గొఱ్ఱెపాటి వేంకట సుబ్బయ్య

(గొర్రెపాటి వెంకట సుబ్బయ్య నుండి దారిమార్పు చెందింది)

గొఱ్ఱెపాటి వేంకట సుబ్బయ్య (1898 - 1981) తొలినాటి గ్రంథాలయోద్యమ ప్రముఖులలో ఒకరు. బహు గ్రంథకర్త.

గొఱ్ఱెపాటి వేంకటసుబ్బయ్య
జననం1898
మరణం1981
సుపరిచితుడు/
సుపరిచితురాలు
రచయిత, స్వాతంత్ర్య సమరయోధుడు, గ్రంథాలయోద్యమ నేత

బాల్యము మార్చు

గొఱ్ఱెపాటి వేంకట సుబ్బయ్య 1898సంవత్సరంలో ఘంటసాల గ్రామంలో జన్మించారు. వీరి విద్యాభ్యాసం ఘంటసాల, బందరులో సాగింది. ముట్నూరి కృష్ణారావు, చెరుకువాడ వేంకట నరసింహం, కౌతా శ్రీరామమూర్తిల వద్ద వీరు విద్యనభ్యసించారు. బెంగాలీ భాషను ప్రత్యేకంగా అభ్యసించారు. 17వ యేటి నుండే వీరు రచనలు చేయడం ప్రారంభించారు.

గ్రంథాలయోధ్యమముతో అనుబంధము మార్చు

జీవిత చరిత్ర రచనలతో ప్రసిద్ధి గన్న శ్రీ గొఱ్ఱెపాటి వేంకట సుబ్బయ్య గారు కృష్ణా జిల్లా ఘంటసాల గ్రామం లోని రామమోహన గ్రంథాలయము అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. ఎన్నో గ్రంథాలయ సభలను నిర్వహించారు. అయ్యంకి వారి సేవా కార్యక్రమాలకు చేదోడు వాదోడుగా ఉన్నారు. గ్రంథాలయ సర్వస్వము పత్రికా సాంపాదకులలో వీరు కూడా ఒకరు. ఈయన స్వయంగా బాల వాఙ్మయము, గాంధి వాఙ్మయము మొదలైన గ్రంథ సూచికలను తయారు చేశారు. అన్నింటికి మించి గొఱ్ఱెపాటి వారు మహోన్నత వ్యక్తి.

రచనలు మార్చు

జీవితచరిత్రలు మార్చు

  1. సరోజినీ నాయుడు
  2. డాక్టరు సి.ఆర్.రెడ్డి
  3. కాశీనాథుని నాగేశ్వరరావు పంతులుగారి జీవితము - సాహిత్యము
  4. ఆచార్య యన్.జి.రంగా[1]
  5. నవమేధావి నార్ల
  6. రసతపస్వి కృష్ణరావు
  7. రాజకీయ రథసారథి కొత్త రఘురామయ్య
  8. సారథి రామబ్రహ్మం
  9. మన కిసాన్ వెంకటసుబ్బయ్య
  10. చలం జీవితం - సాహిత్యం
  11. శరత్ జీవితం
  12. మన రైతు పెద్ద (గొట్టిపాటి బ్రహ్మయ్య జీవితచరిత్ర)
  13. ఎందరో మహానుభావులు
  14. దేశోద్ధారక చరిత్ర
  15. జాతి నిర్మాతలు
  16. ఘంటసాల చరిత్ర
  17. కొమ్మారెడ్డి గోపాలకృష్ణయ్య, ఆంజనేయులు, పట్టాభిరామయ్య గార్ల జీవిత విశేషాలు
  18. మిత్రులూ- నేనూ (రెండు భాగాలు)
  19. వల్లభాయి పటేల్

ఇతరములు మార్చు

  1. హంపీ పిలుపు
  2. తెలుగు సాహిత్యం తీరుతెన్నులు
  3. భట్టుమూర్తి-రామరాజభూషణుడా
  4. గాంధిమహాత్ముని నిర్బంధము
  5. నా సాహిత్యకృషి
  6. శరద్దర్శనం
  7. అక్షరాభిషేకం
  8. మధురజీవనం
  9. సూక్తులు
  10. వేదన
  11. మాట మన్నన
  12. సతీస్మృతి
  13. మన జమీందారీలు
  14. గీతాభూమిక

రాజకీయాలు మార్చు

వీరు సాహిత్యంలోనే కాక రాజకీయాలలో కూడా పాల్గొని మహాత్మా గాంధీ అడుగు జాడలలో నడిచి ఉప్పు సత్యాగ్రహము, జమీందారీ వ్యతిరేకోద్యమము, అస్పృశ్యతా నివారణోద్యమము, మద్యపాన నిషేధోద్యమం మొదలైన ఉద్యామాలలో పాల్గొని కారాగారవాసాన్ని కూడా అనుభవించారు[2].

మూలాలు మార్చు

గ్రంథాలయోద్యమ శిల్పి అయ్యంకి అనుగ్రంథము. పుట. 97

  1. "ఆచార్య యన్.జి.రంగా పుస్తకం పి.డి.ఎఫ్.రూపంలో". Archived from the original on 2018-01-22. Retrieved 2018-01-15.
  2. గెల్లి, రామమోహనరావు (5 November 1978). "జీవిత చరిత్ర రచయిత - పండిత గొఱ్ఱెపాటి వేంకట సుబ్బయ్య". ఆంధ్రపత్రిక దినపత్రిక. No. సంపుటి 65, సంచిక 200. Retrieved 15 January 2018.[permanent dead link]