చంద్రశేఖర్ గడ్కరీ
లెఫ్టినెంట్ కల్నల్ చంద్రశేఖర్ వామన్ గడ్కరీ (1928 ఫిబ్రవరి 3 - 1998 జనవరి 11) భారతీయ టెస్ట్ క్రికెట్ ఆటగాడు.
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | చంద్రశేఖర్ వామన్ గడ్కరీ | |||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | పూణే, బ్రిటిషు భారతదేశం | 1928 ఫిబ్రవరి 3|||||||||||||||||||||||||||||||||||||||
మరణించిన తేదీ | 1998 జనవరి 11 పూణే, మహారాష్ట్ర | (వయసు 69)|||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి మీడియం | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 69) | 1953 జనవరి 21 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1955 ఫిబ్రవరి 13 - పాకిస్తాన్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricketArchive, 2022 సెప్టెంబరు 3 |
గడ్కరీ అటాకింగ్ బ్యాటరు, మీడియం పేస్ బౌలరు, గొప్ప ఫీల్డరు. అతను 1952/53 వెస్టిండీస్ పర్యటనలో భారత జట్టులో ఫీల్డరుగా మంచి ముద్ర వేశాడు. అతను జార్జ్‌టౌన్ టెస్టులో 50* పరుగులు చేశాడు. ఇదే అతని అత్యధిక స్కోరుగా మిగిలిపోయింది. అతని మరొక పర్యటన 1954/55లో పాకిస్తాన్‌లో జరిగింది. కెరీర్‌లో ఒక్క మ్యాచ్‌లో కూడా గెలవకుండా, ఓడిపోకుండా అత్యధిక మ్యాచ్‌లు (6) ఆడిన ఆటగాడిగా షఫీక్ అహ్మద్‌తో కలిసి రికార్డు స్థాపించుకున్నాడు.[1]
అతను 1949లో సైన్యంలోకి ప్రవేశించి లెఫ్టినెంట్ కల్నల్‌గా ఎదిగాడు. ఆ తర్వాత రంజీ ట్రోఫీలో సర్వీసెస్‌కు ప్రాతినిధ్యం వహించాడు. కానీ సైన్యంలో ఉద్యోగం కారణంగా అతను ఆడడం తగ్గిపోయింది. అతను కొంతకాలం అనారోగ్యంతో బాధపడి 1998 లో మరణించాడు.
మూలాలు
మార్చు- భారత క్రికెట్ 1998 లో సంస్మరణ
- క్రిస్టోఫర్ మార్టిన్-జెంకిన్స్, టెస్ట్ క్రికెటర్లలో ది కంప్లీట్ హూ
- ↑ Walmsley, Keith (2003). Mosts Without in Test Cricket. Reading, England: Keith Walmsley Publishing Pty Ltd. p. 457. ISBN 0947540067..