గౌరీ ఖాన్

భారతదేశ సినీ నిర్మాత, భవన నిర్మాత

గౌరీ ఖాన్ భారతదేశానికి చెందిన సినీ నిర్మాత, ఫ్యాషన్ డిజైనర్. ఆమె 2002లో రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థను స్థాపించి మై హూ నా, ఓం శాంతి ఓం & చెన్నై ఎక్స్‌ప్రెస్ లాంటి హిట్ సినిమాలను నిర్మించింది.[2]

గౌరీ ఖాన్
జననం
గౌరీ చిబ్బర్‌

(1970-10-08) 1970 అక్టోబరు 8 (వయసు 53)[1]
న్యూ ఢిల్లీ, భారతదేశం
విద్యాసంస్థలేడీ శ్రీ రామ్ కాలేజీ, ఢిల్లీ యూనివర్సిటీ
వృత్తి
  • సినిమా నిర్మాత
  • ఇంటీరియర్ డిజైనర్
  • కాస్ట్యూమ్ డిజైనర్
  • ఫాషన్ డిజైనర్
క్రియాశీల సంవత్సరాలు1992–ప్రస్తుతం
జీవిత భాగస్వామి
పిల్లలు3, సుహానా ఖాన్ తో సహా

జననం, విద్యాభాస్యం మార్చు

గౌరీ ఖాన్ ( గౌరీ చిబ్బర్‌ ) ఢిల్లీలో సవిత, కల్నల్ రమేష్ చంద్ర చిబ్బర్‌ దంపతులకు జన్మించింది. ఆమె లోరెటో కాన్వెంట్ స్కూల్‌లో పాఠశాల విద్యను పూర్తి చేసి, న్యూ ఢిల్లీలోని మోడరన్ స్కూల్ వసంత్ విహార్ నుండి హైస్కూల్ విద్యను, లేడీ శ్రీ రామ్ కాలేజీ నుండి హిస్టరీలో బిఎ (ఆనర్స్) పట్ట అందుకొని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నుండి ఫ్యాషన్ డిజైన్‌లో కోర్సును కూడా పూర్తి చేసింది.[3]

వివాహం మార్చు

గౌరీ ఖాన్ 1984లో ఢిల్లీలో షారూఖ్ ఖాన్‌ను మొదటిసారి కలిసి ఆరేళ్ల ప్రేమ తర్వాత 1991 అక్టోబరు 25లో వివాహం చేసుకుంది. వారికీ కుమారుడు ఆర్యన్ (జననం 1997), కుమార్తె సుహానా (జననం 2000), కుమారుడు అబ్రామ్ (జననం 2013) ఉన్నారు.[4][5][6]

 
భర్త షారుఖ్ ఖాన్తో

నిర్మాతగా మార్చు

సంవత్సరం సినిమా గమనికలు
2004 మై హూ నా నామినేట్ చేయబడింది — ఉత్తమ చిత్రంగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు
2005 పహేలి
2007 ఓం శాంతి ఓం ముగింపు క్రెడిట్‌లలో అతిథి పాత్ర

నామినేట్ చేయబడింది – ఉత్తమ చిత్రంగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు

2009 బిల్లు
2011 అల్వయ్స్ కభీ కభీ
రా.వన్
2012 స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ ధర్మ ప్రొడక్షన్స్‌తో కలిసి నిర్మించింది
2013 చెన్నై ఎక్స్‌ప్రెస్ UTV మోషన్ పిక్చర్స్‌తో కలిసి నిర్మించారు

నామినేట్ చేయబడింది – ఉత్తమ చిత్రంగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు

2014 హ్యాపీ న్యూ ఇయర్ ముగింపు క్రెడిట్‌లలో అతిథి పాత్ర
2015 దిల్‌వాలే రోహిత్ శెట్టి ప్రొడక్షన్స్‌తో కలిసి నిర్మించింది
2016 డియర్ జిందగీ ధర్మ ప్రొడక్షన్స్, హోప్ ప్రొడక్షన్స్‌తో కలిసి నిర్మించింది
2017 రయీస్ ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి నిర్మించింది
జబ్ హ్యారీ మెట్ సెజల్ విండో సీట్ ఫిల్మ్స్‌తో కలిసి నిర్మించింది
ఇత్తెఫాక్ ధర్మ ప్రొడక్షన్స్, BR స్టూడియోస్‌తో కలిసి నిర్మించింది
2018 జీరో కలర్ ఎల్లో ప్రొడక్షన్స్‌తో కలిసి నిర్మించింది
2019 బద్లా అజూర్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి నిర్మించింది
2020 '83 తరగతి
కామ్యాబ్ దృశ్యం ఫిల్మ్స్‌తో కలిసి నిర్మించింది
2021 బాబ్ బిస్వాస్ బౌండ్ స్క్రిప్ట్ ప్రొడక్షన్‌తో కలిసి నిర్మించింది
2022 లవ్ హాస్టల్ దృశ్యం ఫిల్మ్స్‌తో కలిసి నిర్మించింది
డార్లింగ్స్ ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్స్‌తో కలిసి నిర్మించింది
2023 జవాన్

మూలాలు మార్చు

  1. "Gauri Khan". IMDb.
  2. "I don't want to make my business mass: Gauri Khan" (in ఇంగ్లీష్). 3 November 2018. Archived from the original on 10 July 2023. Retrieved 10 July 2023.
  3. The Telegraph (2023). "A big fat wedding" (in ఇంగ్లీష్). Archived from the original on 10 July 2023. Retrieved 10 July 2023.
  4. Sharma, Sarika (3 July 2013). "Shah Rukh Khan, Gauri blessed with a baby boy". The Indian Express. Archived from the original on 5 September 2014. Retrieved 23 September 2013.
  5. Zubair Ahmed (23 September 2005). "Who's the real Shah Rukh Khan?". BBC News. Archived from the original on 26 January 2009. Retrieved 26 August 2008.
  6. "Famous inter-religious marriages". MSN. 30 January 2014. Archived from the original on 3 July 2014. Retrieved 25 May 2014.

బయటి లింకులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=గౌరీ_ఖాన్&oldid=4077321" నుండి వెలికితీశారు