గోకరాజు రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ

(దీనిని GRIET అని కూడా పిలుస్తారు) హైదరాబాద్ నగరంలోని ఒక ఇంజనీరింగ్ కళాశాల

గోకరాజు రంగరాజు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ (దీనిని GRIET అని కూడా పిలుస్తారు) హైదరాబాద్ నగరంలోని ఒక ఇంజనీరింగ్ కళాశాల.[1] ఇది అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఎఐసిటిఇ) చే ఆమోదించబడిన స్వయం ప్రతిపత్తి హోదా కలిగిన కళాశాల. ఈ ఇంజనీరింగ్ కళాశాల నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ (NBA) చేత 'ఎ' గ్రేడ్ గుర్తింపు పొందింది. ఈ కళాశాల హైదరాబాద్ లోని జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయానికి అనుబంధ కళాశాలగా ఉంది.[2]

గోకరాజు రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ
రకంవిద్యాసంస్థ
స్థాపితం1997
చైర్మన్గోకరాజు గంగరాజు
ప్రధానాధ్యాపకుడుజె.ప్రవీణ్
డైరక్టరుజంధ్యాల నారాయణ మూర్తి
విద్యాసంబంధ సిబ్బంది
389
అండర్ గ్రాడ్యుయేట్లు4320
పోస్టు గ్రాడ్యుయేట్లు300+
చిరునామనిజాంపేట్ రోడ్,బాచుపల్లి, కూకట్‌పల్లి (మేడ్చల్ జిల్లా), హైదరాబాదు 500090, తెలంగాణ, భారతదేశం
17°31′13″N 78°22′00″E / 17.5203479°N 78.3665555°E / 17.5203479; 78.3665555
కాంపస్Rural, spread over 18 ఎకరాలు (0.073 కి.మీ2) in Bachupally Village
AcronymGRIET
గోకరాజు రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ is located in Telangana
గోకరాజు రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ
Location in Telangana
గోకరాజు రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ is located in India
గోకరాజు రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ
గోకరాజు రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ (India)

2020 ఎన్‌ఐఆర్‌ఎఫ్(NIRF) ర్యాంకింగ్స్ ప్రకారం, GRIET ఇంజనీరింగ్ విభాగంలో 172 వ స్థానంలో నిలిచింది.[3]

చరిత్ర

మార్చు

గోకరాజు రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ(GRIET) కళాశాల 1997 లో గోకరాజు రంగరాజు ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో స్థాపించబడింది, దీనిని GRIET చైర్మన్ డా|| గోకరాజు గంగ రాజు స్థాపించారు.

విభాగాలు

మార్చు

ఈ కళాశాలలో తొమ్మిది విభాగాలు ఉన్నాయి:

అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు

మార్చు
  • బేసిక్ సైన్సెస్[4]
  • బయోటెక్నాలజీ [5]
  • సివిల్ ఇంజనీరింగ్
  • కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్
  • ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్
  • ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్
  • ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
  • మెకానికల్ ఇంజనీరింగ్

పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు

మార్చు
  • M.Tech VLSI
  • M.Tech CSE
  • M.Tech సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్
  • M.Tech పవర్ ఎలక్ట్రానిక్స్
  • M.Tech డిజైన్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్
  • M.Tech ఎంబెడెడ్ సిస్టమ్స్
  • ఎంబిఎ
  • ఎంసిఎ

ఈ కళాశాలలో 2009లో IEEE సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్థాపించబడింది.

ఇనిస్టిట్యూట్ లో ఈ దిగువ పేర్కొన్న ప్రత్యేక విభాగాలు ఉన్నాయి:

  • స్కూల్ ఆఫ్ ఎలక్ట్రికల్ సైన్సెస్[6]
  • స్కూల్ ఆఫ్ కంప్యూటింగ్ టెక్నాలజీస్[7]

గ్రంథాలయం

మార్చు

1997లో కళాశాల స్థాపించిన సంవత్సరంలో గ్రంథాలయాన్ని ప్రారంభించారు. ఈ గ్రంధాలయం విద్యార్థులకు, పరిశోధన పండితులకు (రీసెర్చ్ స్కాలర్లు) అలాగే కళాశాల ఉపాధ్యాయులకు, సిబ్బందికి అధ్యయనం చెయ్యడానికి అలాగే పరిశోధనలు గావించడానికి అందుబాటులో ఉంటుంది.

ఈ గ్రంధాలయ సేకరణలో 9000 శీర్షికలు, 300 బ్యాక్ వాల్యూమ్స్ రీసెర్చ్ జర్నల్స్ ఇంకా 600 ప్రాజెక్ట్ రిపోర్టులతో 78,000 పుస్తకాలు ఉన్నాయి. ఇక్కడ 250 జాతీయ, అంతర్జాతీయ పరిశోధనా జర్నల్స్ అందుబాటులో ఉంటాయి. ఈ గ్రంథాలయంలో ఆడియో విజువల్ వనరుల సౌకర్యం కూడా ఉంది.

మూలాలు

మార్చు
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-01-07. Retrieved 2021-02-22.
  2. "Affiliated Colleges for the Academic Year 2019-20". jntuhaac.in. Retrieved 2021-02-22.
  3. "MHRD, National Institute Ranking Framework (NIRF)". www.nirfindia.org. Archived from the original on 2021-01-27. Retrieved 2021-02-22.
  4. "Basic Sciences". Archived from the original on 2 February 2010. Retrieved 20 January 2010.
  5. "Biotechnology". Archived from the original on 2 February 2010. Retrieved 20 January 2010.
  6. School of Electrical Sciences
  7. School of Computing Technologies[dead link]