గ్రీకు నాటకరంగం

క్రీ.పూ. 6వ శతాబ్దంలో గ్రీసులో నగర రాజ్యాలు ఉండేవి. వీటిలో ప్రధానమైంది ఏథెన్స్. సోక్రటీస్, అరిస్టాటిల్ వంటి తత్వవేత్తలు, నాటక రచయితలు ఏథెన్స్ వారే.

గ్రీకు నటుడి విగ్రహం
Labelled drawing of an ancient theatre. Terms are in Greek language and Latin letters.
Artist rendering of the Theatre of Dionysus
Ancient Greek theatre in Delos

గ్రీకు నాటకరంగం పుట్టుక

మార్చు

గ్రీకు నాటకరంగం పుట్టుకకు ఆధారాలేవి లభించలేదు. ఏథెన్స్ లో నాటకం మత ఉత్సవాల నుండి పుట్టిందని చరిత్రకారులు చెబుతున్నారు. గ్రీకులకు వ్యవసాయమే ముఖ్య వృత్తి. ఆ వ్యవసాయం పంచభూతాలపైనే ఆధారపడి ఉంటుంది కాబట్టి, ఆ పంచభూతాలనే వారు దేవులగా పూజించడం మొదలెట్టారు. యజ్ఞాలు, కత్రువులు (కర్మకాండలు) నిర్వహించేవారు. వాటిలోనుండే గ్రీకు నాటకం పుట్టిందని పాశ్చాత్య విమర్శకులు నిర్ధారించారు.

 
Tragic Comic Masks Hadrian's Villa mosaic
 
Mask dating from the 4th/3rd century BC, Stoa of Attalos

క్రమంగా గ్రీకులు దేవుళ్లకు, దేవతలను మానవ రూపాలు కలిపించుకొని, వారి చుట్టూ ఎన్నో కథలు అల్లుకున్నారు. వారి దేవుడికి 'డయోనిసస్' అని పేరు పెట్టుకొని, ఆ దేవత ప్రీతికోసం ఉత్సవాలు, కత్రువులు చేసేవారు. ఆయా కత్రువులలో స్తుతి గీతాలు గానం చేసేవారు. నాట్యం చేసేవారు. ఈ ఉత్సవాలలో డయోనిసస్ పుట్టుక గురించి, అతనికి యితర దేవుళ్లతో గల సంబంధాన్ని గురించి అనేక విషాద కథలు గానం చేసేవారు. మొదట్లో నోటికొచ్చినట్లు పాడేవారు. ఏథెన్స్ ప్రభావం వల్ల వీటికి ఒక పద్ధతి వచ్చింది. పాటలు కవిత్వ రూపాన్ని సంతరించుకున్నాయి. దేవతాగృహం ముందు ఒక ఎత్తైన వేదికను అమర్చి, దానిముందు 50 మంది కూర్చొని లేదా నిలబడి బృందంగా స్తుతి రూపంలో పాడేవారు. వీరికి కోరస్ లేక బృంద గాయకులు అని పేరొచ్చింది. ఆయా దేవతల పుట్టు పూర్వోత్తరాలను మహినులను వర్ణిస్తూ కథల రూపంలో గానం చేసేవారు. ఈ బృందం గానం చేసే గీతాలను డిథిరాంబ్స్ అంటారు. డయోనిసస్ జనన వురణ స్తూచనగా, ఈ ఉత్సవాలు వసంతకాలంలో ఒకటి, శీతాకాలంలో ఒకటి మొత్తం రెండుసార్లు జరిగేవి. బృందగాయకులు మేకతోలు కప్పకునేవారు. ఈ బృందానికి ఒక నాయకుడు ఉండేవాడు. అతనిని కరిపైకప్ అనేవారు. ఈయన మన సూత్రధారుడు లాంటి వాడు. థెస్పిస్ ను మొదటి బృందగాన నటునిగా పేర్కొంటారు. ముఖానికి కరాళాలు (Masks) ధరించే పద్ధతి కూడా థెస్పిస్ తోనేఆరంభమైంది. గాయకుల నుంచి మొదటిసారిగా ఒక నటుడ్ని కలించారు.[1]

 
Panoramic view of the ancient theatre at Epidaurus.

పిసిస్టాటస్ అనే ఒక క్రూర పాలకుడు డయోనిసస్ ఉత్సవాన్ని ఏథెన్స్ నగరంలో క్రీ.పూ. 535లో జరిపించాడని తెలుస్తున్నది. ఈయన వల్లే హోమర్ రాసిన ఇలియడ్ ఒడిస్సీ కావ్యాలలో నాయకులైన అగమెమ్మన్, ఒడీసియస్ వంటి పాత్రలు కీర్తన గీతాల్లోకి ప్రవేశించాయంటారు.

ఆ పరిణామక్రమం నుంచి 'డిథిరాంట్ మూడు విధాలుగా రూపొందింది. 1. ట్రాగోస్ సాంగ్స్ - శోకభక్తిసమ్మిు గీతాలు. ట్రోగోస్ అంటే మేక అని అర్థం. కనుక పేుక గీతాలు అని కూడా అనవచ్పు. 2. కోమెూస్ సాంగ్స్ - ఆనందోత్సవ గీతాలు, 3. సాటిర్ సాంగ్స్ - భావావేశ గీతాలు. ట్రూగోస్ గీతాలనుంచి ట్రూజడీలు (విషాదాంత నాటకాలు), కోమోస్ గీతాల నుంచి కామెడీలు (సుఖాంత నాటకాలు), సాటిర్ గీతాల నుంచి సాటిర్ నాటకాలు ఉత్పన్నమయ్యాయని కొందరి ఊహ. థెస్పిస్ తర్వాత్ర విషాద నాటకానికి ఒక అస్తిత్త్వాన్నిచ్చి ఉన్నతస్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఎస్కిలస్. గ్రీకు విషాదాంత నాటక రచయితలుగా ప్రఖ్యాతి చెందిన వారు ముగ్గురు ఎస్కిలస్, సోఫోక్లిస్, యూరిపిడిస్.

విషాద నాటకాలకు పితామహుడు ఎస్కిలస్ అని పండితుల అభిప్రాయం. క్రీ.పూ. 499లో మొదటిసారి నాటక పోటీల్లో ప్రవేశించి 13 సార్లు బహువుతులు అందుకున్నాడు. అప్పటి నాటకరంగంలో కొన్ని మార్పులు ప్రవేశపెట్టాడు. థెస్పిస్ ప్రవేశపెట్టిన మొదటి నటుడికి తోడుగా రెండో నటుణ్ణి ప్రవేశపెట్టడం అత్యంత ప్రధానమైన మార్పు కడుమాట్లాడితే అది ఉపన్యాసం లేదా స్వగతం అవుతుంది. ఇద్దరు మాట్లాడితే అది సంభాషణ అవుతుంది. ఆ విధంగా ఎస్కిలస్ బృందగానాలకు సంభాషణలను ఇద్దరు నటుల ద్వారా జోడించటంతో నాటకీయత ఏర్త్పడింది. కోరస్ సంఖ్య 50 నుండి 15కు పరిమితం చేయడం వల్ల కోరస్ ప్రాముఖ్యం తగ్గి పాత్రల ప్రాధాన్యం పెరిగింది. ఇది ఎస్కిలస్ ప్రవేశ పెట్టిన రెండో మార్పు.

ఎస్కిలస్ దృష్టిలో మానవ జీవితం విషాదమయం. దేవత్తల అపార శక్తి సామర్ధ్యాల ముందు మానవుడు తల వంచవలసిందేనని, దేవుడు పాపులను శిక్షిస్తాడని, పాపం నుంచి పాపం పుడుతుందని, విధిని ఎవరూ త్రప్పించుకోలేరని, మానవుల పతనానికి మానవులే కారణమని ఎస్కిలస్ సిద్ధాంతీకరించాడు. ఈయన రాసిన ఎనభై నాటకాలలో ఏడు మాత్రమే లభ్యమవుతున్నాయి. ది సప్లయంట్ ఈయన రాసిన మొదటి నాటకం. రెండోది ది పర్షియన్స్ మూడోది ప్రోమోధియస్ బౌండ్ మొదలైనవి.

సోఫోక్లిస్ క్రీ.పూ 496లో ఒక సంపన్న వ్యాపార కుటుంబంలో జన్మించాడు. వందకు పైగానాటకాలు రాశాడంటారు కాని ఏడు మాత్రమే లభ్యమవుతున్నాయి. నాటక పోటీలలో ఎస్కిలస్ నే ఓడించాడు. పోటీలలో 18 సార్లు గెలుపొందాడు. సంభాషణలున్న మూడో నటుడిని ప్రవేశ పెట్టి, నాటక సంభాషణల్లో క్లుప్తత పాటించాడు. ప్రాత్ర చిత్రణలో నైపుణ్యం ప్రదర్శించాడు. బృందగానం, నాటక నటుల మధ్య సమన్వయాన్నిసమకూర్చాడు. సీన్ పెయింటింగ్ ప్రవేశపెట్టిన ఖ్యాతి ఇతనిదే. సోఫోక్లిస్ రచనలో రెండు రకాల విషాదాలు కన్పిస్తాయి. ఒకటి విపరీతమైన మోహం నుంచి పుట్టిన విషాదం (మోహఫలం). రెండవది విధి సంకల్పం వల్ల పుట్టిన విషాదం. సోఫోక్లిస్ కు దేవుళ్లపై విశ్వాసం ఉంది. విధి అనివార్యతపై కూడా విశ్వాసం ఉంది. అందుకు బలమైన ఉదాహరణ ఈడిపస్ నాటకం. ఈడిపస్ ది కింగ్, ఈడిపస్ ఎట్ కలోనస్, ఆంటిగొని, ఫిలాక్టిటస్, ఎలక్ట్రా, ఆజాక్స్, ది ట్రకినేయ్ మైుదలైన నాటకాలు రచించిన, సోఫోక్లిస్ క్రీ.పూ. 406లో మరణించాడు.

గ్రీకు నాటకరంగంలో సోఫోక్లిస్ వారసుడు యురిపిడిస్. ప్రవృత్తి రీత్యా సోఫోక్లిస్ కి పూర్తిగా విరుద్ధ స్వభావం. 92 నాటకాలు రచించిన యురిపిడిస్ నాటక ప్రోటీల్లో అయిదు సార్లు బహుమతి గెలుచకున్నాడు ఈయనకు మత విశ్వాసాలపై, గ్రీకు దేవతలపై విశ్వాసం లేదు. యురిపిడిస్ నాటకాలపై ఇతని సమకాలికులు కొన్ని విమర్శనాస్త్రాలు సంధించారు. వాటిలో ప్రధానమైనవి రెండు. యురిపిడిస్ సంప్రదాయ విలువలకు, పురాణ కథలకు భిన్నమైన వ్యాఖ్యానాలు చేశాడని, తద్వారా సమాజ పునాదుల్ని కించపరచాడనేది ఒక అభియోగం కాగా, అతని నాటక రచనలో స్పష్టత లేదనీ, అన్వయక్లిష్టత హైచ్పుగా ఉందనేది రెండో విమర్శ.

యురిపిడిస్ తన నాటకాల్లో బృందగాన ప్రాముఖ్యాన్ని తగ్గించి నాటకీయత్రకు ప్రాధాన్యం ఇచ్చాడు. ఈయన రచించిన నాటకాలలో వాస్తవికతకు ఎక్కువ ప్రాముఖ్యం యిచ్చినట్లు కొంతమంది విమర్షకుల అభిప్రాయం. యురిపిడిస్ సమాజ శ్రేయస్సుకు అవసరమైన మతం, నీతి మైుదలైన సమస్యల కంటే వ్యక్తుల ప్రేమ, ద్ర్వేషం ప్రతీకారం మొదలైన రజోగుణాలను ఉద్వేగాలను ఎక్కువగా చిత్రించాడు. ఈయన నాటకాలలో స్త్రీ ద్వేషం కనిసిస్తుంది. 92 ඝණ් నాటకాలో ఇప్పుడు 18 మాత్రమే లభ్యమవుత్తున్నాయి. వాటిలో సైక్లోప్స్, ఆలెస్టిన్, హిపోలిటస్, మోడియా, ఆగమెమ్నన్, ది සී ట్రోజన్ ఉమైన్, సప్లయంట్స్, హెలెన్, ది బాకీ మొదలైనవి సుప్రసిద్ద నాటకాలు. యురిపిడిస్ మరణంతో గ్రీకు విషాద నాటక రచయితల శకం ముగిసింది. యురిపిడిస్ తరువాత గ్రీకు నాటకరంగంలో చెప్పకోదగిన నాటకకర్తలు లేరు. అయితే 4వ శతాబ్దంలో నాటక విమర్శకు ప్రాధాన్యం పెరగడం ప్రత్యేకంగా పేర్కొనదగిన అంశం.

అరిస్టాటిల్ (క్రీ.పూ. 384-322) రాసిన కావ్య శ్రాస్త్రం (Poetics) అనే గ్రంథం నేటికీ నాటక లక్షణాల పరిశీలనకు ప్రామాణికంగా నిలిచి ఉంది. తన పూర్వులు వేసిన నాటకాలననుసరించి నాటక లక్షణాలను సూత్రీకరించాడు. అరిస్టాటిల్ సూత్రాల ప్రకారం సహజంగా జరిగే ఒక క్రియకు ప్రతిరూపం నాటకం. కనుక నాటకంలో కథకు (ఇతివృత్తానికి) ఆది, మధ్యాంతాలు ఉండాలి. ఒక సంఘటన మరొక సంఘటన పుట్టుకురావాలి. సంఘటన తర్కానికి నిలిచేవిగా ఉండాలి. అయా పాత్రల నైతిక ప్రవర్తనను అనుసరించి పాత్రచిత్రణ జరగాలి. నాటక నిర్మాణంలో కాల, వస్తు, ఐక్యతలను విధిగా పాటించాలని అరిస్టాటిల్ సిద్దాంతం. విషాద నాటక లక్షణాలను వివర్తిస్తూ అరెస్టాటిల్, నాయకుడు ప్రేక్షకుల సానుభూతి పొందే మంచి లక్షణాలున్న వ్యక్తిగా ఉండాలనీ, అతనిలో ఏదో స్వల్ప లోపం వల్ల అతని జీవిత్రం విషాదం అయ్యేలా ఉండాలని తెలిపారు. ఈ లోపాన్ని అరిస్టాటిల్ గ్రీకు భాషలో హామర్షియా అని పేర్కొన్నాడు. కెథారిసిస్ అనే మరొక సిద్ధాంతాన్ని కూడా అరిస్టాటిల్ ప్రతిపాదించాడు. జాలి, భయం లాంటి ఉద్వేగాలను విషాదం, శోకం పరిశుద్ధం చేస్తుంది. అందువల్ల ఈ అనుభూతుల్ని ప్రేక్షకుడు, రంగస్థలంపై నటుని బాధను తన బాధగా అనుభవిస్తాడు. ఆ తన్మయత్వంలో తన బాధల్ని మరిచిపోతాడు. అందుకే, ప్రేక్షకుడుని పాత్రలో లీనం చేసేలా నటన ఉండాలని ఈ సిదాంత సారం.

గ్రీకుల కామెడీ నాటకాలు

మార్చు

సాటిర్ నాటకాలకు ఇంచుమించు సమాంతరంగా కామెడీ నాటకాలు ఆరంభమయ్యాయి. ఇవి సంగీత ప్రధానాలు. కమ్యూసెస్ (comuses) అన్న గ్రీకుపదం నుండి కామెడీ (comedy) పదం వచ్చింది. కామెడీ అంటే ఆంగ్లంలో రెవెల్ సాంగ్ (revel song) అని అర్థం. దీనినే కొందరు కేరింత గీతం అని ఆంధ్రీకరించారు. డయోనిసిస్ ఉత్సవాలలో కామెడీ కూడా ఒక భాగం. ఇది స్త్రీ పురుష లైంగిక సంబంధమైన ఒక క్రతువు. నటులు, పక్షులు, కోళ్లు, గుర్రాలు ఆనవాలు గల ముసుగులు ధరించి పాటలు పాడుతూ నృత్యం చేసేవారు. స్త్రీ పురుష సంపర్కమే సృష్టికి ఆధారం. పిల్లలు పుట్టాలన్న కోరిక ఈ సంప్రదాయానికి మూలం. కామెడీలను చాలకాలం వరకు ఎవరూ పట్టించుకోలేదు. వాటిని ఉత్తమ తరగతి నాటకాలుగా పరిగణించలేదు. ట్రాజెడీ నాటకాల పోటీ ప్రారంభమైన 50 సంవత్సరాల తరువాత గాని కామెడీ (సుఖాంత) నాటకాల పోటీలు ప్రారంభంకాలేదు. కామెడీలను మధ్యాహ్నం పూట ప్రదర్శించేవారు. తొలి కామెడీ నాటకాలు ఏవీ లభ్యం కాలేదు. ఈ నాటకాలు అవహేళనాత్మకంగా ఉండేవి. సా.శ. 5వ శతాబ్ది ద్వితీయార్థంలో కామెడీలకు గుర్తింపు వచ్చింది. అందుకని కామెడీని పాతకామెడీ (Old comedy) మధ్య కామైడీ (Middle comedy), నవీన కామెడీ (New comedy) గా విభజించారు.[2]

 
ఆనంద విషాద మాస్కులు

పాత కామెడీ: క్రేటినస్ (Cratinus), యుపోలిన్ (Eupolis) లను తొలి కామెడీ కర్తలుగా పరిగణిస్తారు. ది క్లౌడ్స్ (The clouds) అనే నాటకాన్ని యుపోలిస్ రాశాడు. అరిస్టోఫెన్స్ కాలంలో కామెడీ ఉచ్ఛస్థితికి చేరుకుంది.

మధ్య కామెడీ (Middle comedy) : మిడిల్ కామేడికి కూడా అరిస్టోఫెన్స్ పేరు ప్రసిద్ధం. చివరి దశలో ఈయన రాసిన నాటకాలు మిడిల్ కామెడీకి చెందినవే. నాలుగవ శతాబ్దపు చివరి మూడు పాదాలలో ప్రేమ, కుట్రలకు సంబంధించిన ఇతివృత్తాలు గల నాటకాలు వెలువడినట్లు తెలుస్తుంది.

నవ్య కామెడీ (New Comedy) : నాలుగో శతాబ్దపు ప్రథమ పాదానంతరం యూ నవ్య కామెడీ నాటకాలు మొదలయ్యాయి. అప్పటికి ఏథెన్స్ నగరం మెసడోనియా పాలన కింద్రికి వెళ్లింది. రచయితలు సెంటిమెంటల్ కామెడీల వైపు దృష్టిని సారించారు. వీటిని డొమెస్టిక్ కామెడీలు, కామెడీ ఆఫ్ మేనర్స్ అని పిలుస్తారు. అంటే గృహ వాతావరణ సంబంధమైన నాటకాలన్నమాట. వీటిలో మనుషుల స్వభావాలు, ప్రవృత్తులు చిత్రించబడ్డాయి.

గృహసంబంధమైన ఇతివృత్తాలతో, నవ్య కామెడీ నాటకాలు రాసిన వారిలో మోనాండర్ (క్రీ.పూ. 342-241) అగ్రగణ్యుడు. ఈయనే నవ్య కామెడీ పితామహుడు. షేక్స్పియర్, మోలియర్ చాలా తెలుగు నాటకాలలో కూడా ఇతని కామెడీ శైలిఛాయలు కనిపిస్తాయి. మోనాండర్ ఏథెన్స్ నగరంలో క్రీ.పూ. 342లో జన్మించాడు. అప్పటికే గ్రీస్ లో పెరిక్లస్ యుగం సమాప్తమయింది. అలెగ్జాండర్ తూర్పు దండయాత్రలు విజయాలు మోనాండర్ ని బాల్యంలో ఆకర్షించాయి. ఎపిక్యురస్ (క్రీ.పూ. 341-270) అరిస్టాటిల్, థియోఫ్రాస్టస్ లాంటి పండితులు ఆ రోజుల్లో ఏథెన్స్ లో ఉండేవారు. వీరిలో థియోఫ్రాస్టస్

మూలాలు

మార్చు
  1. Bahn, Eugene; Margaret L. Bahn (1970). A History of Oral Interpretation. Minneapolis, MN: Burgess Publishing Company. pp. 3.
  2. Ridgeway (1910), p. 83

ఇతర లంకెలు

మార్చు