గోపాలకృష్ణ గోఖలే

సామాజిక మరియు రాజకీయ నాయకుడు

గోపాలకృష్ణ గోఖలే (మే 9, 1866 - ఫిబ్రవరి 19, 1915) [1][2][3][4] భారత స్వాతంత్ర్య సమర యోధుడు, సామాజిక సేవకుడు. భారత జాతీయ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు. 1885 నుంచి 1905 వరకు మితవాదులు ప్రాబల్యం వహించిన భారత జాతీయ కాంగ్రెస్లో ప్రముఖపాత్ర వహించాడు. 1902 నుంచి 1915లో మరణించే వరకు భారత శాసనమండలి సభ్యుడిగా ఉన్నాడు. 1905లో సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని ఏర్పాటుచేశాడు. బ్రిటీష్ వారి విధానాలను తీవ్రంగా వ్యతిరేకించకున్ననూ భారతీయులలో జాతీయతాభావాన్ని పెంపొందించడానికి కృషిచేశాడు.

గోపాల కృష్ణ గోఖలే
CIE
गोपाळ कृष्ण गोखले
GKGokhale.jpg
1909 లో గోఖలే
జననం(1866-05-09)1866 మే 9
కొత్లుక్, రత్నగిరి జిల్లా, బాంబే ప్రెసిడెంసీ, బ్రిటిష్ ఇండియా
మరణం1915 ఫిబ్రవరి 19(1915-02-19) (వయసు 48)
బాంబే, బాంబే ప్రెసిడెంసీ, బ్రిటిష్ ఇండియా
విద్యాసంస్థఎల్ఫిన్ స్టోన్ కళాశాల
వృత్తిఆచార్యుడు, రాజకీయ నాయకుడు
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్
ఉద్యమంభారత స్వాతంత్ర్యోద్యమము
జీవిత భాగస్వామిసావిత్రి బాయి(1880-1887)
రిషిబామ (1887-1899)
పిల్లలుకాశీ బాయి, గోధు బాయి
తల్లిదండ్రులుకృష్ణారావు గోఖలే (తండ్రి)
వలు బాయి: తల్లి

బాల్యం, విద్యసవరించు

గోపాల కృష్ణ గోఖలే 1866 మే 9 సంవత్సరంలో బాంబే ప్రెసిడెన్సీ (ప్రస్తుత మహారాష్ట్ర) లోని కొతాలుక్ లో జన్మించాడు. వారిది పేద బ్రాహ్మణుల కుటుంబం. కానీ ఆయన తల్లిదండ్రులు ఆయనకు ఆంగ్ల మాధ్యమంలోనే విద్యను ఏర్పాటు చేశారు. ఆ విద్యతో బ్రిటీష్ ప్రభుత్వంలో ఏదైనా గుమాస్తాగానో, చిరుద్యోగిగానే స్థిరపడతాడని వారి ఆలోచన. కళాశాల విద్యనభ్యసించిన మొదటి తరం భారతీయుల్లో గోఘలే ప్రముఖుడు. 1884లో ఎఫిన్‌స్టోన్ కళాశాల నుంచి విద్యను పూర్తి చేశాడు. ఆంగ్ల మాధ్యమంలో విద్యనభ్యసించడం వలన ఆయన ఆంగ్లంలో నిష్ణాతుడవడమే మాకుండా పాశ్చాత్య రాజకీయాలను అవగాహన చేసుకున్నాడు. పాశ్చాత్య తత్వ శాస్త్రాన్నీ ఆకళింపు చేసుకున్నాడు. జాన్ స్టువార్ట్ మిల్, ఎడ్మండ్ బర్క్ లాంటి తత్వవేత్తల భావనలను అమితంగా అభిమానించేవాడు.

భారత స్వాతంత్ర్యోద్యమముసవరించు

ఇతను సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని స్థాపించాడు.

జిన్నాకు, గాంధీకి గురువుసవరించు

ముహమ్మద్ అలీ జిన్నా, మహాత్మా గాంధీ లకు రాజకీయ గురువు.

గోఖలే ఇన్‌స్టిట్యూట్సవరించు

గోఖలే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పొలిటిక్స్ అండ్ ఎకనామిక్స్ (GIPE), సాధారణంగా గోఖలే ఇన్‌స్టిట్యూట్ అనే పేరుతో ప్రసిద్ధి. భారత్ లో ప్రాచీన ఆర్థికశాస్త్ర విద్యాలయం. ఇది మహారాష్ట్ర పుణె లోని జింఖానా ప్రాంతంలో గలదు. సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ వారి ఆర్థిక సహాయముతో స్థాపించబడిన విద్యాలయం. నేటికినీ సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ వారే ఈ విద్యాలయానికి ట్రస్టీలు.

కుటుంబంసవరించు

గోఖలే రెండు సార్లు వివాహం చేసుకున్నాడు. 1880 లో ఆయనకు సావిత్రీ బాయితో బాల్య వివాహం జరిగింది. ఆమె కొంతకాలానికి అనారోగ్యంతో మరణించింది. తర్వాత 1887లో రిషిబామ అనే ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆమె ఇద్దరు కుమార్తెలను జన్మనిచ్చి 1899లో మరణించింది. తర్వాత ఆయన మళ్ళీ వివాహం చేసుకోలేదు. ఆయన సంతానాన్ని బంధువులే పెంచి పెద్దచేశారు.[1]

మూలాలుసవరించు

  1. 1.0 1.1 Talwalkar, Govind (2015). Gopal Krishna Gokhale : Gandhi's political guru. New Delhi: Pentagon Press. ISBN 9788182748330. OCLC 913778097.
  2. Sastri, Srinivas. My Master Gokhale.
  3. Talwalkar, Govind (2006). Gopal Krishna Gokhale: His Life and Times. Rupa & Co,.
  4. Talwalkar, Govind (2003). Nek Namdar Gokhale (in Marathi). Pune, India: Prestige Prakashan.{{cite book}}: CS1 maint: unrecognized language (link)

వెలుపలి లంకెలుసవరించు