గొర్లె శ్రీరాములు నాయుడు

గొర్లె శ్రీరాములు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయవేత్త, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. శ్రీకాకుళం రాజకీయాలలో 1956 నుండి 1983 వరకు సేవలందించాడు.

జీవిత విశేషాలు మార్చు

నాయుడు స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పాతర్లపల్లి గ్రామం. అతను తన స్వగ్రామం పాతర్లపల్లి సర్పంచిగా 1959లో ఎన్నికయ్యాడు. 1964లో సమితి అధ్యక్షుడిగా ఎన్నికై శ్రీకాకుళం జిల్లా పరిషత్తు ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టాడు. 1978లో ఆంధ్రప్రదేశ్ ఎం.ఎల్.సి గా ఎన్నికయ్యాడు. అతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సహాయ మంత్రిగా పనిచేసాడు. మంత్రిగా ఉంటూనే 1981 జిల్లా పరిషత్తు ఛైర్మన్‌గా వ్యవహరించాడు.[1] 1983 ఆంధ్రప్రదేశ్ శాసన సభ ఎన్నికలలో చీపురుపల్లి శాసనసభ నియోజకవర్గం ఎన్నికలలో పోటీ చేసి త్రిపురాన వెంకటరత్నం చేతిలో ఓడిపోయాడు.[2]

మడ్డువలస ప్రాజెక్టు మార్చు

శ్రీకాకుళం జిల్లాలో మడ్డువలస రిజర్వాయర్ కు గొర్లె శ్రీరాములు నాయుడు గారి పేరు పెట్టారు. మడ్డువలస రిజర్వాయర్ ప్రాజెక్ట్ ఒక మధ్యస్థ నీటిపారుదల ప్రాజెక్టు. దీనిని నాగవాళి నది ఉపనది అయిన సువర్ణముఖి (విజయనగరం జిల్లా) మీదుగా రిజర్వాయర్ ఏర్పాటు చేసారు.[3] ఈ ప్రాజెక్టుకు "శ్రీ గొర్లె శ్రీరాములు నాయుడు మడ్డువలస రిజర్వాయర్ ప్రాజెక్టు" గా నామకరణం చేసారు.

సంస్మరణ మార్చు

ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ (ఇంటక్) ఆధ్వర్యంలో కిమ్స్ ఆస్పత్రి రోడ్లో సింహద్వారం దగ్గర గొర్లె శ్రీరాములు నాయుడు విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ ఆవిష్కరించాడు.[4]

మూలాలు మార్చు

  1. "ఇదీ సంగతి: ఇంట గెలిచి... అంతెత్తుకు ఎదిగి!!". ETV Bharat News (in ఇంగ్లీష్). Retrieved 2021-06-13.
  2. "State Elections 2004 - Partywise Comparision for 18-Cheepurupalli Constituency of ANDHRA PRADESH". affidavitarchive.nic.in. Retrieved 2021-06-13.
  3. "Sri Gorle Sriramulu Naidu Madduvalasa Reservoir Project (Phase-I)". irrigationap.cgg.gov.in. Retrieved 2021-06-13.
  4. admin. "స్వర్గీయ గొర్లె శ్రీరాములు నాయుడు విగ్రహావిష్కరణ | Vizag Express" (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2021-06-13. Retrieved 2021-06-13.