గౌతమ్ వాఘేలా (936 జనవరి 5 - 2010 ఏప్రిల్ 6) భారతీయ కళాకారుడు. అతను ప్రారంభ కళా విద్య బొంబాయి సర్ జంషెడ్జీ జీజేభాయ్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ లో జరిగింది. తరువాత అతను రాజస్థాన్ బనస్థాలిలో ఫ్రెస్కో, మురల్ పద్ధతుల్లో శిక్షణ పొందాడు. 1962 నుండి 1994 వరకు అతను భారత ప్రభుత్వంలో చేనేత సేవకు అనుబంధించిన టెక్స్‌ టైల్స్ మంత్రిత్వ శాఖ లో ఉన్నాడు. అతను ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ కోసం కోఆర్డినేషన్ అండ్ డిజైన్ ఎక్స్ పర్ట్స్ డైరెక్టరుగా పదవీ విరమణ చేశాడు. ఆధునిక వస్త్ర నమూనాల అభివృద్ధి కోసం W. S. C. లలో కళాకారులు చేనేత కార్మికులతో కలిసి పనిచేశాడు. ఈ కేంద్రంలోనే వాఘేలా కె. జి. సుబ్రమణియన్, ప్రభాకర బార్వే , అంబాదాస్ వంటి కళాకారులతో సంభాషించాడు.

గౌతమ్ వాఘేలా
జననం(1936-01-05)1936 జనవరి 5
మరణం2010 ఏప్రిల్ 6(2010-04-06) (వయసు 74)
అవార్డులుపద్మశ్రీ పురస్కారం (1982)

కృష్ణ సహాయ్ రచించిన ది స్టోరీ ఆఫ్ డాన్స్: భరత నాట్యం, బ్రిటిష్ చిత్రకారుడు హోవార్డ్ హోడ్కిన్ తో కలిసి రాసిన అనదర్ ఇండియాః యాన్ ఆంథాలజీ ఆఫ్ ఇండియన్ కాన్‌టెంపరరీ ఫిక్షన్ అండ్ పోయెట్రీ వంటి అనేక పుస్తకాలను వాఘేలా చిత్రీకరించాడు. కళాకారుడిగా, డిజైనరుగా నాలుగు దశాబ్దాలకు పైగా, అతను 1966 బినాలే డి పారిస్, 1967 సావో పాలో ఆర్ట్ బినియల్ తో సహా భారతదేశం అంతటా, విదేశాలలో ప్రదర్శనలు ఇచ్చాడు.

పురస్కారాలు

మార్చు
  • 1982: పద్మశ్రీ పురస్కారం [1]
  • 1990: మహారాష్ట్ర గౌరవ్ పురస్కార్

ఎంపిక చేసిన దృష్టాంతాలు

మార్చు
  • The Story of Dance: Bharata Natyam by Krishna Sahai (2003) ISBN 81-87981-51-2
  • Another India: An Anthology of Indian Contemporary Fiction and Poetry (1990) ISBN 0-14-012428-4

మూలాలు

మార్చు