గ్రేవ్స్ వ్యాధి
గ్రేవ్స్ వ్యాధిని టాక్సిక్ డిఫ్యూజ్ గాయిటర్ అని కూడా పిలుస్తారు. ఇది థైరాయిడ్ గ్రంధిని ప్రభావితం చేసే స్వయం ప్రతిరక్షక వ్యాధి[1]. ఇది తరచుగా హైపర్ థైరాయిడిజానికి దారితీస్తుంది[2]. ఇది తరచుగా వృద్ధిచెందిన (enlarged) థైరాయిడ్ కూడా దారితీస్తుంది. హైపర్ థైరాయిడిజం లక్షణాలు చిరాకు, కండరాల బలహీనత, నిద్ర సమస్యలు, వేగవంతమైన హృదయ స్పందన, వేడిని తట్టుకోలేని సామర్థ్యం, అతిసారం, అనుకోకుండా బరువు తగ్గడం వంటివి ఉండవచ్చు. ఇతర లక్షణాలలో షిన్లపై (మోకాలి నుండి చీలమండ వరకు కాలు ముందు భాగం) చర్మం గట్టిపడటం, దీనిని ప్రీటిబియల్ మిక్సేడెమా అని పిలుస్తారు. కన్ను ఉబ్బుతుంది, దీనిని గ్రేవ్స్ ఆప్తాల్మోపతీ అని పిలుస్తారు. ఈ పరిస్థితి ఉన్నవారిలో సుమారు 25 నుండి 80% మంది కంటి సమస్యలు పెరుగుతాయి[1][3].
గ్రేవ్స్ వ్యాధి | |
---|---|
ఇతర పేర్లు | టాక్సిక్ డిఫ్యూజ్ గాయిటర్, ఫ్లాజాని-బేస్డో-గ్రేవ్స్ వ్యాధి |
గ్రేవ్స్ వ్యాధిలో ఎక్సోఫ్తాల్మోస్ మూత ఉపసంహరణ | |
ప్రత్యేకత | ఎండోక్రినాలజీ |
లక్షణాలు | చిరాకు, కండరాల బలహీనత, నిద్ర సమస్యలు, వేగవంతమైన హృదయ స్పందన, వేడిని తట్టుకోలేని సామర్థ్యం, అతిసారం, అనుకోకుండా బరువు తగ్గడం |
సంక్లిష్టతలు | గ్రేవ్స్ ఆప్తాల్మోపతీ |
సాధారణ ప్రారంభం | 40 నుంచి 60 సంవత్సరాల మధ్య |
కారణాలు | ఖచ్చితమైన కారణం లేదు. అయితే ఇది జన్యు, పర్యావరణ కారకాల కలయక |
ప్రమాద కారకములు | టైప్ 1 మధుమేహం, కీళ్ళవాతము (రుమటాయిడ్ ఆర్థరైటిస్) వంటి ఇతర స్వయం ప్రతిరక్షక వ్యాధులు ఉన్నవారు. ధూమపానం, కంటి సమస్యలు మరింత తీవ్రతరం. |
రోగనిర్ధారణ పద్ధతి | రక్త పరీక్షలు, రేడియోఅడిన్ తీసుకోవడం |
చికిత్స | రేడియోఆయోడిన్ చికిత్స, మందులు, థైరాయిడ్ శస్త్రచికిత్స. రేడియోఆయోడిన్ |
తరుచుదనము | 0,5% మంది పురుషులు, 3% మంది స్త్రీలు |
కారణాలు
మార్చుఖచ్చితమైన స్పష్టమైన కారణం లేదు, అయితే ఇది జన్యు, పర్యావరణ కారకాల కలిసి ఉంటుందని భావిస్తారు. కుటుంబంలో ఒక వ్యక్తికి వ్యాధి ఉంటే తరువాతవారు ప్రభావితమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది[1]. కవలలలో ఒకరు ప్రభావితమైతే ఇతరులకు కూడా వ్యాధి వచ్చే అవకాశం 30% ఉంటుంది[4]. వ్యాధి ప్రారంభానికి శారీరక లేదా భావోద్వేగ ఒత్తిడి, సంక్రమణం లేదా ప్రసవం వంటివి కావచ్చు[3]. టైప్ 1 మధుమేహం, కీళ్ళవాతము (రుమటాయిడ్ ఆర్థరైటిస్) వంటి ఇతర స్వయం ప్రతిరక్షక వ్యాధులు ఉన్నవారు ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ధూమపానం వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది, కంటి సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది. థైరాయిడ్-స్టిమ్యులేటింగ్ ఇమ్యునోగ్లోబులిన్ (టిఎస్ఐ) అని పిలువబడే యాంటీబాడీ నుండి ఈ రుగ్మత వస్తుంది, ఇది థైరాయిడ్ స్టిమ్యులేటర్ హార్మోన్ (టిఎస్ఎచ్) తో సమానమైన ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఈ టిఎస్ఐ ప్రతిరోధకాలు వలన థైరాయిడ్ గ్రంధి అదనపు థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి[1].
రోగ నిర్ధారణ
మార్చురోగ లక్షణాల ఆధారంగా నిర్ధారణ ఉంటుంది. ఇంకా రక్త పరీక్షలు, రేడియోఆయోడిన్ ఇవ్వడం ఆధారంగా జరుగుతుంది[1]. సాధారణంగా, రక్త పరీక్షలలో అంటే T3, T4 లు ఎక్కువ అవడము TSH తగ్గడము, థైరాయిడ్ TSI ప్రతిరోధకాలకు సంబంధించిన అన్ని ప్రాంతాలలో రేడియో ఆయోడిన్ పెరగడం వంటివి పరిగణనలో ఉంటాయి.[3]
చికిత్స
మార్చుచికిత్స లో మూడు రకాలు - రేడియో ఆయోడిన్ చికిత్స, మందులు, థైరాయిడ్ శస్త్రచికిత్స. రేడియో ఆయోడిన్ చికిత్సలో నోటి ద్వారా అయోడిన్-131 తీసుకోవడం ఉంటుంది, ఇది థైరాయిడ్లో కేంద్రీకృతమై ఉంటుంది. వారాల నుండి నెలల వరకు దానిని నాశనం చేస్తుంది. ఫలితంగా వచ్చే హైపోథైరాయిడిజానికి సింథటిక్ థైరాయిడ్ హార్మోన్లతో చికిత్స చేస్తారు. బీటా బ్లాకర్స్ వంటి మందులతో కొన్ని లక్షణాలను నియంత్రించవచ్చు, ఇతర చికిత్సలు ప్రభావం చూపుతున్నప్పుడు మెతిమజోల్ వంటి యాంటిథైరాయిడ్ మందులు తాత్కాలికంగా ఉపయోగపడవచ్చు. థైరాయిడ్ను శస్త్రచికిత్స ద్వారా తొలగించడము కూడా చేస్తారు. కంటి సమస్యలకు అదనంగా చికిత్సలు అవసరం కావచ్చు[1].
గ్రేవ్స్ వ్యాధి వలన 0,5% మంది పురుషులు, 3% మంది స్త్రీలు ప్రభావితమవుతుంటారు. ఇది పురుషుల కంటే మహిళల్లో 7.6 రెట్లు ఎక్కువగా సంభవిస్తుంది[1]. తరచుగా, ఇది 40 నుంచి 60 సంవత్సరాల మధ్య ప్రారంభమవుతుంది, కానీ ఏ వయసులోనైనా ప్రారంభమవవచ్చు[4]. యునైటెడ్ స్టేట్స్ లో హైపర్ థైరాయిడిజానికి ఇది అత్యంత సాధారణ కారణం (సుమారు 50 నుండి 80% కేసులు)[1]. 1835లో ఈ శరీర అనారోగ్య పరిస్థితిని ఐరిష్ శస్త్రవైద్యుడు రాబర్ట్ జేమ్స్ గ్రేవ్స్ వివరించాడు . అందుకు ఈ వ్యాధికి అతని పేరుతో "గ్రేవ్స్ వ్యాధి" అని పెట్టారు[4].
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 1.7 "Graves' Disease". www.niddk.nih.gov. August 10, 2012. Archived from the original on April 2, 2015. Retrieved 2015-04-02.
- ↑ (December 2015). "Management of Graves Disease: A Review".
- ↑ 3.0 3.1 3.2 (June 2008). "Clinical practice. Graves' disease".
- ↑ 4.0 4.1 4.2 Nikiforov, Yuri E.; Biddinger, Paul W.; Nikiforova, Lester D.R.; Biddinger, Paul W. (2012). Diagnostic pathology and molecular genetics of the thyroid (2nd ed.). Philadelphia: Wolters Kluwer Health/Lippincott Williams & Wilkins. p. 69. ISBN 9781451114553. Archived from the original on 2017-09-08.