చంపక్ (Champak) అనేది ఎనిమిది భారతీయ భాషలలో వెలువడుతున్న పిల్లల మాసపత్రిక. 'చంపక్' అంటే సుగంధపూరితమైన చంపకం లేదా సంపంగి పువ్వు. ఈ పత్రిక వ్యవస్థాపకులు విశ్వనాథ్ (1917-2002) . ఇది 1968 సంవత్సరం నుండి తెలుగు, ఇంగ్లీషు, గుజరాతీ, మరాఠీ, తమిళం, కన్నడం, మళయాళం, హిందీ భాషలలో ఢిల్లీ నుండి ముద్రించబడుతున్నది (రిజిస్ట్రేషన్ నెం. RNI 32462) . ఈ పత్రికకు ఆన్ లైన్ ఎడిషన్ కూడా ఉన్నది కాబట్టి ఇంటర్నెట్లో చదువుకొనే వీలుంది. దీని ప్రస్తుత ఎడిటర్, పబ్లిషర్ పరేష్ నాథ్.[1]

చంపక్ పత్రిక ముఖచిత్రం.

పత్రికలో నీతిని బోధించే కథలతో బాటు తెనాలి రామకృష్ణ, పూలన్-గొయ్యి, చీకూ, ఐస్ క్రీమ్, నల్ల కోతి చిత్ర కథలు ప్రచురిస్తున్నారు. చంపక్ చేకర్స్, తేడా కనిపెట్టండి, ఏమిటో చెప్పండి?, అందమైన రంగులు నింపండి మొదలైన శీర్షికలు పిల్లల సృజనాత్మకతకు పదునుపెడతాయి.

మూలాలు

మార్చు
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-07-21. Retrieved 2009-06-20.

బయటి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=చంపక్&oldid=2985317" నుండి వెలికితీశారు