గోపిన కృష్ణప్రసాద్

శ్రీకాకుళం జిల్లాకు చెందిన రైతు, పురస్కార గ్రహీత

గోపిన కృష్ణప్రసాద్
జననం
జాతీయతభారతీయుడు
వృత్తినూతన సాంకేతికతలతో ప్రాకృతిక వ్యవసాయం చేసే రైతు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
365 రోజుల రాబడి, పాలీహౌస్ వ్యవసాయం

గోపిన కృష్ణప్రసాద్, శ్రీకాకుళం జిల్లా కొంగరాం గ్రామానికి చెందిన ఆదర్శరైతు. వ్యవసాయంలో నూతన పద్ధతులను ప్రవేశపెట్టి చుట్టుపట్ల రైతులకు ఆదర్శప్రాయుడయ్యాడు. పాత్రికేయ వృత్తిని వదలి వ్యవసాయం చేపట్టి విజయం సాధించాడు. 2023 లో జాతీయ స్థాయిలో నేషనల్ మిలియనీర్ ఫార్మర్ పురస్కారాన్ని పొందాడు.

జీవిత విశేషాలు

మార్చు

గోపిన కృష్ణప్రసాద్ శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల మండలం లోని కొంగరాం గ్రామానికి చెందినవాడు. అతనిది వ్యవసాయ కుటుంబం. చదువయ్యాక ఇంగ్లీషు దినపత్రికలో విలేకరిగా ఉద్యోగం చేసాడు.

పాత్రికేయం నుండి వ్యవసాయం లోకి

మార్చు

2015 లో కృష్ణప్రసాద్ పాత్రికేయ వృత్తిని వదలి తన గ్రామం లోనే వ్యవసాయం చేపట్టాడు. పొలంలో బోరు వేయించి, ఆ నీటితో బిందుసేద్యాన్ని చేపట్టాడు. కొత్త వ్యవసాయ పద్ధతులను, కొత్త సాంకేతికతనూ ప్రవేశపెట్టడంలో ఆసక్తి చూపిస్తూ, ఆమదాలవలస లోని కృషి విజ్ఞాన కేంద్రం వారి మార్గదర్శకత్వంలో తన పొలంలో పాలీహౌస్[గమనిక 1] నిర్మించాడు. అందులో కాయగూరలు వేసాడు. క్యాప్సికం, బీర, బెండ, గోరుచిక్కుళ్ళు వంటి పంటలు పండించాడు. ఆ తరువాత శ్రీ సాగు పద్ధతిలో వరిసాగు కూడా చేసాడు. పొలంలోని పంపుసెట్లను నడిపించేందుకు సౌరవిద్యుత్తును వినియోగించుకున్నాడు.[1] ఏడాది పొడుగునా ఆదాయం వచ్చేలా పంటలు పండించడం కృష్ణప్రసాద్ ప్రత్యేకత. కార్తీక మాసంలో పూలకు గిరాకీ బాగా ఉంటుందని ఆ సమయానికి పూలసాగు చేపడతాడు.[2]

కృష్ణప్రసాద్ కృషిని గుర్తించిన భారతీయ వ్యవసాయ మండలి (ఐసీఏఆర్‌), కృషి జాగరణ్‌ సంస్థలు సంయుక్తంగా ప్రసాదించే మిలీనియం ఫార్మర్ పురస్కారం 2023 సంవత్సరానికి పొందాడు. 2023 డిసెంబరు 8 న ఢిల్లీలో ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నాడు.[3]

గమనికలు

మార్చు
  1. గ్రీన్‌హౌస్ లాగానే పాలీహౌస్ కూడా కృత్రిమ వాతావరణంలో చేసే ఒక సాగు పద్ధతి. ఇందులో గ్లాసుకు బదులు పాలిథీన్‌ను వాడుతారు. నీటిని బిందుసేద్యం ద్వారా అందిస్తారు.

మూలాలు

మార్చు
  1. "రాతి నేలని... పూలవనం చేశాడు". EENADU. Archived from the original on 2023-12-24. Retrieved 2023-12-24.
  2. "బతుకు బాగు". Sakshi. 2023-12-16. Archived from the original on 2023-12-24. Retrieved 2023-12-24.
  3. ABN (2023-12-08). "కృష్ణప్రసాద్‌కు జాతీయ ఉత్తమ అవార్డు". Andhrajyothy Telugu News. Archived from the original on 2023-12-24. Retrieved 2023-12-24.