూడా చదవండి
మార్చుమూలాలు/ఆధారాలు
మార్చు- ↑ "WHAT IS A GATE VALVE?". avkvalves.eu. Archived from the original on 2017-08-03. Retrieved 2018-02-24.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Introduction to Valves - Gate valves". wermac.org. Archived from the original on 2017-08-23. Retrieved 2018-02-24.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Gate Valve". corrosionpedia.com. Archived from the original on 2017-07-20. Retrieved 2018-02-24.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)