గ్లెండా హాల్

ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ క్రీడాకారిణి

గ్లెండా జాయ్ హాల్ (జననం 1964, మే 5) ఆల్ రౌండర్‌గా ఆడిన ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ క్రీడాకారిణి. కుడిచేతి లెగ్ బ్రేక్ బౌలింగ్ లో, కుడిచేతి బ్యాటింగ్ లో రాణించింది. 1984- 1988 మధ్యకాలంలో ఆస్ట్రేలియా తరపున రెండు టెస్ట్ మ్యాచ్‌లు, రెండు వన్డే ఇంటర్నేషనల్స్‌లో ఆడింది. ఆస్ట్రేలియన్ క్యాపిటల్ టెరిటరీ, క్వీన్స్‌లాండ్ తరపున దేశీయ క్రికెట్ ఆడింది.[1][2]

గ్లెండా హాల్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
గ్లెండా జాయ్ హాల్
పుట్టిన తేదీ (1964-05-05) 1964 మే 5 (వయసు 60)
బ్రిస్బేన్, ఆస్ట్రేలియా
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి leg break
పాత్రAll-rounder
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 104)1984 3 February - India తో
చివరి టెస్టు1984 10 February - India తో
తొలి వన్‌డే (క్యాప్ 39)1984 25 January - India తో
చివరి వన్‌డే1988 25 January - New Zealand తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1979/80–1994/95Australian Capital Territory
1996/97Queensland
కెరీర్ గణాంకాలు
పోటీ WTest WODI WFC WLA
మ్యాచ్‌లు 2 2 30 38
చేసిన పరుగులు 17 0 552 514
బ్యాటింగు సగటు 8.50 0.00 17.25 14.68
100లు/50లు 0/0 0/0 0/2 0/2
అత్యుత్తమ స్కోరు 12 0 92 65*
వేసిన బంతులు 282 36 3,192 1,937
వికెట్లు 1 0 48 44
బౌలింగు సగటు 134.00 23.33 19.93
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 2 1
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 1/41 5/26 5/10
క్యాచ్‌లు/స్టంపింగులు 1/– 1/– 13/– 14/–
మూలం: CricketArchive, 18 January 2023

1985లో, హాల్ మేరీ కార్నిష్, టీనా మాక్‌ఫెర్సన్, కరెన్ బ్రౌన్, ట్రిష్ డాసన్‌లతో సహా ఆస్ట్రేలియన్ బోర్డ్ ప్రెసిడెంట్స్ XIలో సభ్యురాలిగా ఉంది. ఆడ్రీ కాలిన్స్ ఎంపిక చేసిన ఉమెన్స్ క్రికెట్ అసోసియేషన్ XIకి వ్యతిరేకంగా ఆడింది.[3]

2019, ఏప్రిల్ 5న, క్రికెట్ ఎసిటి హాల్ ఆఫ్ ఫేమ్‌లోకి ప్రవేశించిన మొదటి ఆరుగురు వ్యక్తులలో హాల్ ఒకరు. మిగిలిన ఐదుగురు పీటర్ సోల్వే, మైఖేల్ బెవన్, బ్రోన్విన్ కాల్వెర్, లోర్న్ లీస్, గ్రెగ్ ఇర్విన్.[4]

మూలాలు

మార్చు
  1. "Player Profile: Glenda Hall". ESPNcricinfo. Retrieved 18 January 2023.
  2. "Player Profile: Glenda Hall". CricketArchive. Retrieved 18 January 2023.
  3. Peg McMahon (9 January 1985). "Hawke might go into bat for women". The Age. Fairfax Media. Retrieved 30 April 2014.
  4. Helmers, Caden (5 April 2019). "Ethan Bartlett and Cherie Taylor claim Cricket ACT's top crowns". The Canberra Times. Fairfax Media. Retrieved 9 April 2019.

బాహ్య లింకులు

మార్చు

southernstars.org.au