గ్నూ అనేది గ్నూ పరియోజనచే అభివృద్ధి చేయబడుతున్న యునిక్స్ వంటి ఒక కంప్యూటరు నిర్వాహక వ్యవస్థ. ఇది పూర్తిగా స్వేచ్ఛా సాఫ్ట్‌వేరుతో కూర్చబడింది. ఇది గ్నూ హర్డ్ కెర్నలుపై ఆధారపడివుంది. ఈ కెర్నలు సంపూర్ణంగా యునిక్స్​కు అనుకూలమైన సాఫ్ట్‌వేర్ వ్యవస్థను ఉద్దేశించి రూపొందింది.

గ్నూ
నిర్వహణవ్యవస్థ కుటుంబంయునిక్స్ వంటిది
పనిచేయు స్థితిఅభివృద్ధి దశలో / అనధికార, ఉత్పత్తికి సిద్ధంగా లేని విడుదలలు
విడుదలైన భాషలుబహుళభాషలు
ప్లాట్ ఫారములుIA-32, x86-64
Kernel విధముమైక్రోకెర్నల్ (గ్నూ హర్డ్)
వాడుకరిప్రాంతముగ్నూ
లైెసెన్స్గ్నూ జనరల్ పబ్లిక్ లైసెన్స్, ఇతర స్వేచ్ఛా సాఫ్ట్‌వేర్ లైసెన్స్ లు

1983లో రిచర్డ్ స్టాల్‌మన్ ఫ్రీ సాఫ్ట్‌వేర్ ఫౌండేషన్ను ఉద్దేశించి గ్నూ నిర్వహక వ్యవస్థను అభివృద్ధి చేయడం ప్రారంభించారు. కానీ ఇప్పటికీ గ్నూ యొక్క స్థిరమైన విడుదల లేదు. గ్నూ కెర్నలు కానటువంటి, చాలా ప్రాచుర్యం పొందిన లినక్స్ కెర్నలుతో కూడా గ్నూ వ్యవస్థను ఉపయోగించవచ్చు.

చరిత్ర మార్చు

గ్నూ నిర్వాహక వ్యవస్థ కోసం రూపొందించిన ప్రణాళికను 1983 సెప్టెంబరు 27లో net.unix-wizards, net.usoft వార్తాసమూహాలలో రిచర్డ్ స్టాల్‌మన్ బహిరంగంగా ప్రకటించారు. రిచర్డ్ స్టాల్‌మన్ మసాచుసెట్స్ ఇన్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ల్యాబోరేటరీలో తన ఉద్యోగమును వదిలివేసిన తరువాత 1984 జనవరి 5 న సాఫ్ట్‌వేర్ అభివృద్ధి మొదలైంది.[1]

ఒక సంపూర్ణమైన స్వేచ్ఛా సాఫ్ట్‌వేర్ నిర్వాహక వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఇది ప్రారంభించబడింది.

మూలాలు మార్చు

  1. Hu$tle, Blogger's (2020-11-06). "How To Download Youtube Videos: An Ultimate Guide". Medium (in ఇంగ్లీష్). Retrieved 2020-11-14.{{cite web}}: CS1 maint: url-status (link)[permanent dead link]
"https://te.wikipedia.org/w/index.php?title=గ్నూ&oldid=3850747" నుండి వెలికితీశారు