చండ్రుగొండ మండలం
చండ్రుగొండ మండలం, తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన మండల కేంద్రం.[1]
చంద్రుగొండ | |
— మండలం — | |
తెలంగాణ పటంలో భద్రాద్రి జిల్లా, చంద్రుగొండ స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17°26′37″N 80°28′34″E / 17.443682°N 80.475998°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | భద్రాద్రి జిల్లా |
మండల కేంద్రం | చండ్రుగొండ |
గ్రామాలు | 10 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 145 km² (56 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 49,041 |
- పురుషులు | 25,038 |
- స్త్రీలు | 24,003 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 47.79% |
- పురుషులు | 56.94% |
- స్త్రీలు | 38.15% |
పిన్కోడ్ | 507166 |
2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం ఖమ్మం జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం కొత్తగూడెం రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 10 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు.మండల కేంద్రం చండ్రుగొండ.
గణాంకాలు
మార్చు2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 49,041 - పురుషులు 25,038 - స్త్రీలు 24,003.పిన్ కోడ్: 507166.
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 145 చ.కి.మీ. కాగా, జనాభా 27,911. జనాభాలో పురుషులు 14,000 కాగా, స్త్రీల సంఖ్య 13,911. మండలంలో 7,408 గృహాలున్నాయి.[3]
ఖమ్మం జిల్లా నుండి భద్రాద్రి జిల్లాకు మార్పు.
మార్చు2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా "చంద్రుగొండ" పది (1+9) గ్రామాలుతో మండల కేంద్రంగా కొత్తగా ఏర్పడిన భద్రాద్రి (కొత్తగూడెం) జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[1]
మండలం లోని గ్రామాలు
మార్చురెవెన్యూ గ్రామాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ 1.0 1.1 తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 237 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "భద్రాద్రి కొత్తగూడెం జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-20. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.