గొట్టె భూపతి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ ఎంపి, మాజీ ఎమ్మెల్యే. 1967 నుండి 1978 వరకు నేరెళ్ల శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా, 1983 నుండి 1989 వరకు పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం ఎంపీగా ప్రాతినిధ్యం వహించాడు.[1]

గొట్టె భూపతి
గొట్టె భూపతి


మాజీ పార్లమెట్ సభ్యుడు
పదవీ కాలం
1983 – 1989
నియోజకవర్గం పెద్దపల్లి

మాజీ ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడు (నేరళ్ళ శాసనసభ నియోకవర్గం)
పదవీ కాలం
1967 నుండి 1978 వరకు (రెండుసార్లు)

వ్యక్తిగత వివరాలు

జననం 1937 ఆగస్టు 15
తంగళ్ళపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లా, తెలంగాణ, భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ స్వతంత్ర
వృత్తి రాజకీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపి

జననం, విద్య

మార్చు

భూపతి 1937, ఆగస్టు 15న తెలంగాణ రాష్ట్రం, రాజన్న సిరిసిల్ల జిల్లా, తంగళ్ళపల్లి గ్రామంలో జన్మించాడు. తండ్రిపేరు అశోలు. భూపతి మెట్రిక్యులేట్ వరకు చదువుకున్నాడు.

వ్యక్తిగత జీవితం

మార్చు

భూపతికి శాంతతో వివాహం జరిగింది. వారికి ముగ్గురు కుమారులు జి. సుధీర్ బాబు,[2] జి. సృజన్ బాబు , జి. సుమన్ బాబు ఉన్నారు.[3]

రాజకీయ జీవితం

మార్చు

1967, 1972లలో జరిగిన అంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందాడు. ఉమ్మడి కరీంనర్‌ జిల్లా చరిత్రలో రెండుసార్లు స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన ఒకేఓక వ్వక్తి గొట్టె భూపతి.[4] 1983లో పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలో తెలుగుదేశం పార్టీ తరపున పోటీచేసి గెలుపొందిన భూపతి,[5] ఆ పార్టీ తరపున పార్లమెంటులో అడుగుపెట్టిన తొలి పార్లమెంట్ సభ్యుడిగా నిలిచాడు.[6] ఆ తరువాత 1984 ఎన్నికల్లో గెలుపొంది 1989 వరకు ఎంపీగా పనిచేశాడు.[7]

2006, జూన్ 9న భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[8]

ఎమ్మెల్యేగా

మార్చు
సంవత్సరం క్రమసంఖ్య అసెంబ్లీ నియోజకవర్గం పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు పార్టీ ఓట్లు
1967 255 నేరెళ్ల ఎస్.సి. గొట్టె భూపతి ఇండిపెండెంట్ 12243 జె.ఎం.ఆర్ దేవి ఇండిపెండెంట్ 10400
1972 255 నారెళ్ళ ఎస్.సి. గొట్టె భూపతి స్వతంత్ర 17014 బుట్టి వేరపాల్ భారత జాతీయ కాంగ్రెస్ 16024

ఎంపీగా

మార్చు
లోక్‌సభ కాలము గెలిచిన అభ్యర్థి పార్టీ
ఏడవ (ఉపఎన్నిక) 1983-84 గొట్టె భూపతి తెలుగుదేశం పార్టీ
ఎనిమిదవ 1984-89 గొట్టె భూపతి తెలుగుదేశం పార్టీ

నిర్వర్తించిన పదవులు

మార్చు
  1. 1969-78: సిరిసిల్ల కోఆపరేటివ్ ఎలక్ట్రిక్ సప్లై సొసైటీ వైస్-చైర్మన్
  2. 1968-77: ఉస్మానియా విశ్వవిద్యాలయం సెనేట్ సభ్యుడు
  3. పర్యాటక, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కన్సల్టేటివ్ కమిటీ

మూలాలు

మార్చు
  1. "Members Bioprofile (BHOOPATHY, SHRI GOTTE)". loksabhaph.nic.in. Archived from the original on 2022-03-22. Retrieved 2022-03-22.
  2. Sakshi (14 December 2023). "రాచకొండ కమిషనర్‌.. మన సుధీర్‌బాబు". Archived from the original on 25 November 2024. Retrieved 25 November 2024.
  3. Eenadu (25 November 2024). "రాచకొండ కమిషనర్‌కు మాతృవియోగం". Archived from the original on 25 November 2024. Retrieved 25 November 2024.
  4. "స్వతంత్ర వీరులు". Sakshi. 2018-11-08. Archived from the original on 2022-01-11. Retrieved 2022-03-22.
  5. "తెలంగాణలో లోక్‌సభకు 9సార్లు ఉప ఎన్నికలు". Sakshi. 2019-03-23. Archived from the original on 2022-03-22. Retrieved 2022-03-22.
  6. "ప్రజాస్వామ్యాన్ని నొక్కివేస్తున్న నోట్లస్వామ్యం". andhrajyothy. 2021-11-03. Archived from the original on 2021-11-06. Retrieved 2022-03-22.
  7. "పెద్దపల్లి టిక్కెట్‌ ఎవరికో!". m.andhrajyothy.com. 2019-03-16. Archived from the original on 2022-03-22. Retrieved 2022-03-22.
  8. V6 Velugu (18 May 2023). "దగా పడ్డ ఉద్యమకారులు దండు కట్టాలె". Archived from the original on 25 November 2024. Retrieved 25 November 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)