గోపరాజు విజయం
గోపరాజు విజయం సామాజిక కార్యకర్త, నాస్తికుడు. అతను హేతువాది .గోరా కుమారుడు. The Atheist పత్రిక సహ సంపాదకుడు. పొలిటికల్ సైన్సులో డాక్టరేటు పొందారు. విజయవాడ నాస్తిక కేంద్ర నిర్వాహకుడు.[1] పొలిటికల్ సైన్స్ లో ప్రొఫెసర్ అయిన అతను శాంతి, పర్యావరణాలను ప్రోత్సహించడానికి అవిశ్రాంతంగా కృషి చేశాడు.
జివిత విశేషాలు
మార్చుకృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో 1936 లో జన్మించాడు. ముదునూరులో, విజయవాడలోని పటమాటలో పాఠశాల విద్యనభ్యసించిన తరువాత అతను విజయవాడ నగరంలోని ఎస్ఆర్ఆర్, సివిఆర్ కాలేజీ నుండి డిగ్రీ కోర్సును అభ్యసించాడు. 1961-63లో విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి పొలిటికల్ సైన్స్ లో ఎంఏ పూర్తి చేశాడు. అతను 1968 లో యుఎస్ బయలుదేరే ముందు అదే విశ్వవిద్యాలయంలో లెక్చరర్‌గా కూడా పనిచేశాడు. అక్కడ అతను మార్టిన్ లూథర్ కింగ్ స్కూల్ ఆఫ్ సోషల్ చేంజ్, చెస్టర్, పెన్సిల్వేనియాలో, మైనారిటీలు, నల్లజాతి వర్గాల సమస్యలను అధ్యయనం చేయడానికి వెళ్ళాడు. మరుసటి సంవత్సరం, అతను డెలావేర్ విశ్వవిద్యాలయంలో రీసెర్చ్ అసిస్టెంట్‌గా పనిచేశాడు. రాజకీయ శాస్త్రం, రాజకీయ సిద్ధాంతం, రాజ్యాంగాలను బోధించాడు. 1970 లో, డెలావేర్ విశ్వవిద్యాలయం నుండి పొలిటికల్ సైన్స్లో తన రెండవ మాస్టర్స్ సంపాదించాడు.
అతను ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించాడు. మానవతావాద, నాస్తిక ఉద్యమాలు, లౌకిక ఆత్మ, విమర్శనాత్మక ఆలోచనలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించాడు.[2] అతను 1940 లో తన తల్లిదండ్రులచే విజయవాడలో స్థాపించబడిన నాస్తిక కేంద్రానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా భాద్యతలు చేపట్టాడు. శాంతి, సంఘర్షణల పరిష్కారానికి, గాంధేయ తత్వశాస్త్రం, అహింస, సామాజిక అభివృద్ధి, పౌర సమాజ ఉద్యమంపై అధ్యయనాలకు చురుకుగా సహకరించాడు.
వ్యక్తిగత జీవితం
మార్చుఆయన భార్య సుమతీ విజయం. వారి కుమారుడు వికాస్ గోరా. సుమతీ విజయం 2013 నవంభరు 17న మరణించింది.
మరణం
మార్చు2020 మే 22న ఉదయం 5 గం॥లకు విజయవాడలోని నాస్తిక కేంద్రంలో తన 84వ యేట మరణించాడు. [3] గత కొంతకాలంగా అల్జీమర్‌తో బాధపడుతున్నాడు. అతని మృతదేహాన్ని వైద్య పరిశోధనల కోసం ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రికి విరాళంగా ఇచ్చారు.
రచనలు
మార్చు- దేశదేశాలలో నాస్తికత్వం 1981
- స్వేచ్చా సమరయోధులు 1982
మూలాలు
మార్చు- ↑ Sumathi Vijayam dead
- ↑ Varma, P. Sujatha (2020-05-22). "Atheist leader Goparaju Vijayam passes away". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2020-05-25.
- ↑ ఆంధ్రజ్యోతిలో మరణ వార్త