గోపాలపట్నం (విశాఖపట్నం)

(గోపాలపట్నం (గ్రామీణ) నుండి దారిమార్పు చెందింది)

గోపాలపట్నం,భారతదేశంలోని విశాఖపట్నం జిల్లా, మహా విశాఖ నగరపాలక సంస్థ పరిధిలో పశ్చిమ అంచున ఉన్న ప్రాంతం.[1] ఈ ప్రాంతం విశాఖపట్నం నగరంలో ప్రధాన నివాస, వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతం.. ఈ ప్రాంత పౌర సౌకర్యాలకు మహా విశాఖ నగరపాలక సంస్థ బాధ్యత వహిస్తుంది.గోపాలపట్నం పరిసర ప్రాంతంలో 2020 మే,7న గ్యాస్ లీక్ జరిగింది.ఈ ప్రాంతంలో గవర నాయుడు కమ్యూనిటీ అత్యధికంగా కేంద్రీకృతమై ఉంది[2].

గోపాలపట్నం
Neighbourhood
BRTS Road at Gopalapatnam
BRTS Road at Gopalapatnam
గోపాలపట్నం is located in Visakhapatnam
గోపాలపట్నం
గోపాలపట్నం
గోపాలపట్నం
Coordinates: 17°44′53″N 83°13′07″E / 17.748066°N 83.218745°E / 17.748066; 83.218745
Country India
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాVisakhapatnam
Founded byGovernment of Andhra Pradesh
Government
 • TypeMayor-council
 • BodyGVMC
భాషలు
 • అధికారతెలుగు
Time zoneUTC+5:30 (IST)
పిన్‌కోడ్
530027
Vidhan Sabha constituencyVisakhapatnam West
Lok Sabha constituencyVisakhapatnam

పరిసర ప్రాంతాలు

మార్చు

సీతమ్మధార, గాజువాక, పెందుర్తి పొరుగున ఉంది.[3]

శబ్దవ్యుత్పత్తి శాస్త్రం

మార్చు

గోపాలరాజు పేరు మీద గోపాలపట్నం పేరు పెట్టారు. అతను ఒకప్పుడు కోట గుట్ట, ఏనుగుల ద్వారం, గుర్రాల చెరువు, తాటి పెంట ప్రాంతాలను పరిపాలించాడు. తరువాత అవి గోపాలపట్నం ఏర్పడటానికి ఐక్యమయ్యాయి.

స్థానం, భౌగోళికం

మార్చు

గోపాలపట్నం విశాఖపట్నం విమానాశ్రయం నుండి 8 కి.మీ., విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుండి 4 కి.మీ.దూరంలో ఉంది.గోపాలపట్నం ప్రాంత ప్రజలకు వాల్టెయిర్ డివిజన్ లోని సింహాచలం రైల్వే స్టేషన్ సేవలు అందిస్తుంది.ఈ స్టేషన్ జాతీయ రహదారి16, రాష్ట్ర రహదారి 39 (ఆంధ్రప్రదేశ్) కలుపుతూ గోపాలపట్నం పరిసరాలకు 3 నుండి 4 కి.మీ.మధ్యలో ఉంది.[4][5]

రవాణా

మార్చు

గోపాలపట్నం ప్రాంతానికి జాతీయ రహదారి16, రాష్ట్ర రహదారి 39 (ఆంధ్రప్రదేశ్) సౌకర్యం ఉంది.[6] సమీపంలోని మండలాలు, విశాఖపట్నాలకు అనుసంధానించే ప్రధాన జిల్లా రహదారులు కూడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ద్వారా గోపాలపట్నం బస్ స్టేషన్ నుండి రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతాలకు, విశాఖపట్నం నగరంలోని ముఖ్య ప్రాంతాలకు బస్సు సేవలను అందిస్తుంది.

గణాంకాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. "location". maps of india. 15 December 2016. Retrieved 11 July 2015.
  2. TAPPER, BRUCE ELLIOT. Rivalry and tribute : society and ritual in a Telugu village in South India. p. 9.
  3. Sarma, G. V. Prasada (2013-06-06). "Visakhapatnam residential colony faces infrastructure woes". The Hindu. ISSN 0971-751X. Retrieved 2019-06-01.
  4. Staff Reporter (2019-05-06). "Heavy security for 'Chandanotsavam' at Simhachalam temple in A.P." The Hindu. ISSN 0971-751X. Retrieved 2019-06-01.
  5. India, The Hans (2018-11-11). "GVMC to launch BRTS works soon". www.thehansindia.com. Retrieved 2019-06-01.
  6. Sep 10, TNN | Updated; 2018; Ist, 2:37. "Soon, alternative road to Gopalapatnam will ease traffic snarls at NAD junction | Visakhapatnam News - Times of India". The Times of India. Retrieved 2019-06-01. {{cite web}}: |last2= has numeric name (help)CS1 maint: numeric names: authors list (link)

వెలుపలి లంకెలు

మార్చు