గోవింద్ పన్సారే
గోవింద్ పన్సారే (गोविंद पानसरे) (26 నవంబర్ 1933 - 20 ఫిబ్రవరి 2015) ప్రముఖ సీపీఐ నేత, టోల్ ఛార్జీల వసూళ్లకు వ్యతిరేక ఉద్యమకారుడు.[1][2]
జీవిత విశేషాలు
మార్చుప్రారంభ జీవితం
మార్చుగోవింద్ పండారీనాథ్ పన్సారే అహ్మద్‌నగర్‌లో శ్రీరాంపూర్ తాలూకాలోని కొల్హాపూర్ గ్రామంలో నవంబర్ 26 1933 న జన్మించారు.[1] ఆయన సహోదరులు ఐదుగురిలో ఆయన చిన్నవాడు. ఆయన తల్లి దండ్రులు హర్నాబాయి,పండరీనాథ్ లు వ్యవసాయ కూలీలుగా వుండేవారు.వాళ్ల పొలం అప్పులవాళ్ల పరమై పోయింది.[1][2][3] తల్లి పట్టుదలతో అతను బడికి వెళ్లాడు.
విద్య, రాజకీయాలు
మార్చుసోషలిస్టు భావాలతో నెలకొల్పిన రాష్ట్ర సేవా దళ్ అనే సంస్థలో చేరడం వలన వారు నిర్వహించే హైస్కూలులో ఫీజు లేకుండా చదువుకోగలిగాడు. ఆ దళంలో ఆయనకు కమ్యూనిస్టు ఉద్యమంతో పరిచయం కలిగింది.కాడూ పాటిల్ అనే కమ్యూనిస్టు నాయకుడికి అసెంబ్లీ ఎన్నికలలో సాయపడితే అతను కొల్హాపూర్ తీసుకెళ్లి రాజారాం కాలేజీలో బిఏలో చేర్పించాడు. 1952 లో ఆయన కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా(సి.పి.ఐ) లో చేరారు.[1][3]
ఆయన రాజారాం కళాశాలలో చదువుతున్నపుడు ఆయన కమ్యూనిస్టు పుస్తకాలు అమ్మే రిపబ్లిక్ బుక్‌స్టాల్‌లోనే ఉండి పుస్తకాలను చదువుతుండేవారు. ఆయన వామపక్ష భావజాలం గల పుస్తకాలను అనేకం చదివారు. ఆయన సంయుక్త మహారాష్ట్ర ఉద్యమం, గోవా లిబరేషన్ ఉద్యమాలలో పాల్గొన్నారు. తరువాత ఆయన బి.ఎ ను పూర్తిచేసారు. ఆయన శివాజీ న్యాయ కళాశాలలో న్యాయశాస్త్ర పట్టభద్రుడైనాడు. ఆయన 1962లో సినో-ఇండియన్ వార్ సమయంలో ఆయనను చైనా సానుభూతిపరుడిగా ఉన్న కమ్యూనిస్టుగా భావించి అరెస్టు చేసారు. 1964 నుండి లేబర్ సమస్యలపై న్యాయవాదిగా వున్నాడు. 1964లో కమ్యూనిస్టూ పార్టీ విడిపోయినప్పుడు ఆయన మాతృ సంస్థలోనే కొనసాగాడు. తరువాత ఆయన సి.పి.ఐ పార్టీ రాష్ట్ర సెక్రటరీగానూ, జాజీయ ఎగ్జిక్యూటివ్ సభ్యునిగానూ కొనసాగారు.[1][3]
ఉద్యమాలు
మార్చుఆయన అనేక రాజకీయ, సామాజిక ఉద్యమాలను నడిపారు. ఆయన అనెక యూనియన్లకు నాయకునిగా ఉన్నారు. ఆయన స్వయంగా "శ్రామిక ప్రతిస్థాన్" అనే సంస్థను నడిపారు. ఆ సంస్థ అనెక కార్యక్రమాలను నడిపింది.కులాంతర, మతాంతర వివాహాలు చేసుకునేవారిని ఆదుకోవడానికి సంస్థ నడిపాడు. అతని ముగ్గురు పిల్లలు కులాంతర వివాహాలు చేసుకున్నారు.[1] ఆయన పుత్రకామెష్టి యాగాన్ని వ్యతిరేకించాడు.[4] ఆయన టోల్ టాక్సులకు వ్యతిరేకంగా ఉద్యమం నడిపారు.[5]
కమ్యూనిస్టు పార్టీలో వుంటూ కూడా వారి విధానాలు కొన్నిటిని విమర్శించేవాడు.శివాజీ పుట్టుపూర్వోత్తరాలు పరిశోధించి జేమ్స్ లేన్ అనే అమెరికన్ రాసిన శివాజీ-హిందూ కింగ్ యిన్ యిస్లామిక్ ఇండియా అనే పుస్తకం 2004లో వెలువడినపుడు యితను చాలా హింసాత్మకమైన ఆందోళన చేశాడు. పుణెలో భండార్కర్ ఓరియంటల్ రిసెర్చి ఇన్‌స్టిట్యూట్ అనే గొప్ప పుస్తక భాండాగారాన్ని తన అనుచరులతో కలిసి తగలబెట్టాడు. గోవింద్ శివాజీపై శివాజీ కోన్ హోతా? అనే చిన్న పుస్తకాన్ని 1987లో రాశాడు. శివాజీ ముస్లిం వ్యతిరేకి కాదని, సెక్యులర్ భావాలు కలవాడని, మహిళలను గౌరవించాడని, రైతులకు మేలు చేసే సంస్కరణలు చేశాడని, దళితులను, వెనకబడినవారిని పెద్ద పదవుల్లో నియమించాడని, బానిసత్వం నిర్మూలించాడని నిరూపించాడు. ఈ పుస్తకం లక్షలాది కాపీలు అమ్ముడుపోయింది.[6]
వ్యక్తిగత జీవితం
మార్చుఆయనకు ముగ్గురు పిల్లలు. కుమారుడు అనినాష్ వామపక్ష రాజకీయనాయకుడు. ఆయన చిన్న వయసులోనె మరణించాడు.[1] పన్సారేకు ఇద్దరుకూమర్తెలు.వారు స్మిత, మేఘ. ఆయన కోడలు మేఘ పన్సారే కొల్హాపూర్ లోణి శివాజీ విశ్వవిద్యాలయంలో రష్యన్ భాషా విభాగంలో అసిస్ట్ంట్ ప్రొఫెసర్ గా యున్నారు.ఆమె కూడా సి.పి.ఐ ఉద్యమకారిణి. పన్సారే హేతువాది.[5][7][8][9]
పుస్తకాలు
మార్చుఆయన 21 పుస్తకాలను వ్రాసారు. వాటిలో అనేకం సమాజంలో జరిగే లోటుపాట్లగురించే.[10] ఆయన రాసిన పుస్తకాలలో ప్రసిద్ధమైనది "శివాజీ కోన్ హోతా?" .[1][11] ఈ పుస్తకం హిందీ, ఆంగ్లము, కన్నడ, ఉర్దూ, గుజరాతీ భాషలలోనికి అనువదింపబడింది. ఆ పుస్తకం మొదటి ప్రచురణ 1988లోజరిగింది. ఆపుస్తకం 38 సారులు ప్రచురింపబడింది. ప్రతి ప్రింట్ 3000 నూండి 5000 కాపీలు అచ్చువేయబడినవి. అవి సుమారు 1,45,000 కాపీలు అమ్ముడయినవి.[11][12]
మరణం
మార్చుఆయన గత ఫిబ్రవరి 16 2015 న కోల్హాపూర్‌లో సతీమణి సౌమ పన్సారేతో కలిసి మార్నింగ్ వాక్‌కు వెళ్లి వస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు వారిపై కాల్పులు జరిపారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఫిబ్రవరి 20 2015 న రాత్రి కన్నుమూశారు.[13][14][15]
గ్రంథాలు
మార్చు- शिवाजी कोण होता? (in Marathi). Lokvangmay Griha.
{{cite book}}
: CS1 maint: unrecognized language (link)[16] - धर्म जात वर्ग आणि परिवर्तनाच्या दिशा (in Marathi). Lokvangmay Griha.
{{cite book}}
: CS1 maint: unrecognized language (link)[16] - व्दि-वर्ण शिक्षण व्यवस्था (in Marathi). श्रमिक प्रतिष्ठान.
{{cite book}}
: CS1 maint: unrecognized language (link)[17] - मार्क्सवादाची तोंड ओळख (in Marathi). Lokvangmay Griha.
{{cite book}}
: CS1 maint: unrecognized language (link) - मुस्लिमांचे लाड (in Marathi). Lokvangmay Griha.
{{cite book}}
: CS1 maint: unrecognized language (link) - राजश्री शाहू वसा आणि वारसा (in Marathi). Lokvangmay Griha.
{{cite book}}
: CS1 maint: unrecognized language (link) - काश्मीरबाबतच्या कलम ३७० ची कुळकथा (in Marathi). श्रमिक प्रतिष्ठान.
{{cite book}}
: CS1 maint: unrecognized language (link) - महाराष्ट्राची आर्थिक पाहणी - पर्यायी दृष्टिकोन (in Marathi). श्रमिक प्रतिष्ठान.
{{cite book}}
: CS1 maint: unrecognized language (link) - मार्क्सवादाची तोंडोओळख (in Marathi). श्रमिक प्रतिष्ठान.
{{cite book}}
: CS1 maint: unrecognized language (link) - मुस्लिमांचे लाड (in Marathi). सुगावा प्रकाशन. 1100.
{{cite book}}
: CS1 maint: unrecognized language (link)
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 1.7 "Peon to professor to bestselling author, Comrade Govind Pansare a left-wing stalwart". DNA India. 17 February 2015. Retrieved 12 April 2015.
- ↑ 2.0 2.1 "Senior CPI leader Govind Pansare, wife shot at by assailants". The Indian Express. 17 February 2015. Retrieved 13 April 2015.
- ↑ 3.0 3.1 3.2 "From a newspaper vendor to a leader of the poor: Remembering CPI stalwart Govind Pansare". First Post. 21 February 2015. Archived from the original on 26 ఏప్రిల్ 2015. Retrieved 13 April 2015.
- ↑ "Dabholkar and Pansare: Two murders, similar strands". Live Mint. 23 February 2015. Retrieved 13 April 2015.
- ↑ 5.0 5.1 "Shot in Kolhapur, anti-toll tax campaigner Govind Pansare dies". Hindustan Times. 21 February 2015. Archived from the original on 26 ఏప్రిల్ 2015. Retrieved 13 April 2015.
- ↑ "మ్బీయస్ : గోవింద్ పన్సారే హత్య వెనుక ఎవరున్నారు?". Archived from the original on 2015-09-01. Retrieved 2015-07-19.
- ↑ "Arrest culprits soon: Govind Pansare's daughter to Maharashtra government". The Indian Express. 16 February 2015. Retrieved 13 April 2015.
- ↑ "My husband was killed for his progressive thoughts: Pansare's wife". Mid Day. 11 March 2015. Retrieved 14 April 2015.
- ↑ "Family wants special team to probe Govind Pansare murder". DNA India. 4 March 2015. Retrieved 14 April 2015.
- ↑ "Remembering Govind Pansare: A 'beloved leader of the poor'". Hindustan Times. 21 February 2015. Archived from the original on 23 ఏప్రిల్ 2015. Retrieved 14 April 2015.
- ↑ 11.0 11.1 "Govind Pansare's death leaves higher demand for his books". DNA India. 22 February 2015. Retrieved 13 April 2015.
- ↑ "Renewed interest in Pansare's book, 3,000 copies sold". The Times of India. 22 February 2015. Retrieved 13 April 2015.
- ↑ "సీపీఐ నేత గోవింద్ పన్సారే కన్నుమూత...!". Archived from the original on 2015-07-22. Retrieved 2015-07-19.
- ↑ "Pansare killing: 'Five bullets were fired at Communist leader'". 28 February 2015. Retrieved 13 April 2015.
- ↑ "CPI leader Govind Pansare, wife shot at in Kolhapur". The Hindu. 16 February 2015. Retrieved 13 April 2015.
- ↑ 16.0 16.1 "वैचारिक , राजकीय , तत्वज्ञान" (in Marathi). Lokvangmay Griha. Archived from the original on 7 డిసెంబరు 2015. Retrieved 14 April 2015.
{{cite web}}
: CS1 maint: unrecognized language (link) - ↑ "Govind Pansare". Book Ganga. Archived from the original on 27 ఫిబ్రవరి 2015. Retrieved 14 April 2015.