కూకట్‌పల్లి (మేడ్చల్ జిల్లా)
కూకట్‌పల్లి, తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ జిల్లా,కూకట్‌పల్లి మండలంలోని పట్టణ ప్రాంతం.[1]
కూకట్‌పల్లి | |
---|---|
హైదరాబాదు పరిసరాలు | |
![]() రెయిన్ ట్రీ పార్క్ (మలేషియా టౌన్‌షిప్) | |
ముద్దుపేరు(ర్లు): Kp | |
నిర్దేశాంకాలు: 17°29′N 78°25′E / 17.483°N 78.417°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మోడ్చల్ |
నగరం | కూకట్పల్లి |
ప్రభుత్వం | |
• ప్రభుత్వ రకం | పురపాలక సంఘం |
• నిర్వహణ | GHMC |
విస్తీర్ణం | |
• మొత్తం | 20.68 km2 (7.98 sq mi) |
జనాభా వివరాలు (2020) | |
• మొత్తం | 2,52,830 |
• సాంద్రత | 12,225/km2 (31,660/sq mi) |
భాష | |
• అధికారిక | తెలుగు, ఉర్థూ |
కాలమానం | UTC+5:30 (IST) |
పిన్‌కోడ్ | 500 072, 500 085 |
భారత వాహన రిజిస్ట్రేషన్ ప్లేట్లు | TS-07 |
లోకసభ నియోజకవర్గం | మల్కాజ్‌గిరి |
శాసనసభ నియోజకవర్గం | కూకట్పల్లి |
నగరపాలక సంస్థ | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
ఇది హైదరాబాదు నగరంలో ఒక భాగంగా ఉంది.గనుక గ్రామం అనడం సబబు కాదు. ఇది హైదరాబాదుకు పశ్చిమోత్తరంగా ఉంది.
నూతన మండల కేంద్రంగా గుర్తింపు సవరించు
లోగడ కూకట్‌పల్లి గ్రామం లోగడ రంగారెడ్డి జిల్లా, రాజేంద్రనగర్ రెవిన్యూ డివిజను పరిధిలోని మల్కాజ్‌గిరి మండల పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణలో భాగంగా కూకట్‌పల్లి పట్టణ ప్రాంతాన్ని (1+05) ఆరు పట్టణ ప్రాంతాలతో నూతన మండల కేంధ్రంగా మేడ్చల్ జిల్లా, మల్కాజ్‌గిరి రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[2]
అభివృద్ది సవరించు
1990 దశకంనుండి బాగా జనావాసాలు పెరగడం వలన, చుట్టుప్రక్కల ప్రాంతాలు కూడా వాణిజ్యకేంద్రాలుగా అభివృద్ధి చెందడం వలన ప్రస్తుతం కూకట్‍పల్లి అత్యధిక జనసాంద్రత ఉన్న ప్రదేశాలలో ఒకటి అయ్యింది.1980 దశకంలో తెలంగాణ హౌసింగ్ బోర్డు వారు నిర్మించిన పెద్ద రెసిడెన్షియల్ టౌన్‌షిప్ తో మొదలుకొని ఈ ప్రాంతం చాలా వేగంగా అభివృద్ధి చెందింది. పెద్ద పెద్ద అపార్టుమెంటులు, మధ్య తరగతి ఇళ్ళు, రద్దీగా ఉండే వాణిజ్య సెంటర్, విజయవాడ వైపు ప్రయాణానికి మొదలయ్యే బస్సులు కూకట్‌పల్లిలో ప్రముఖంగా కనిపించే అంశాలు.
కూకట్‌పల్లి అంటే ఏమిటి ఆ పేరు ఎలా వచ్చింది సవరించు
కూకట్‌పల్లి అంటే ఏమిటి, ఆ ప్రాంతానికి ఆ పేరు ఎందుకు/ఎలా వచ్చిందో తెలియరావటంలేదు. ఈ విషయం మీద సమాచారం ఎక్కడా లేదు.
వాణిజ్య ప్రదేశం సవరించు
కె.పి.హెచ్.బి. కాలనీ ఆరంభంలో మెయిన్ రోడ్ మీద ఉన్న షాపింగ్ ప్రాంతంలో అనేక షోరూములు, ఇతర కమర్షియల్ కాంప్లెక్సులు ఉన్నాయి. పెద్ద పెద్ద బట్టల దుకాణాలు ఇక్కడి ప్రత్యేకత. అనేక బ్యాంకులు, రెస్టారెంట్లు కూడా ఉన్నాయి. సమీపంలోనే ఒక రైతు బజారు ఉంది. దగ[1]్గరలోని మూసాపేటలో "మెట్రో" అనే మెగామార్కెట్ ఉంది. అపోలో, రెమిడీ, ప్రసాద్, ప్రైమ్, టాడ్లా వంటి ఆసుపత్రులున్నాయి.
రవాణా సౌకర్యాలు సవరించు
హైదరాబాదు నగరంలో భాగంగా అన్ని ప్రాంతాలకు సిటీ బస్సు సర్వీసులున్నాయి. ఆటోలు కూడా సర్వసామాన్యం. హైవే గాను, నగరం లోపలి రోడ్డుగానూ ఉన్నందున ఇక్కడ ట్రాఫిక్ రద్దీ చాలా ఎక్కువ. ఇది హైదరాబాదును పటాన్ చెరువు, బి.హెచ్.ఇ.ఎల్.కు కలిపే రోడ్డు. ఎ.పి.ఎస్.ఆర్.టి.సి. బస్సులు, అనేక ప్రైవేటు బస్సులు కె.పి.హెచ్.బి. కాలనీ నుండి విజయవాడవైపు నిత్యం బయలుదేరుతుంటాయి. హైదరాబాదు ఎమ్.ఎమ్.టి.ఎస్. రైలు స్టాపు కూడా సమీపంలో ఉంది. ప్రస్తుతం హై-టెక్ సిటీకి కూకట్‌పల్లి నుండి ఉన్న రోడ్డు విస్తరణ జరిగింది. క్రొత్త బ్రిడ్జి నిర్మించారు. మలేషియన్ టౌన్‌షిప్ మీదుగా హై-టెక్ సిటీకి ఈ దారి వెళుతుంది. ఇక్కడ కూకట్‌పల్లి మెట్రో స్టేషను, కె.పి.హెచ్.బి. కాలనీ మెట్రో స్టేషనులు ఉన్నాయి.
విద్య సౌకర్యాలు సవరించు
నారాయణ, చైతన్య వంటి అనేక జూనియర్ కాలేజీలు ఉన్నాయి. జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విద్యాలయం ప్రధాన కాంపస్ ఇక్కడే ఉంది.
కూకట్‌పల్లి ప్రాంతంలో ఉన్న కాలనీలు సవరించు
గణేష్ నగర్, వివేకానందనగర్, ఎ.ఎస్.రాజు నగర్, ఆల్విన్ కాలనీ, కమలప్రసన్న నగర్, మాధవరాం నగర్, వెంకటరావు నగర్, సుమిత్రానగర్, సంగీతనగర్, ధర్మారెడ్డి కాలనీ, బాగ్ అమీర్, భాగ్యనగర్ కాలనీ, జయనగర్, మాధవీనగర్, హెచ్.ఎమ్.టి. హిల్స్, తులసినగర్, జలవాయు విహార్, హెచ్.ఎమ్.టి. శాతవాహన, కె.పి.హెచ్.బి. కాలనీ, వసంతనగర్, సర్దార్ పటేల్ నగర్, భగత్ సింగ్ నగర్, ప్రగతినగర్, నిజాంపేట్, మయూరినగర్, జగద్గిరిగుట్ట, రామ్ నరేష్ నగర్ (హైదర్ నగర్), విజయనగర్, బాలాజీనగర్.
ఇతర ప్రాంతాలకు దూరాలు సవరించు
- అమీర్ పేట్ (6 కి.మీ. - Y జంక్షన్ నుండి)
- బాచుపల్లి (3 కి.మీ. - నిజాంపేట రోడ్ జంక్షన్ నుండి)
- బాలానగర్ (3 కి.మీ. - Y జంక్షన్ నుండి)
- బోరబండ (6 కి.మీ. - Y జంక్షన్ నుండి)
- బౌరంపేట (6 కి.మీ. - Y జంక్షన్ నుండి)
- ఎర్రగడ్డ (2 కి.మీ. - Y జంక్షన్ నుండి)
- హపీజ్ పేట (4 కి.మీ. - నిజాంపేట రోడ్ జంక్షన్ నుండి)
- కొండాపూర్ (5 కి.మీ. - హైటెక్ సిటీ MMTS నుండి)
- మాధాపూర్ (4 కి.మీ. - హైటెక్ సిటీ MMTS నుండి)
- మల్లంపేట (5 కి.మీ. - నిజాంపేట రోడ్ జంక్షన్ నుండి)
- మియాపూర్ (3 కి.మీ. - నిజాంపేట రోడ్ జంక్షన్ నుండి)
- మూసాపేట (1 కి.మీ. - Y జంక్షన్ నుండి)
- నిజాంపేట (1 కి.మీ. - నిజాంపేట రోడ్ జంక్షన్ నుండి)
- పంజాగుట్ట (9 కి.మీ. - Y జంక్షన్ నుండి)
- సంజీవరెడ్డి నగర్ (5 కి.మీ. - Y జంక్షన్ నుండి)
- వసంతనగర్ (0.5 కి.మీ. - నిజాంపేట రోడ్ జంక్షన్ నుండి)
ఇవి కూడా చూడండి సవరించు
మూలాలు సవరించు
- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2018-06-03.
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 249 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016