వీర సింహా రెడ్డి

వీర సింహా రెడ్డి 2023లో విడుదలైన తెలుగు సినిమా. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించాడు. బాలకృష్ణ, శృతి హాసన్,హనీ రోజ్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను జనవరి 5 విడుదల చేయగా[3], సినిమా సంక్రాంతి కానుకగా 2023 జనవరి 12న విడుదలైంది.[4]

వీర సింహా రెడ్డి
దర్శకత్వంగోపీచంద్ మలినేని
రచనగోపీచంద్ మలినేని
నిర్మాత
 • నవీన్ ఎర్నేని
 • వై. రవిశంకర్
తారాగణం
ఛాయాగ్రహణంరిషి పంజాబీ
కూర్పునవీన్ నూలి
సంగీతంఎస్.ఎస్. తమన్
నిర్మాణ
సంస్థ
మైత్రీ మూవీ మేకర్స్
విడుదల తేదీs
2023 జనవరి 12 (2023-01-12)(థియేటర్)
2023 ఫిబ్రవరి 23 (2023-02-23)( డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌ ఓటీటీలో)[1]
దేశంభారతదేశం
భాషతెలుగు
బడ్జెట్70 కోట్లు[2]

కథ సవరించు

రాయలసీమలో పులిచర్ల ప్రజలకు దేవుడు వీరసింహారెడ్డి (నందమూరి బాలకృష్ణ). ఆ ఊరికి ఏ కష్టమొచ్చిన ముందుటాడు. జై (నందమూరి బాలకృష్ణ) అతని తల్లి మీనాక్షి (హనీ రోజ్) తో కలిసి ఇస్తాంబుల్‌లో ఉంటూ హోటల్ బిజినెస్ చేస్తూ ఉంటారు. అతనికి ఈషా (శృతి హాసన్) అనే అమ్మాయి పరిచయమై.. ఆ పరిచయం పెళ్ళి వరకు వెళుతుంది. ఈషా తండ్రి (మురళీ శర్మ) ఈ పెళ్ళికి ఒప్పుకుంటాడు. మీనాక్షి కబురు చేయగానే సీమ నుండి వీరసింహారెడ్డి ఇస్తాంబుల్ వస్తాడు. అతనిని వెతుక్కుంటూ ప్రత్యర్థి ప్రతాప్ రెడ్డి (దునియా విజయ్), అతని భార్య భానుమతి (వరలక్ష్మి శరత్ కుమార్) ఇస్తాంబుల్ వచ్చి వీరసింహారెడ్డిపై దాడి చేస్తారు. వీరసింహారెడ్డికి చెల్లెలైన భానుమతి వీరసింహారెడ్డిని ఎందుకు చంపాలని అనుకుంటుంది? మీనాక్షి ఇస్తాంబుల్‌లో ఎందుకుంది? ప్రతాప్ రెడ్డి‌కి వీరసింహారెడ్డికి మధ్య పగకు కారణమేంటి ? అనేదే మిగతా సినిమా కథ.[5]

నటీనటులు సవరించు

సాంకేతిక నిపుణులు సవరించు

పాటలు సవరించు

పాట గీత రచయిత గాయకులు
మాస్ మొగుడు[8] రామజోగయ్య శాస్త్రి మనో, రమ్య బెహరా
మా బావ మనోభావాలు రామజోగయ్య శాస్త్రి చంద్రికా రవి
సుగుణ సుందరి[9] రామజోగయ్య శాస్త్రి రామ్‌ మిరియాల, స్నిగ్ధ
జై బాలయ్య మాస్ ఆంథమ్ రామజోగయ్య శాస్త్రి

మూలాలు సవరించు

 1. Namasthe Telangana (12 February 2023). "ఓటీటీలోకి బాల‌య్య వీర సింహారెడ్డి". Archived from the original on 12 February 2023. Retrieved 12 February 2023.
 2. 10TV (28 May 2022). "టాలీవుడ్‌ని రూల్ చేస్తున్న ప్రొడక్షన్ హౌస్.. వామ్మో ఇన్ని సినిమాలా." Archived from the original on 3 December 2022. Retrieved 3 December 2022.
 3. Sakshi (6 January 2023). "నాది ఫ్యాక్షన్‌ కాదు.. సీమపై ఎఫెక్షన్.. వీరసింహారెడ్డి ట్రైలర్‌ అవుట్". Archived from the original on 6 January 2023. Retrieved 6 January 2023.
 4. A. B. P. Desam (3 December 2022). "సంక్రాంతి బరిలో బాలయ్య - 'వీర సింహా రెడ్డి' విడుదల తేదీ చెప్పేశారోచ్". Archived from the original on 3 December 2022. Retrieved 3 December 2022.
 5. Eenadu (12 January 2023). "రివ్యూ: వీరసింహారెడ్డి". Archived from the original on 25 February 2023. Retrieved 25 February 2023.
 6. Namasthe Telangana (6 January 2023). "బాలకృష్ణతో నటించడం నా అదృష్టం!". Archived from the original on 6 January 2023. Retrieved 6 January 2023.
 7. Namasthe Telangana (5 January 2023). "బాలకృష్ణతో తొలిసారి ఏం మాట్లాడారు..? చంద్రికా రవి చిట్‌ చాట్‌". Archived from the original on 6 January 2023. Retrieved 6 January 2023.
 8. 10TV Telugu (9 January 2023). "మాస్ మొగుడు లిరికల్ సాంగ్.. శ్రుతితో బాలయ్య ఊరమాస్ రొమాన్స్!". Archived from the original on 9 January 2023. Retrieved 9 January 2023.
 9. Namasthe Telangana (16 December 2022). "సుర సుర చూపుల రాకుమారి". Archived from the original on 9 January 2023. Retrieved 9 January 2023.

బయటి లింకులు సవరించు