గోరా (నవల)
గోరా, రవీంద్రనాథ్ టాగూర్ బెంగాలీలో రచించిన నవలల్లో ఒకటి. ఈ నవలను వేంకట పార్వతీశ కవులు అదే పేరుతో తెలుగు లోకి అనువదించారు. కె సి. అజయ్ కుమార్ మళయాళంలోకి చేసిన అనువాదానికి కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం లభించింది.[1]
రచయిత(లు) | రవీంద్రనాథ్ టాగూర్ |
---|---|
మూల శీర్షిక | గోరా |
అనువాదకులు | వేంకట పార్వతీశ కవులు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
శైలి | కాల్పనిక |
ప్రచురణ కర్త | చాగంటి సత్యనారాయణ మూర్తి |
ముఖ్య పాత్రలు
మార్చుగోరామోహన్ (గోరా లేదా గౌర్) ఆనందమయి, కృష్ణ దయాల్ దంపతుల కుమారుడు. అతని సవతి తమ్ముడు మాహిం. అతనికి ప్రియ స్నేహితుడు వినయ్. సుచిత్ర అనే అమ్మాయి అంటే గోరాకు ఇష్టం. ఈ గోరామోహనే ఈ నవలకు హీరో.
వినయ్ మోహన్ లేదా వినయ్: ఇతను లలిత భర్త, గోరా ప్రియ స్నేహితుడు
సుచిత్ర(జన్మ నామం రాధరాణి): పరేష్ బాబు, వరదసుందరి దంపతుల పెంపుడు కూతురు, సతీష్ సోదరి, ఆమె సవతి సోదరిమణులు లలిత, లావణ్య, లీల
లలిత: పరేష్ బాబు వరదసుందరి దంపతుల రెండో కూతురు, వినయ్ భార్య
పరేష్ చంద్ర భట్టాచార్య అతన్నే ప్రకాష్ బాబు అని కూడా పిలుస్తుంటారు. వరద సుందరి భర్త. లావణ్య, లలిత, లీలల తండ్రి
ఆనందమయి: గోరా తల్లి, మాహిం కు సవతి తల్లి, కృష్ణ దయాల్ భార్య. ఆవిడది ఒక చిత్రమైన అధ్యాత్మికత నాయకురాలి పాత్ర.గోరా అధ్యాతిమిక/ వేదాంత దృష్టిని రూపొందిమించటంలో ఆవిడది ప్రముఖ పాత్ర. ఆవిడ బోధనల వల్ల గోరా ఆలోచనా సరళి మారి, మంచి ఆలోచనలవైపు మళ్ళుతుంది.
మూలాలు
మార్చు- ↑ "..:: SAHITYA : Akademi Awards ::." sahitya-akademi.gov.in.