చంద్రకాంత్ పండిత్
చంద్రకాంత్ సీతారాం పండిట్ (జననం 1961 సెప్టెంబరు 30) 1986 నుండి 1992 వరకు ఐదు టెస్ట్ మ్యాచ్‌లు, 36 వన్ డే ఇంటర్నేషనల్స్ ఆడిన భారతీయ క్రికెటర్. అతను వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్. 1986 జూన్ 19 న హెడ్డింగ్లీ, లీడ్స్‌లో ఇంగ్లండ్‌తో తన తొలి టెస్టు ఆడాడు. ఇంగ్లాండ్ వికెట్ కీపర్ బ్రూస్ ఫ్రెంచ్‌కు కూడా అదే తొలి టెస్టు. చివరికి భారత్ 2-0తో ఆ సిరీస్‌ను కైవసం చేసుకుంది.
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | చంద్రకాంత్ సీతారామ్ పండిట్ | |||||||||||||||||||||
పుట్టిన తేదీ | ముంబై | 1961 సెప్టెంబరు 30|||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||
పాత్ర | వికెట్ కీపర్ బ్యాటర్ | |||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 174) | 1986 జూన్ 19 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||
చివరి టెస్టు | 1992 జనవరి 25 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 57) | 1986 ఏప్రిల్ 10 - న్యూజీలాండ్ తో | |||||||||||||||||||||
చివరి వన్‌డే | 1992 జనవరి 20 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||
| ||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2006 ఫిబ్రవరి 4 |
1986 ఏప్రిల్ 10 న ఆస్ట్రేలేషియా కప్‌లో షార్జాలో న్యూజిలాండ్‌పై తన తొలి వన్‌డే ఆడాడు. 1987 ప్రపంచ కప్ భారత జట్టులో భాగంగా ఉన్నాడు. తన స్వస్థలమైన ముంబైలో ఇంగ్లండ్‌తో జరిగిన సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో దిలీప్ వెంగ్‌సర్కార్ స్థానంలో ఆడి, వేగంగా 24 (30) పరుగులు చేశాడు; అయితే ఆ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది.[1]
కోచ్‌గా
మార్చుపదవీ విరమణ తర్వాత పండిట్, తాను చదువుకున్న హన్స్‌రాజ్ మొరార్జీ పబ్లిక్ స్కూల్‌లో క్రికెట్ అకాడమీని ప్రారంభించాడు. క్రికెట్ కోచ్‌గా, అతను ముంబై క్రికెట్ జట్టుతో సహా అనేక జట్లతో పనిచేసాడు. 2018, 2019లో వరుసగా రెండు రంజీ ట్రోఫీ విజయాలు సాధించిన విదర్భ క్రికెట్ జట్టుకు శిక్షణ ఇచ్చాడు. అతని కోచింగ్, శిక్షణలో మధ్య ప్రదేశ్ జట్టు 2022 లో మొట్టమొదటి రంజీ ట్రోఫీని గెలుచుకుంది. 2022 లో పండిట్ IPL ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ప్రధాన కోచ్‌గా నియమితుడయ్యాడు.
చైర్మన్
మార్చు2013 సంవత్సరానికి ఆల్ ఇండియా జూనియర్ సెలక్షన్ కమిటీకి ఛైర్మన్‌గా ఉన్నాడు. ఆ తరువాత అతని స్థానంలో కానర్ విలియమ్స్ నియమితుడయ్యాడు.[2]
మూలాలు
మార్చు- ↑ "Full Scorecard of England vs India 2nd SF 1987/88 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2021-07-04.
- ↑ Connor Williams