గోల్ గుంబద్ లేదా గోల్ గుంబజ్ : (Gol Gumbaz) or Gol Gumbadh, కన్నడ: ಗೋಲ ಗುಮ್ಮಟ, Urdu: گول گمبد, పర్షియన్ భాషలో گل گنبذగుల్ గొంబాద్ అనగా గులాబీ గుమ్మటం, (గుమ్మటం చుట్టూ అడుగుభాగాన గులాబీ లేదా తామర రేకుల వంటి నిర్మాణం వుంటుంది, ఈ రేకుల మధ్యనుండి ఈ గుంబద్ మొగ్గలా వుంటుంది కావున దీనికా పేరు), ఇది బిజాపూరు సల్తనత్ కు చెందిన సుల్తాన్ ముహమ్మద్ ఆదిల్ షా యొక్క సమాధి. ఇది బీజాపూరు (కర్ణాటక) లో ఉంది. దబూల్ కు చెందినా యాకూబ్ అనే ఆర్కిటెక్ట్ దీనిని 1656 లో నిర్మించాడు. ఇది దక్కను సుల్తానుల నిర్మాణశైలికి ఒక మంచి ఉదాహరణ.[1]
ఈ నిర్మాణం ఘనాకారంలో వున్నది, 47.5 మీటర్లు (156 అ.) ప్రతి మూలా ఒక గుమ్మటం 44 మీ. (144 అ.) ఉండేలా నిర్మింపబడింది. ఇందోలో గల ఆర్చీలు షడ్ముఖ ఆకారంలో డిజైన్ చేయబడి ఉంది. నలువైపులా గల మీనార్లు (టవర్లు) ఏడు అంతస్తులు గలవి. వీటి లోపల ఎక్కడానికి మెట్ల నిర్మాణం ఉంది.[1] పై భాగంలో గుంబద్ చుట్టూ విశాలభాగం ఉంది. సమాధి గల హాలులోని మధ్య భాగంలో చతురస్రాకారంలో ఒక అరుగు వున్నది, సరిగా ఈ అరుగు క్రింది భాగానగల హాలులో అసలు సమాధి ఉంది.[1] With an area of 1,700 మీ2 (18,000 sq ft), [2] ఈ గుంబద్ భారతదేశంలోనే అతి పెద్ద గుంబద్.
ఈ గుంబద్ లోపలి భాగంలో చేసే చిన్న శబ్దం సైతం సమాధి అవతలి భాగంలో వినబడుతుంది.[2]
↑ 2.02.1Archaeological Survey of India (2011). "Gol Gumbaz, Bijapur". Archaeological Survey of India. Archaeological Survey of India. Retrieved 14 September 2011.