చీపురుపల్లి

ఆంధ్రప్రదేశ్, విజయనగరం జిల్లా, చీపురుపల్లి మండల జనగణన పట్టణం

చీపురుపల్లి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లా, చీపురపల్లి మండలానికి చెందిన జనగణన పట్టణం.

చీపురుపల్లి
చీపురుపల్లి రైల్వే స్టేషన్ నామఫలకం
చీపురుపల్లి రైల్వే స్టేషన్ నామఫలకం
పటం
చీపురుపల్లి is located in ఆంధ్రప్రదేశ్
చీపురుపల్లి
చీపురుపల్లి
అక్షాంశ రేఖాంశాలు: 18°18′0″N 83°34′0″E / 18.30000°N 83.56667°E / 18.30000; 83.56667
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లావిజయనగరం
మండలంచీపురుపల్లి
విస్తీర్ణం3.48 కి.మీ2 (1.34 చ. మై)
జనాభా
 (2011)[1]
14,847
 • జనసాంద్రత4,300/కి.మీ2 (11,000/చ. మై.)
అదనపు జనాభాగణాంకాలు
 • పురుషులు6,878
 • స్త్రీలు7,969
 • లింగ నిష్పత్తి1,159
 • నివాసాలు3,544
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్535 128
2011 జనగణన కోడ్582830

గణాంకాలు

మార్చు

చీపురుపల్లి ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లాలోని ఒక జనగణన పట్టణం. 2011 భారత జనాభా లెక్కలు ప్రకారం చీపురుపల్లి పట్టణ జనాభా మొత్తం 14,847, ఇందులో పురుషులు 6,878 కాగా, 7,969 మంది మహిళలు ఉన్నారు.పట్టణ పరిధిలో 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 1399, ఇది మొత్తం జనాభాలో 9.42%గా ఉంది. చీపురుపల్లి పట్టణ పరిధలోని స్త్రీల లింగ నిష్పత్తి, రాష్ట్ర సగటు 993 తో పోలిస్తే 1159గా ఉంది. పిల్లల లింగ నిష్పత్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సగటు 939 తో పోలిస్తే 916 గా ఉంది. రాష్ట్ర సగటు అక్షరాస్యత 67.02% పోలిస్తే అక్షరాస్యత 74.41%గా ఉంది. పురుషుల అక్షరాస్యత 80.77% ఉండగా, స్త్రీల అక్షరాస్యత 69.05 %గా ఉందిపట్టణ పరిధిలో 3,544 ఇళ్లకు పైగా పరిపాలన ఉంది, వీటికి నీరు, మురుగునీరు వంటి ప్రాథమిక సదుపాయాలను స్థానిక స్వపరిపాలన సంస్థ అందిస్తుంది. ఇది సెన్సస్ టౌన్ పరిధిలోని రహదారులను నిర్మించడానికి, దాని పరిధిలో ఉన్న ఆస్తులపై పన్ను విధించడానికి అధికారం ఉంది.[2]

గ్రామ విశేషాలు

మార్చు

శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారి జాతర మహోత్సవం ప్రతి సంవత్సరం మూడు రోజులపాటు నిర్వహించబడింది. ఆలయకమిటీ ఛైర్మన్ జి.వాసుదేవరావు అమ్మవారికి తొలిపూజ జరిపి జాతరను ప్రారంభిస్తాడు. ఈ జాతర సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు ప్రభలు కట్టుకుని మేళతాళాలతో ఆలయాన్ని దర్శిస్తారు

శాసనసభ నియోజకవర్గం

మార్చు

కనకమహాలక్ష్మి జాతర

మార్చు

చీపురుపల్లి కనకమహాలక్ష్మి అమ్మవారి జాతర మహా శివరాత్రి అనంతరం మొదటి ఆదివారం ప్రారంభమై మూడు రోజులపాటు కన్నుల పండువగా సాగుతుంది.[3]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 ఆంధ్ర ప్రదేశ్ జిల్లాల జనగణన దత్తాంశ సమితి - పట్టణాలు (2011), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q58768667, archived from the original on 15 March 2018
  2. "Cheepurupalle Census Town City Population Census 2011-2021 | Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2021-08-06.
  3. "చూసొద్దామా కనకమహాలక్ష్మి జాతర". EENADU. Retrieved 2022-03-05.

వెలుపలి లంకెలు

మార్చు