మహిళల వన్ డే ఇంటర్నేషనల్
మహిళల వన్డే ఇంటర్నేషనల్ (వన్‌డే), మహిళల క్రికెట్‌లో పరిమిత ఓవర్ల రూపం. పురుషుల ఆటలో లాగానే ఈ మ్యాచ్‌లు కూడా 50 ఓవర్లు జరుగుతాయి. ఇంగ్లండ్‌లో జరిగిన మొదటి మహిళల ప్రపంచకప్‌లో భాగంగా, 1973లో మొదటి సారి మహిళల వన్‌డేలు ఆడారు. మొదటి వన్‌డేలో, ఆతిథ్య జట్టు అంతర్జాతీయ XIని ఓడించింది. 1,000 వ మహిళల వన్‌డే 2016 అక్టోబరు 13న దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌ల మధ్య జరిగింది [1]
మహిళల వన్‌డే స్థాయిని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) నిర్ణయిస్తుంది. ఐసిసిలో పూర్తి స్థాయి సభ్యులకే దీన్ని పరిమితం చేసింది. 2022 మేలో ఐసిసి, మరో ఐదు జట్లకు వన్‌డే హోదాను ఇచ్చింది.[2]
పాల్గొన్న దేశాలు
మార్చు2006లో ఐసిసి కేవలం టాప్-10 ర్యాంక్‌లో ఉన్న జట్లకు మాత్రమే టెస్టు, వన్‌డే హోదా ఉంటుందని ప్రకటించింది. 2011 మహిళల క్రికెట్ ప్రపంచ కప్ క్వాలిఫైయర్ సమయంలో నెదర్లాండ్స్ తొలి 6 స్థానాల్లో నిలవకపోవడంతో వన్‌డే హోదాను కోల్పోయింది. వన్‌డే హోదా కలిగిన అగ్ర 4 జట్లు ఈ క్వాలిఫైయింగ్ టోర్నమెంట్‌లో పాల్గొనాల్సిన అవసరం లేనందున, ఈ టోర్నమెంట్‌లోని తొలి 6 జట్లు మొత్తం టాప్ 10 స్థానాల్లో నిలిచాయి. బంగ్లాదేశ్ ప్రస్తుతం వన్‌డే హోదా కలిగి ఉన్న పది దేశాలలో ఒకటిగా నెదర్లాండ్స్ స్థానంలో చేరింది.[3]
2018 సెప్టెంబరులో, ఐసిసి ప్రపంచ కప్ క్వాలిఫైయర్స్‌లోని అన్ని మ్యాచ్‌లకు వన్‌డే హోదా ఇవ్వబడుతుందని ఐసిసి చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవ్ రిచర్డ్‌సన్ ప్రకటించారు.[4] అయితే, 2021 నవంబరులో, ఐసిసి ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటూ, వన్‌డే హోదా లేని జట్టును కలిగి ఉన్న మహిళల ప్రపంచ కప్ క్వాలిఫైయర్‌లోని అన్ని మ్యాచ్‌లు లిస్ట్ A మ్యాచ్‌లుగా రికార్డవుతాయని నిర్ణయించింది.[5] ఇది మహిళల క్రికెట్‌కు ఫస్ట్-క్లాస్, లిస్టు A హోదాను పునరాలోచనలో వర్తింపజేస్తూ మరో ప్రకటన చేసింది.[6][7]
2021 ఏప్రిల్లో ఐసిసి, అన్ని పూర్తి స్థాయి సభ్య దేశాల మహిళా జట్లకు శాశ్వత టెస్టు, వన్‌డే హోదాను ఇచ్చింది.[8] ఈ నిర్ణయంతో ఆఫ్ఘనిస్తాన్, జింబాబ్వే తొలిసారి వన్డే హోదాను పొందాయి. 2022 మేలో, ఐసిసి నెదర్లాండ్స్, పాపువా న్యూ గినియా, స్కాట్లాండ్, థాయిలాండ్, యునైటెడ్ స్టేట్స్‌లకు మహిళా వన్‌డే హోదాను ఇచ్చింది;[9] స్కాట్లాండ్ కాకుండా ఈ దేశాలన్నీ రద్దు చేయబడిన 2021 మహిళల క్రికెట్ ప్రపంచ కప్ క్వాలిఫైయర్‌కు అర్హత సాధించాయి (అయితే COVID-19 కారణంగా పపువా న్యూగినియా క్వాలిఫైయర్ నుండి వైదొలిగింది).
కింది జట్లు కూడా ఒకప్పుడు వన్‌డేలు ఆడాయి. అయితే ప్రస్తుతం వీటికి వన్‌డే హోదా లేదు. అయితే, భవిష్యత్తులో ఆ స్థితిని తిరిగి పొందేందుకు అర్హత పొందవచ్చు.
- డెన్మార్క్ (1989–1999)
- జపాన్ (2003)
ఒకప్పుడు వన్‌డే హోదా ఉన్న నాలుగు వేరే జట్లు కూడా ఉండేవి, కానీ ఇప్పుడు ఉనికిలో లేవు లేదా అవి అంతర్జాతీయ క్రికెట్ ఆడడం లేదు. వీటిలో మూడు, 1973 మహిళల క్రికెట్ ప్రపంచ కప్‌లో మాత్రమే కనిపించాయి. ఆ నాలుగు మాజీ వన్‌డే జట్లు:
- అంతర్జాతీయ XI (1973–1982)
- జమైకా (1973 లో మాత్రమే)
- ట్రినిడాడ్ అండ్ టొబాగో (1973 లో మాత్రమే)
- యంగ్ ఇంగ్లాండ్ (1973 లో మాత్రమే)
ర్యాంకింగ్‌లు
మార్చు2018 అక్టోబరుకు ముందు ఐసిసి, మహిళల ఆట కోసం ప్రత్యేక ట్వంటీ20 ర్యాంకింగ్‌ను నిర్వహించలేదు. ఆట మూడు రూపాల్లోని ప్రదర్శనను మొత్తం మహిళల జట్ల ర్యాంకింగుగా చూపేది.[10] 2018 జనవరిలో ఐసిసి, అసోసియేట్ దేశాల మధ్య జరిగే అన్ని మ్యాచ్‌లకూ అంతర్జాతీయ హోదాను మంజూరు చేసింది. మహిళల కోసం ప్రత్యేక T20I ర్యాంకింగ్‌లను ప్రారంభించే ప్రణాళికను కూడా ప్రకటించింది.[11] 2018 అక్టోబరులో T20I ర్యాంకింగ్‌లు పూర్తి సభ్యుల కోసం ప్రత్యేక వన్‌డే ర్యాంకింగ్‌లతో ప్రారంభించబడ్డాయి.[12]
ICC women's ODI rankings | ||||
---|---|---|---|---|
Rank | Team | Matches | Points | Rating |
1 | ఆస్ట్రేలియా | 26 | 4,290 | 165 |
2 | ఇంగ్లాండు | 31 | 3,875 | 125 |
3 | దక్షిణాఫ్రికా | 26 | 3,098 | 119 |
4 | భారతదేశం | 30 | 3,039 | 101 |
5 | న్యూజీలాండ్ | 28 | 2,688 | 96 |
6 | వెస్ట్ ఇండీస్ | 29 | 2,743 | 95 |
7 | బంగ్లాదేశ్ | 17 | 1,284 | 76 |
8 | శ్రీలంక | 12 | 820 | 68 |
9 | థాయిలాండ్ | 13 | 883 | 68 |
10 | పాకిస్తాన్ | 27 | 1,678 | 62 |
11 | ఐర్లాండ్ | 18 | 660 | 37 |
12 | నెదర్లాండ్స్ | 11 | 89 | 8 |
13 | జింబాబ్వే | 11 | 0 | 0 |
Reference: ICC Women's ODI rankings, Updated on 1 August 2023 |
ICC women's ODI rankings | ||||
---|---|---|---|---|
Rank | Team | Matches | Points | Rating |
1 | ఆస్ట్రేలియా | 26 | 4,290 | 165 |
2 | ఇంగ్లాండు | 31 | 3,875 | 125 |
3 | దక్షిణాఫ్రికా | 26 | 3,098 | 119 |
4 | భారతదేశం | 30 | 3,039 | 101 |
5 | న్యూజీలాండ్ | 28 | 2,688 | 96 |
6 | వెస్ట్ ఇండీస్ | 29 | 2,743 | 95 |
7 | బంగ్లాదేశ్ | 17 | 1,284 | 76 |
8 | శ్రీలంక | 12 | 820 | 68 |
9 | థాయిలాండ్ | 13 | 883 | 68 |
10 | పాకిస్తాన్ | 27 | 1,678 | 62 |
11 | ఐర్లాండ్ | 18 | 660 | 37 |
12 | నెదర్లాండ్స్ | 11 | 89 | 8 |
13 | జింబాబ్వే | 11 | 0 | 0 |
Reference: ICC Women's ODI rankings, Updated on 1 August 2023 |
జట్టు గణాంకాలు
మార్చుTeam | Span | Matches | Won | Lost | Tied | NR | % Won |
---|---|---|---|---|---|---|---|
ఆస్ట్రేలియా | 1973– | 353 | 281 | 64 | 2 | 6 | 79.60 |
బంగ్లాదేశ్ | 2011– | 54 | 14 | 35 | 0 | 5 | 25.92 |
డెన్మార్క్ | 1989–1999 | 33 | 6 | 27 | 0 | 0 | 18.18 |
ఇంగ్లాండు | 1973– | 380 | 223 | 144 | 2 | 11 | 58.68 |
భారతదేశం | 1978– | 301 | 164 | 132 | 1 | 4 | 54.48 |
International XI | 1973–1982 | 18 | 3 | 14 | 0 | 1 | 17.64 |
ఐర్లాండ్ | 1987– | 162 | 45 | 111 | 0 | 6 | 27.77 |
జమైకా | 1973 | 5 | 1 | 4 | 0 | 0 | 20.00 |
జపాన్ | 2003 | 5 | 0 | 5 | 0 | 0 | 0.00 |
నెదర్లాండ్స్ | 1984– | 108 | 19 | 88 | 0 | 1 | 17.59 |
న్యూజీలాండ్ | 1973– | 370 | 182 | 178 | 2 | 8 | 49.18 |
పాకిస్తాన్ | 1997– | 194 | 57 | 133 | 1 | 3 | 29.38 |
స్కాట్‌లాండ్ | 2001–2003 | 8 | 1 | 7 | 0 | 0 | 12.50 |
దక్షిణాఫ్రికా | 1997– | 227 | 118 | 94 | 5 | 10 | 51.98 |
శ్రీలంక | 1997– | 175 | 58 | 111 | 0 | 6 | 33.14 |
థాయిలాండ్ | 2022– | 7 | 7 | 0 | 0 | 0 | 100.00 |
ట్రినిడాడ్ అండ్ టొబాగో | 1973 | 6 | 2 | 4 | 0 | 0 | 33.33 |
వెస్ట్ ఇండీస్ | 1979– | 209 | 91 | 108 | 3 | 7 | 43.54 |
Young England | 1973 | 6 | 1 | 5 | 0 | 0 | 16.66 |
జింబాబ్వే | 2021– | 11 | 1 | 10 | 0 | 0 | 9.09 |
Source: Cricinfo, as 25 June 2023. The result percentage excludes no results and counts ties as half a win. |
రికార్డులు
మార్చుబ్యాటింగ్
మార్చురికార్డ్ చేయండి | ప్రథమ | రెండవ | Ref | ||
---|---|---|---|---|---|
అత్యధిక పరుగులు | మిథాలీ రాజ్ | 7098 | షార్లెట్ ఎడ్వర్డ్స్ | 5992 | [13] |
అత్యధిక సగటు (కనిష్ఠ 20 ఇన్నింగ్స్) | రాచెల్ హేహో-ఫ్లింట్ | 58.45 | లిండ్సే రీలర్ | 57.44 | [14] |
అత్యధిక స్కోరు | అమేలియా కెర్ | 232 * | బెలిండా క్లార్క్ | 229 * | [15] |
చాలా శతకాలు | మెగ్ లానింగ్ | 15 | సుజీ బేట్స్ | 12 | [16] |
అత్యధిక 50లు | మిథాలీ రాజ్ | 59 | షార్లెట్ ఎడ్వర్డ్స్ | 55 | [17] |
బౌలింగ్
మార్చురికార్డు | ప్రథమ | రెండవ | Ref | ||
---|---|---|---|---|---|
అత్యధిక వికెట్లు | ఝులన్ గోస్వామి | 255 | కాథరిన్ ఫిట్జ్‌పాట్రిక్ | 180 | [18] |
అత్యుత్తమ సగటు (కనీసం 1000 బంతులు వేస్తే) | గిల్ స్మిత్ | 12.53 | లిన్ ఫుల్‌స్టన్ | 13.26 | [19] |
బెస్టు ఎకానమీ రేట్ (కనీసం 1000 బంతులు వేస్తే) | స్యూ బ్రౌన్ | 1.81 | షారన్ ట్రెడ్రియా | 1.86 | [20] |
అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు | సజ్జిదా షా vs జపాన్ (2003) | 7/4 | జో చాంబర్‌లైన్ vs డెన్మార్క్ (1991) | 7/8 | [21] |
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "South Africa and New Zealand to feature in 1000th women's ODI". ICC. 12 October 2016. Archived from the original on 13 October 2016. Retrieved 12 October 2016.
- ↑ "Two new teams in next edition of ICC Women's Championship". International Cricket Council. Retrieved 25 May 2022.
- ↑ "Ireland and Bangladesh secure ODI status". ICC. Retrieved 24 November 2011.
- ↑ "ICC awards Asia Cup ODI status". International Cricket Council. 9 September 2018. Retrieved 24 November 2021.
- ↑ "Bangladesh trounce USA; Pakistan survive Thailand banana peel". ESPN Cricinfo. Retrieved 23 November 2021.
- ↑ "ICC Board appoints Afghanistan Working Group". International Cricket Council. Retrieved 17 November 2021.
- ↑ "ICC appoints Working Group to review status of Afghanistan cricket; women's First Class, List A classification to align with men's game". Women's CricZone. Retrieved 17 November 2021.
- ↑ "The International Cricket Council (ICC) Board and Committee meetings have concluded following a series of virtual conference calls". ICC. 1 April 2021. Retrieved 1 April 2021.
- ↑ "Bangladesh, Ireland added to 2022-25 Women's Championship; no India vs Pakistan series slotted". ESPN Cricinfo. Retrieved 25 May 2022.
- ↑ "ICC Women's Team Rankings launched". International Cricket Council. Archived from the original on 25 December 2016. Retrieved 12 January 2017.
- ↑ "Women's Twenty20 Playing Conditions" (PDF). International Cricket Council. Archived from the original (PDF) on 24 July 2011. Retrieved 9 February 2010.
- ↑ "ICC Launches Global Women's T20I Team Rankings". 12 October 2018. Retrieved 13 October 2018.
- ↑ "Women's One-Day Internationals / Batting records / Most runs in career". Cricinfo. Retrieved 13 September 2019.
- ↑ "Women's One-Day Internationals / Batting records / Highest career batting average". Cricinfo. Retrieved 13 September 2019.
- ↑ "Women's One-Day Internationals / Batting records / Most runs in an innings". Cricinfo. Retrieved 13 September 2019.
- ↑ "Women's One-Day Internationals / Batting records / Most hundreds in a career". Cricinfo. Retrieved 13 September 2019.
- ↑ "Women's One-Day Internationals / Batting records / Most fifties in career". Cricinfo. Retrieved 13 September 2019.
- ↑ "Women's One-Day Internationals / Bowling records / Most wickets in career". Cricinfo. Retrieved 13 September 2019.
- ↑ "Women's One-Day Internationals / Bowling records / Best career bowling average". Cricinfo. Retrieved 13 September 2019.
- ↑ "Women's One-Day Internationals / Bowling records / Best career economy rate". Cricinfo. Retrieved 13 September 2019.
- ↑ "Women's One-Day Internationals / Bowling records / Best figures in an innings". Cricinfo. Retrieved 13 September 2019.