చంద్ర మాసము

(చంద్రమాసము నుండి దారిమార్పు చెందింది)

చంద్రమాసము అనగా రెండు వరుస అమావాస్యల మధ్య వ్యవధి లేదా రెండు వరుస పున్నమిల మధ్య వ్యవధి.[1] చాంద్ర మానం అంటే తిథులనుఆదారంగా ఒక నెల రోజులను లెక్కించడం. సూర్య సిద్ధాంతం ప్రకారం, సూర్యుడు చుట్టు భూమి తిరగడానికి పట్టే కాలం 365 రోజుల, 6 గంటల, 12 నిమిషాల, 26 సెకండ్లు అయితే చంద్రుడు భూమి చుట్టు 29.53 రోజులలో తిరుగుతాడు. దీనిని రెండుపక్షాలు, ఒక్కో పక్షాన్ని 15 తిధులుగాను విభజించబడినది. ఒక్కో తిధి కనిష్టంగా 21 గంటల నుండి గరిష్టంగా 26 గంటల వ్యవధి కల్గి ఉంటుంది. దీని ప్రకారం 354 రోజులలో 12 మాసాలు పూర్తి అవుతాయి. ఏ మాసంలో అయితే సంక్రమణం ఉండదో ఆ మాసమే అధిక మాసం అని చెబుతారు.

భూమి చుట్టూ చంద్రుడు తిరిగే కక్ష్య, ఒకసారి తిరిగితే అది చాంద్రమాసం

వివరణ

మార్చు

సూర్యుని చుట్టూ భూమి ఒకసారి పరిభ్రమణం చేసిన కాలాన్ని సౌర సంవత్సరం అంటారు. కాని ఈ భ్రమణం వల్ల నెలలు ఏర్పడవు. నెలలను కొలవడానికి చంద్ర బ్రమణమే ఆధారం. భూమి చుట్టూ చంద్రుని పరిభ్రమణ కాలాన్ని నెల అంటారు. దాన్నే చాంద్ర మాసమని అంటారు. ఈ విధంగా ఏర్పడిన 12 చంద్రమాసాలు ఒక సంవత్సర కాలానికి సమానం కాదు. సూర్యుడు మేషం, వృషభం, వంటి 12 రాశులలో ఒక్కో రాశిలో ఒక్క నెల సంచరించడాన్ని సౌర మాసం అని అంటారు. సూర్యుడు ఒక రాశి నుండి మరో రాశి లోనికి ప్రవేశించ డాన్ని రాశి సంక్రమణం అంటారు. ఈ సంక్రమణం ప్రతి నెలలోనూ జరుగుతుంది. కానీ మనం మఖర రాశి సంక్రమణాన్ని మాత్రమే మఖర సంక్రాంతిగా గుర్తిస్తున్నాము. ఒక్కో రాశిలో ఒక నెలపాటు తిరగాల్సిన సూర్యుడు, రెండు నెలల పాటు ఒకే రాశిలో వుండటం వల్ల ఏర్పడేదే అధిక మాసం. అధిక మాసము చంద్ర మానము ద్వారానే వస్తుంది.

మూలాలు

మార్చు
  1. "What is a Lunar Month.? - Time and Date". Orchids (in ఇంగ్లీష్). Archived from the original on 2024-04-16. Retrieved 2024-04-15.