గోరుకంటి రవీందర్ రావు

గోరుకంటి రవీందర్ రావు దక్షిణ భారతదేశంలో ప్రముఖ ఆసుపత్రి యైన యశోదా హాస్పిటల్స్ అధినేత.[1]

గోరుకంటి రవీందర్ రావు
జననం
మేడిపల్లి, వరంగల్ జిల్లా, తెలంగాణా
విద్యఇంజనీరింగ్
విద్యాసంస్థఎన్. ఐ. టి వరంగల్
వృత్తిపారిశ్రామికవేత్త
తల్లిదండ్రులు
  • యశోదా దేవి (తల్లి)

వ్యక్తిగత జీవితం

మార్చు

ఆయన తెలంగాణా రాష్ట్రంలోని వరంగల్ జిల్లా, మేడిపల్లి గ్రామంలో జన్మించాడు. తండ్రి ఒక రెవెన్యూ గుమాస్తా. వీరు నలుగురు పిల్లలు. ఇందులో రవీందర్ రావు ఇంజనీరింగ్ చదవగా మరో ఇద్దరు వైద్యులు, ఒకరు సి.ఏ చదివారు. తల్లి యశోదా దేవి గృహిణి. ఆమె పొద్దున, సాయంత్రం పిల్లలను దగ్గర కూర్చోబెట్టుకుని శ్రద్ధగా చదివిస్తూ ఉండేది. రవీందర్ ఐదో తరగతిలో ఉండగా తండ్రికి వరంగల్ కు బదిలీ కావడంతో కుటుంబం అక్కడికి మారింది. ఆయనకు తర్వాత వేరే చోటకు బదిలీ అయినా పిల్లల చదువులకు ఇబ్బంది కలగకూడదని తల్లి కాజీపేటలో కాపురం ఉంటూ పిల్లలను చదివించింది.

ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత ఆర్. ఇ. సి వరంగల్ (ప్రస్తుతం ఎన్. ఐ. టి వరంగల్) లో సీటొచ్చింది. ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత రిగ్స్ అనే ప్రభుత్వ విభాగంలో ఉద్యోగం వచ్చింది. అదే సమయంలో తమ్ముడు సురేందర్ రావు వైద్య విద్య పూర్తి చేసుకుని ఇరాన్ వెళ్ళాడు. తమ్ముడు మంచి అవకాశం కోసం ఇరాన్ కు ఆహ్వానించడంతో ఆయన ధ్రువపత్రాల జిరాక్సు కోసం ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఆ అవకాశం తప్పిపోయినా జిరాక్స్ వ్యాపారానికి డిమాండు ఉంటుందని తన దగ్గరున్న సొమ్మునంతా సమకూర్చుకుని కోఠిలో ఒక చిన్న దుకాణం ప్రారంభించాడు. మొదట్లో పెద్దగా పనిలేకపోవడంతో ఒక మునిసిపల్ ఉద్యోగంలో చేరాడు. అక్కడి నుంచి మళ్ళీ సర్వే విభాగానికి పంపించారు. ఓ కాంట్రాక్టుకు సంబంధించిన పత్రాలు జిరాక్సు తీస్తుండగా ఒక సర్వే కాంట్రాక్టు భాగస్వామిగా చేరి మంచి లాభం సంపాదించాడు.

మూలాలు

మార్చు
  1. "తమ్ముణ్ణి రప్పించడానికే ఆస్పత్రి మొదలు పెట్టా". eenadu.net. హైదరాబాదు: ఈనాడు. Archived from the original on 27 January 2017. Retrieved 27 January 2017.