గ్రంధి మంగరాజు (డిసెంబర్ 11, 1896 - ?) ప్రముఖ సినిమా పంపిణీదారులు, నిర్మాత.

వీరు విశాఖపట్నంలో గ్రంథి కామరాజు, గౌరమ్మ దంపతులకు జన్మించారు. వీరి తండ్రి కామరాజు పెద్దాపురం నుండి విశాఖపట్నం వచ్చి వ్యాపారం చేసి అక్కడి ధనికులలో ఒకరుగా పేరుపొందారు.

మంగరాజు విద్యాభ్యాసం తర్వాత ఇరవై ఏళ్ళకే సొంతగా వ్యాపారం ప్రారంభించారు. దయానంద సరస్వతి గారి వైదిక సిద్ధాంతాల పట్ల ఆకర్షింపబడి 1935 ప్రాంతంలో విశాఖపట్నంలో ఆర్య సమాజం స్థాపించారు.

1929లో చలనచిత్రరంగంలో ప్రవేశించి విశాఖపట్నంలో "పూర్ణా టాకీస్" సినిమా హాలును నిర్మించారు. 1937లో దశావతారములు చిత్రానికి నిర్మాణ బాధ్యతలు వహించారు. ఆ రోజుల్లోనే విజయవాడలో సినీ పంపిణీ సంస్థ "పూర్ణా పిక్చర్స్"ను ప్రారంభించారు. వీరు తొలిరోజుల్లో తెలుగు సినిమా అభివృద్ధిలో ఒక మూలస్తంభంగా నిలిచారు.

వీరు ప్రజలలో భక్తిభావాన్ని పెంపొందించే నిమిత్తం యాత్రా బస్సు, రైలు సేవలను నడిపేవారు.

మూలాలు

మార్చు
  • 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, మొదటి భాగం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 2005, పేజీ 407-8.