ఉర్దూ భాష

భారత, పాకిస్తాన్ లలో మాట్లాడే ఇండో ఆర్యన్ భాష
(Urdu language నుండి దారిమార్పు చెందింది)

ఉర్దూ (Urdu audio speaker iconఉచ్ఛారణ ) లేదా స్థానికంగా లష్కరీ (لشکری) ఒక ఇండో-ఆర్యన్ భాష, భారత దేశంలో జన్మించిన భాష. భారతదేశపు 23 ఆధికారిక భాషల్లో ఒకటి. ఈ భాషకు మాతృక ఖరీబోలి లేదా హిందుస్తానీ. లష్కరి, రీఖ్తి దీనికి ఇతర నామాలు. అరబ్బీ (అరబిక్), బ్రజ్ భాష, పారశీకం (పర్షియన్), ఆంగ్లం మొదలగు భాషల సమ్మేళనం. ఉత్తర భారత దేశంలోని ముస్లింలు, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ లోని పట్టణ ప్రాంతాలలోని ముస్లింలు, పాకిస్తాన్ లోని కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్, తదితర నగరాలు, పట్టణాలలో ముస్లింలు మాత్రమే కాకుండా సింధీలు, సిక్కులు, హిందువులు కూడా ఉర్దూ ఎక్కువగా మాట్లాడుతారు.[2]

ఉర్దూ (లష్కరీ)
(لشکری) اُردو 
: Urdu example.svg 
ఉచ్ఛారణ: "ఉర్-దూ" (లష్కరీ)
మాట్లాడే దేశాలు: భారత దేశం, పాకిస్తాన్, యు.ఎ.ఇ., యు.ఎస్.ఎ., యు.కె., కెనడా, ఫిజీ 
ప్రాంతం: దక్షిణ ఆసియా (భారత ఉపఖండం)
మాట్లాడేవారి సంఖ్య: 100–130 మిలియన్ స్థానికులు
250 మిలియన్ మొత్తం 
ర్యాంకు: 19–21 (స్థానికంగా మాట్లాడేవారు), ఇటాలియన్ , టర్కిష్ భాషలతో ఇంచుమించు సమానం
భాషా కుటుంబము:
 ఇండో-ఇరానియన్
  ఇండో-ఆర్యన్
   సెంట్రల్ జోన్
    ఉర్దూ (లష్కరీ) 
వ్రాసే పద్ధతి: ఉర్దూ అక్షరమాల (నస్తలీఖ్ లిపి
అధికారిక స్థాయి
అధికార భాష:  పాకిస్తాన్ ;
 భారతదేశం (ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, బీహారు, ఢిల్లీ, జమ్మూ కాశ్మీరు, మధ్య ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్);
 Fiji (హిందుస్తానీ అంటారు)
నియంత్రణ: జాతీయ భాషా ప్రాధికరణము,
NCPUL, ఉర్దూ భాషాభివృద్ధి జాతీయ కౌన్సిలు[1]
భాషా సంజ్ఞలు
ISO 639-1: ur
ISO 639-2: urd
ISO 639-3: urd 
Urdu_official-language_areas.png

చరిత్ర

13వ శతాబ్దం దక్షిణాసియా లోని ముస్లింల పరిపాలనా రాజుల సభలలో సభా భాషగా ఇండో-ఆర్యన్ (హిందూ-ఆర్యన్) ల మాండలికంగా ప్రారంభమయినది. ఢిల్లీ సుల్తానుల, మొఘల్ సామ్రాజ్యపు అధికార భాషగా విరాజిల్లినది. నాగరిక, సాహిత్య, పద్యరూపాలకు పరిపూర్ణభాషగా పర్షియన్ ఉపయోగంలో ఉండేది. మతపరమయిన, ధార్మికపరమయిన భాషగా అరబ్బీ ఉండేది. ఢిల్లీసుల్తానుల కాలంలో దాదాపు అందరు సుల్తానులు, అత్యున్నత పదాధికారులందరూ మధ్య ఆసియాకు చెందిన పర్షియన్-తురుష్కులే. వీరి మాతృభాష చొఘ్తాయి లేదా టర్కిక్ భాష. మొఘలులుకూడా మధ్యాసియాకు చెందిన పర్షియన్ లే. వీరి ప్రథమభాష టర్కీ, తరువాత వీరు పర్షియన్ (పారసీ, ఫారసీ భాష) భాషను తమభాషగా ఉపయోగించసాగారు. మొఘలులకు పూర్వం, పర్షియన్ భాష అధికార భాషగాను సభ్యతా, సాహితీభాషగా పరిగణించబడింది. బాబరు మాతృభాష టర్కీ, టర్కీభాషలోనే బాబరు తన రచనలు చేశాడు. ఇతని కుమారుడు హుమాయూన్ కూడా టర్కీభాషనే అవలంబించాడు. మొఘల్ కాలపు హిందూ-పర్షియన్ చరిత్రకారుడు మొఘల్ పరిపాలన, అక్బర్ పరిపాలన కాలంలో పర్షియన్ భాష తన సభ్యత, విశాలదృక్పథాలు, సరళతా కారణాలవల్ల ప్రధాన భాషగా ఆమోదం పొందిన భాషగా వర్ణిస్తాడు.[3] టర్కీ, పర్షియన్, బ్రజ్ భాష, హిందవి, హర్యానవి, హిందీ భాషల సమ్మేళనభాషగా ఉర్దూ జన్మించింది. ఈ భాష దక్షిణాసియాలో ప్రధానంగాను, ప్రపంచమంతటా పాక్షికంగాను వాడుకలో ఉంది. ఢిల్లీ, హైదరాబాదు, కరాచి, లక్నో, లాహోరు లలో తనముద్రను ప్రగాఢంగా వేయగల్గింది.

స్వాతంత్రోద్యమంలో ఉర్దూ భాష

స్వాతంత్ర్యోద్యమంలో నినాదాలు, పద్యాలు, కవితలు, గేయాలు దాదాపు ఉర్దూ భాష ఉద్భావితాలే. హస్రత్ మోహానీ, రాంప్రసాద్ బిస్మిల్, ముహమ్మద్ ఇక్బాల్, గాలిబ్ కవితలు ఉద్యమాన్ని ఎంతో ప్రభావితం చేసాయి.

అభిప్రాయాలు

స్వాతంత్ర్య ఉద్యమంలో ఉర్దూ భాష కీలక పాత్ర పోషించిందని రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ, ప్రవాసాంధ్రుల విభాగం మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నాడు. ఉర్దూ భాష మనందరి భాషగా గుర్తించాలన్నాడు. (ఈనాడు 17.8.2009).

ఉర్దూ అనే పేరు ఎలా వచ్చింది?

 
జబాన్-ఎ-ఉర్దూ-ఎ-ముఅల్లా అనే పదం ("లష్కరీ భాష") నస్తలీఖ్ లిపిలో వ్రాయబడింది.
 
నాస్టాలిక్ వర్ణమాలలో "లష్కరి భాష" అనే శీర్షిక

రీఖ్తి, లష్కరి (సైనిక), భాషగా పేరు పడ్డ ఉర్దూ, షాజహాన్ కాలంలో ఉర్దూ అనేపేరును పొందింది. ఉర్దూ అనే పదానికి మూలం టర్కిష్ పదము ఉర్ద్ లేదా ఓర్ద్, అనగా సైన్యము, సైన్యపు డేరా, లేదా బజారు. దీనిని లష్కరీ జబాన్ లేదా 'సైనికులభాష' గా పేరొచ్చింది. ఎర్రకోట నిర్మాణసమయంలో దీనిపేరు ఉర్దూగా స్థిరమయినది. సైనికులమధ్య వ్యావహారిక భాషగా మార్పుచెందుతూ, బజారులలో, వ్యాపారలావాదేవీల వ్యవహారాలలో, సభలలో తుదకు ఆస్థానాల ప్రధాన ఆధికారిక భాషగా స్థానం పొందింది. నవాబులు ఉర్దూను పోషించారు. రానురాను సాహితీభాషగా పద్యభాగానికి అనువైన భాషగా మార్పుచెందింది. ఉత్తరభారతదేశంలో ప్రధానభాషగా మారింది. రానురాను పర్షియన్ భాష స్థానాన్ని ఆక్రమించింది. పశ్చిమోత్తరభారతదేశంలో ప్రధానభాషగా ఉండినది. 1947లో భారతదేశం విడగొట్టబడి పాకిస్తాన్ ఏర్పడినప్పుడు, పాకిస్తాన్ అధికారభాషగా ఆమోదింపబడింది. స్వతంత్రభారతదేశంలో అధికారభాష ప్రకటనా సమయంలో హిందీ భాషకు సమానంగా ఉర్దూకూ ఓట్లొచ్చాయి, పార్లమెంటులో హిందీ భాష ఆమోదం పొందింది. హిందీ-ఉర్దూ చెట్టాపట్టాలేసుకొని హిందవి లేదా హిందూస్తానీ భాషగానూ ప్రజామోదం పొందింది.

ఉర్దూ లిపి

ఉర్దూ లిపి నస్తలీఖ్, అరబ్బీ, పర్షియన్ భాషల సాంప్రదాయం. కుడివైపు నుండి ఎడమవైపుకు వ్రాస్తారు. అరబ్బీ భాష లోని శబ్దాలను (అరబ్బీ భాషలో ప,ట,చ,డ,గా శబ్దాలు లేవు) పర్షియన్ భాషనుండి ప,ట,చ,డ,గా శబ్దాలను సంగ్రహించి ఉర్దూ భాషా శబ్దాలను ఏర్పరచారు.

మాండలికాలు

 
The Urdu Nastaʿliq alphabet, with names in the Devanāgarī and Latin alphabets
 
ఉర్దూ అక్షరమాల. (నస్తలీఖ్ అక్షరాలలో)

ఉర్దూ భాషకు నాలుగు మాండలికాలు గలవు. అవి

దక్కనికు ఇతర పేర్లు దఖ్ఖని, దేశియా, మిర్గాన్.

ఉర్దూ సాహిత్యం

ఉర్దూ మూడు శతాబ్దాలుగా సాహితీభాషగా విరాజిల్లుచున్నది. దీనికి మునుపు పర్షియన్, అరబ్బీ భాషాసాహిత్యాలు ప్రముఖంగా ఉపయోగపడేవి. ఉర్దూభాషా సాహిత్యం ప్రపంచ సాహిత్యంలో తనదంటూ ఒక స్థానం సంపాదించుకోగలిగినది.

గద్యం

ధార్మికసాహిత్యం

ఇస్లామీయ, షరియా సాహిత్యంలో అరబ్బీ, పర్షియన్ ల తరువాత ఉర్దూ ప్రముఖం. ఖురాన్ తర్జుమాలు, హదీసులు, ఫిఖహ్, ఇస్లామీయ చరిత్ర, మారిఫత్ (ఆధ్యాత్మికము), సూఫీ తత్వము,, ధార్మికశాస్త్రాల సాహిత్యం చూడవచ్చు.

ఖససుల్ అంబియా, తఫ్ హీముల్ ఖురాన్, తర్జుమానుల్ ఖురాన్, తఫ్సీరుల్ ఖురాన్, ఫజాయల్-ఎ-ఆమాల్, బెహిష్తీ జేవర్, బహారె షరీయత్లు ప్రముఖం.

సాహితీ

గద్య సాహిత్యంలో ఇవి ముఖ్యం. దాస్తాన్, అఫ్సానా, నావల్ (నవల), సఫర్ నామా, మజ్ మూన్, సర్ గుజిష్త్, ఇన్ షాయియ, మురాసల, ఖుద్ నవిష్త్.

పద్యం

పద్యం లేదా కవితాసాహిత్యానికి చాలా అనువైనభాషగా ఉర్దూకు పేరుగలదు.

గజల్ ఉర్దూకవితా శిరస్సుపై వజ్రకిరీటం. ఉర్దూ ద్వారా గజల్కు పేరురాలేదు గాని, గజల్ ద్వారా ఉర్దూకు ఖ్యాతి వచ్చింది అంటే అతిశయోక్తిగాదు.

పద్యసాహిత్యంలో కవితలను ఈవిధంగా వర్గీకరించవచ్చు. నజమ్, గజల్, మస్ నవి, మర్సియా, దోహా, ఖసీదా, హమ్ద్, నాత్, ఖతా, రుబాయి, షెహ్ర్-ఎ-ఆషూబ్.

కవి తనకవితలలో తన కలంపేరు 'తఖల్లుస్' ఉపయోగిస్తాడు.

అరూజ్ లేదా ఛందస్సు

అరూజ్ అనగా కవితా రచనలో తీసుకోవలసిన సాంప్రదాయక విలువలు. కవితలు ఒక క్రమంగా తఖ్తీని గలిగి వుంటాయి. ఒక బహర్ (మీటర్) లో ఇమడబడి ఉంటుంది. తఖ్తీ మూలాన్ని బహర్ అని, బహర్ లో ఉండే శబ్దాలను అర్కాన్ లని అంటారు. అరూజ్ లో ముఖ్యమైన పదాలు అరూజ్, తఖ్తీ, బహర్, జమీన్, అర్కాన్.

షారిఖ్ జమాల్ నాగ్ పూరి అరూజ్ విద్వాంసుడు. ఇతని శిష్యగణం భారతదేశమంతటా, ముఖ్యంగా దక్షిణభారతదేశమంతటా గలరు.

వ్యావహారికము

ఉదాహరణలు

తెలుగు వాడుక ఉర్దూ లిపిలో తెలుగు లిప్యాంతరీకరణ యధానువాదం (గమనిక)
నమస్కారము السلام علیکم అస్సలామ్ ఒ అలైకుమ్ "మీకు శాంతి కలుగును గాక." ( అరబ్బీ నుండి.)
(ప్రతి) నమస్కారము و علیکم السلام వ అలైకుమ్ అస్సలామ్ "మీకునూ శాంతి కలుగును గాక." (అరబ్బీ నుండి)
నమస్తే (آداب (عرض ہے ఆదాబ్ (అర్జ్ హై) "గౌరవాన్ని ప్రకటించడం" (సెక్యులర్ విధానము)
మంచిది. వెళ్ళి రండి خدا حافظ ఖుదా హాఫిజ్ "అల్లాహ్ మిమ్మల్ని కాపాడు గాక"
అవును ہاں హాఁ అవును (సాధారణ వ్యవహారం)
అవును جی జీ అండీ (గౌరవ సూచకం)
అవునండీ جی ہاں జీ హాఁ అవునండీ (మర్యాదపూర్వంగా)
లేదు نا నా (సాధారణ వ్యవహారం)
లేదండి نہیں، جی نہیں నహీఁ, జీ నహీఁ లేదు (సాధారణ వ్యవహారం);లేదండీ (మర్యాదపూర్వంగా)
దయచేసి, దయవుంచి مہربانی మెహర్బానీ (కర్‌కె) దయ (ఉండి)
ధన్యవాదాలు شکریہ షుక్రియా ధన్యవాదాలు
దయచేయండి, స్వాగతం تشریف لائیے తష్రీఫ్ లాయియే "గౌరవంగా స్వాగతించడం"
దయచేసి కూర్చోండి تشریف رکھیئے తష్రీఫ్ రఖియే "గౌరవంగా కూర్చోబెట్టడం"
మీతోకలసి చాలా సంతోషించాను اپ سے مل کر خوشی ہوئی ఆప్ సే మిల్ కర్ ఖుషీ హుఈ "మీతోకలవడం ఆనందదాయకం"
మీరు ఇంగ్లీషు మాట్లాడగలరా? کیا اپ انگریزی بولتے ہیں؟ క్యా ఆప్ అంగ్రేజీ బోల్ తే హైఁ? "మీకు ఇంగ్లీషు వచ్చా?"
నేను ఉర్దూ మాట్లాడలేను. میں اردو نہیں بولتا/بولتی మైఁ ఉర్దూ నహీఁ బోల్ తా/బోల్ తీ బోల్ తా (పుంలింగము), బోల్ తీ (స్త్రీలింగము)
నా పేరు ... میرا نام ۔۔۔ ہے మేరా నామ్ .... హై
లక్నో ఎక్కడుంది? لکھنئو کہاں ہے؟ లక్నో కహాఁ హై
ఉర్దూ మంచి భాష. اردو اچھی زبان ہے ఉర్దూ అచ్ఛీ జబాన్ హై

ఉర్దూ ఫాంట్స్

 
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలలో జరిగిన  తెలంగాణ సాహిత్య దినోత్సవం కార్యక్రమంలో  ప్రముఖ ఉర్దూ కవి కాజీ ఫారుక్ ఆరిఫీ గారికి జీవన సాఫల్య పురస్కారం అందజేత

ఉర్దూ భాషా ఫాంట్ల అభివృద్ధి, భారత ప్రభుత్వం మానవ వనరుల అభివృద్ధి శాఖ, ఐ.టి. శాఖ, ఎన్. సి. పి. యు. ఎల్. (నేషనల్ కౌన్సిల్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఉర్దూ లాంగ్వేజ్) సంయుక్తంగా అభివృద్ధి పరచారు. దీని వలన ఇతర దేశాల (పాకిస్తాన్) పై ఆధారపడే దురవస్థ నుండి బయట పడ్డారు.[2]

ఇవి కూడా చూడండి

  1. ఉర్దూ సాహిత్యము
  2. ఉర్దూ ప్రముఖులు
  3. ఉర్దూ కవులు
  4. ముషాయిరా (కవిసమ్మేళనం)
  5. ఉర్దూ రచయితలు
  6. ఉర్దూ షాయిరి
  7. ప్రముఖ ఉర్దూ పుస్తకాలు
  • 1938-మొదటి ఉర్దూ – తెలుగు నిఘంటువు 1938లో వరంగల్ ఉస్మానియా కాలేజిలో అరబిక్ మాజీ ప్రొఫెసర్ ఐ.కొండలరావు సంకలనపరచి ప్రచురించాడు. ఇది అలీఫ్ నుండి లామ్ వరకు అహ్మదియా ప్రెస్ కర్నూలులోను, మీమ్ నుండి యే వరకు వరంగల్ కుమార్ ప్రెస్ లోను ముద్రణ చేయబడింది. మొత్తం 857 పేజీల పుస్తకం.
  • 2009 – ఎ. బి. కె. ప్రసాద్ అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం 862 పేజీలతో ఈ నిఘంటువును పునర్ముద్రించింది.

ఉర్దూ భాషలోకి అనువదింపబడిన ప్రముఖ గ్రంథాలు

  • రామాయణం
  • మహాభారతం – అక్బర్ కాలంలో పర్షియన్ లోకి అనువాదం రజ్మ్ నామా
  • భగవద్గీత: హిందూముస్లింల పరస్పర అవగాహన కొరకు, అలహాబాద్ కు చెందిన డాక్టర్ అజయ్ మాల్వి సంస్కృతంలోగల భగవద్గీతను ఉర్దూలోకి తర్జుమా చేశాడు, దీనికి "నగ్మయే యజ్దానీ" (నగ్మా = గీతం; యజ్దాన్ = భగవంతుడు => భగవంతుడి గీతం => భగవద్గీత) ఈనాడు డిసెంబరు 26, 2008
  • గులేబకావళి కథ. మొదలగునవి.

ఉర్దూ సామెతలు

చూడండి : ఉర్దూ సామెతలు

ఉర్దూ భాష మాట్లాడే దేశాలు

భారత దేశంలో ఉర్దూ ఆధికారిక భాషగా గల రాష్ట్రాలు

ప్రథమ ఆధికారిక భాష

రెండవ ఆధికారిక భాష

ఆంధ్రప్రదేశ్ లో రెండవ ఆధికారిక భాషగా గల జిల్లాలు
తెలంగాణ లో రెండవ ఆధికారిక భాషగా గల జిల్లాలు

అధికార భాషల చట్ట సవరణ 2022 - ఆంధ్ర ప్రదేశ్

రెండవ అధికారిక భాషగా ఉర్దూను గుర్తిస్తూ ప్రవేశపెట్టిన ఈ బిల్లును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ 2022 మార్చి 23న ఆమోదించింది.[4]

ఉర్దూమాధ్యమంలో పరీక్షలు

  • రైల్వే రిక్రూట్‌మెంట్‌ పరీక్షలు ఇకపై ఉర్దూలో నిర్వహించనున్నట్లు రైల్వే శాఖామంత్రి మమతాబెనర్జీ ప్రకటించారు. ప్రస్తుతం హిందీ, ఇంగ్లీషు లలో మాత్రమే ఆర్‌ఆర్‌బీ పరీక్షలు నిర్విహస్తున్నారు. (ఈనాడు 29.10.2009)

ఆంధ్రప్రదేశ్ నుండి ప్రచురితమయ్యే ఉర్దూ వార్తా పత్రికలు

దినపత్రికలు

సియాసత్,[1] * మున్సిఫ్ [2],* రహ్ నుమా-యె-దక్కన్, ఏతెమాద్ [3], రాష్ట్రీయ సహారా [4], మిలాప్ [5]

మాస పత్రికలు

అంధ్రప్రదేశ్ లో ఉర్దూ జనాభా

దాదాపు 40 లక్షల మంది ఉన్నారు. స్థానిక జనాభాలో 15% కంటే మించి ఉర్దూ ప్రజలు ఉన్నపట్టణాలు ఇవి:

  • చిత్తూరు జిల్లా: మదనపల్లె, వాయల్పాడు, పీలేరు, పుంగనూరు, పలమనేరు, వి.కోట, బి.కొత్తకోట, తంబళ్లపల్లె
  • కడప జిల్లా: కడప, ప్రొద్దుటూరు, లక్కిరెడ్డిపల్లి, రాయచోటి
  • అనంతపురం జిల్లా: కదిరి, గుత్తి, రాయదుర్గం, అనంతపురం, ధర్మవరం, గుంతకల్లు, హిందూపురం
  • కర్నూలు జిల్లా: ఎమ్మిగనూరు, ఆదోని, కర్నూలు, నంద్యాల, ఆళ్ళగడ్డ, ఆత్మకూరు, బనగానపల్లె, నందికొట్కూరు
  • గుంటూరు జిల్లా: గుంటూరు, చిలకలూరిపేట, నరసరావుపేట, పొన్నూరు
  • కృష్ణా జిల్లా: విజయవాడ
  • నెల్లూరు జిల్లా: నెల్లూరు, కావలి, ఆత్మకూరు, ఉదయగిరి
  • ప్రకాశం జిల్లా: మార్కాపురం,ఒంగోలు
  • పశ్చిమ గోదావరి జిల్లా: ఏలూరు

తెలంగాణలో ఉర్దూ జనాభా

దాదాపు 50 లక్షల మంది ఉన్నారు. స్థానిక జనాభాలో 15% కంటే మించి ఉర్దూ ప్రజలు ఉన్నపట్టణాలు ఇవి:

  • అదిలాబాద్ జిల్లా: అదిలాబాద్, భైంసా, కాగజ్ నగర్, నిర్మల్, మధోల్
  • కరీంనగర్ జిల్లా: కరీంనగర్
  • ఖమ్మం జిల్లా: ఖమ్మం
  • మహబూబ్ నగర్ జిల్లా: గద్వాల్, మహబూబ్ నగర్, నారాయణపేట
  • మెదక్ జిల్లా: సదాశివపేట, సంగారెడ్డి, సిద్దిపేట, జహీరాబాదు
  • నల్గొండ జిల్లా: బోనగిరి, నల్గొండ
  • వరంగల్లు జిల్లా: వరంగల్లు
  • నిజామాబాదు జిల్లా: బోధన్, నిజామాబాదు
  • రంగారెడ్డి జిల్లా: మార్పల్లి, తాండూరు
  • హైదరాబాదు జిల్లా: హైదరాబాదు

ఆంధ్రప్రదేశ్ లో ఉర్దూ విశ్వవిద్యాలయాలు

ఆంధ్రప్రదేశ్ లో ఉర్దూ భాషా విభాగాలు గల విశ్వవిద్యాలయాలు

భారతదేశంలో ఉర్దూ విశ్వవిద్యాలయాలు

  • జామియా ఇస్లామియా - ఢిల్లీ
  • జామియా నిజామియా - హైదరాబాదు
  • అలీఘర్ విశ్వవిద్యాలయం - అలీఘర్

ఉర్దూ భాషాభివృధ్ధి కొరకు పాటుపడుతున్న సంస్థలు

భారతదేశం లో ఉర్దూ టి.వి. ఛానళ్ళు

భారతదేశం లో ఉర్దూ రేడియో స్టేషన్లు

  1. "The Council". National Council for Promotion of Urdu language. Archived from the original on 2007-06-11. Retrieved 2007-06-15.
  2. 2.0 2.1 http://timesofindia.indiatimes.com/tech/personal-tech/computing/India-develops-Urdu-font-dumps-Pakistans/articleshow/21052924.cms
  3. Alam, Muzaffar. "The Pursuit of Persian: Language in Mughal Politics." In Modern Asian Studies, vol. 32, no. 2. (May, 1998), pp. 317–349.
  4. "రెండో అధికార భాషగా ఉర్దూ". andhrajyothy. Archived from the original on 2022-03-24. Retrieved 2022-03-24.

మూలాలు


"https://te.wikipedia.org/w/index.php?title=ఉర్దూ_భాష&oldid=4353488" నుండి వెలికితీశారు