చంద్రిక రవి (జననం 1989 ఏప్రిల్ 5) భారతీయ సంతతికి చెందిన ఆస్ట్రేలియన్ నటి, నర్తకి, మోడల్. ఆస్ట్రేలియాలో పుట్టి పెరిగిన ఆమె మోడలింగ్ కెరీర్ కోసం లాస్ ఏంజిల్స్‌కు వెళ్ళింది. దీనికి ముందు ఆమె 2018లో భారతీయ చలనచిత్రం ఇరుట్టు అరైయిల్ మురట్టు కుత్తు(Iruttu Araiyil Murattu Kuththu)లో నటించి ప్రసిద్ధి చెందింది. ఇదే చిత్రం తెలుగులో చీకటి గదిలో చితక్కొట్టుడు గా రీమేక్ చేయబడింది. 2023లో వచ్చిన వీర సింహా రెడ్డి చిత్రంలో మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి.. స్పెషల్ సాంగ్ చేసింది.[1]

చంద్రిక రవి
జననం (1989-04-05) 1989 ఏప్రిల్ 5 (వయసు 35)
మెల్బోర్న్, విక్టోరియా, ఆస్ట్రేలియా
జాతీయతఆస్ట్రేలియన్
వృత్తినటి, మోడల్
క్రియాశీల సంవత్సరాలు2013 – ప్రస్తుతం

కెరీర్

మార్చు

మెల్‌బోర్న్‌లో రవి శ్రీధరన్, మాలిక రవి దంపతులకు చంద్రిక జన్మించింది. ఆమె మూడు సంవత్సరాల వయస్సు నుండి డ్యాన్స్, యాక్టింగ్ నేర్చుకోవడం ప్రారంభించింది, ఆమె 16 సంవత్సరాల వయస్సులో ప్రపంచవ్యాప్తంగా థియేటర్, ఫిల్మ్, టీవీలో ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించింది. ఆమె 2014 మిస్ మాగ్జిమ్ ఇండియాలో రన్నరప్ టైటిల్‌ను గెలుచుకుంది. 2012 మిస్ వరల్డ్ ఆస్ట్రేలియా, మిస్ ఇండియా ఆస్ట్రేలియాలో ఫైనలిస్ట్‌గా నిలిచిన మొదటి భారతీయ సంతతి మహిళగా గుర్తింపు పొందింది.

చంద్రికా రవి 2017లో తమిళ చిత్రం సేయ్‌తో భారతీయ చలనచిత్ర రంగ ప్రవేశం చేసింది. అడల్ట్ కామెడీ హారర్ అయిన ఇరుట్టు అరైయిల్ మురట్టు కుత్తు చిత్రంలో దెయ్యం పాత్రలో ఆమె నటన ద్వారా తమిళ చిత్ర పరిశ్రమలో గుర్తింపు పొందింది.

ఫిల్మోగ్రఫీ

మార్చు
సంవత్సరం సినిమా పాత్ర భాష నోట్స్
2018 ఇరుట్టు అరైయిల్ మురట్టు కుత్తు దెయ్యం తమిళం
సెయి నాన్సీ
2019 ఉన్ కాదల్ ఇరుంధాల్
చీకటి గదిలో చితక్కొట్టుడు ప్రత్యేక ప్రదర్శన తెలుగు ఇరుట్టు అరైయిల్ మురట్టు కుత్తు రీమేక్
2023 వీర సింహ రెడ్డి "మా బావ మనోభావాలు.." పాటలో ప్రత్యేక పాత్ర
TBA బాలీవుడ్ టు హాలీవుడ్ చంద్ర ఇంగ్లీష్
2023 సిల్క్‌ స్మిత - ది అన్‌టోల్డ్‌ స్టోరీ సిల్క్‌ స్మిత నిర్మాణంలో ఉంది[2]

మూలాలు

మార్చు
  1. "వెన్నునొప్పి భరిస్తూనే బాలకృష్ణ మూవీలో డ్యాన్స్‌ చేశా: చంద్రిక రవి". web.archive.org. 2023-02-18. Archived from the original on 2023-02-18. Retrieved 2023-02-18.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. Namasthe Telangana (2 December 2023). "తెరపై మరోసారి సందడి చేయనున్న 'సిల్క్ స్మిత'.. హీరోయిన్‌గా ఎవరంటే..?". Retrieved 2 December 2023. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)