గోమఠం శ్రీనివాసాచార్యులు
గోమఠం శ్రీనివాసాచార్యులు రంగస్థల నటుడు, నాటక రచయిత. 1880లో మద్రాస్ లో ది మద్రాసు ఓరియంటల్ డ్రమాటిక్ కంపెనీ అనే నాటక సంస్థసు స్థాపించాడు.[1]
గోమఠం శ్రీనివాసాచార్యులు | |
---|---|
జాతీయత | భారతీయుడు |
వృత్తి | రంగస్థల నటుడు, నాటక రచయిత |
నాటకరంగ ప్రస్థానం
మార్చురచించిన నాటకాలు
మార్చు- హరిశ్చంద్ర, ది మైర్టీర్ టూ ట్రూత్ (ఆంగ్లం) : హరిశ్చంద్ర ఆంగ్ల నాటకం 1892-93 మధ్యకాలంలో జగన్నాథవిలాసినీసభ వారిచే ప్రదర్శించబడి, 1897లో ముద్రించబడింది. ఈ నాటకంలో మూడు అంకాలు, అనేక రంగాలు ఉన్నాయి.
- కమలాపహరణము: ఇది పది అంకాల నాటకం. పార్శీ నాటక సమాజంవారు మద్రాస్ వచ్చిన సమయంలో ప్రదర్శించిన గులేబకావలి అనే హిందుస్థానీ నాటకాన్ని చూసిన శ్రీనివాసాచార్యులు ఆ కథను స్వీకరించి తెలుగులో కమలాపహరణము నాటకంగా రాశాడు. ఇది 1919లో ముద్రించబడింది.
- అసంపూర్ణ నాటకం: ఈ నాటకంలోని 3 అంకాలు మాత్రమే లభించాయి. ఆ భాగాలు 1955 జూలై-ఆగస్టు నెలలో ఆంధ్రదిన పత్రికలో ప్రచురితమయ్యాయి. ఇది వ్యవహారిక భాషలో రాయబడిన కల్పిత కథ.
మూలాలు
మార్చు- ↑ గోమరం శ్రీనివాసాచార్యులు, తెలుగు నాటక వికాసము, పి.ఎస్.ఆర్. అప్పారావు, నాట్యమాల ప్రచురణ, ప్రథమ ముద్రణ (డిసెంబర్ 23, 1967), పుట. 277-278.