ప్రధాన మెనూను తెరువు

గుజరాతీ భాష

భారతీయ భాష
(గుజరాతీ నుండి దారిమార్పు చెందింది)

గుజరాతీ (ગુજરાતી Gujǎrātī?) ఒక ఇండో-ఆర్యన్ భాష, మరియు ఇండో-యూరోపియన్ భాషాకుటుంబానికి పాక్షికంగా చెందునది. భారతదేశపు గుజరాత్ రాష్ట్రానికిచెందిన ప్రాంతీయ మరియు అధికారికభాష. గుజరాత్ లోనూ, డామన్ మరియు డయ్యు లోనూ దాద్రా నాగర్ హవేలి లోనూ మాట్లాడబడుచున్నది.

గుజరాతీ
ગુજરાતી Gujǎrātī 
ఉచ్ఛారణ: /gudʒ.(ə)'ɾɑ̈t̪i/
మాట్లాడే దేశాలు: భారతదేశం, పాకిస్తాన్, దక్షిణ ఆఫ్రికా, ఉగాండా, టాంజానియా, కెన్యా, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, యునైటెడ్ కింగ్‌ డం, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, ఫిజి, కెనడా, జాంబియా, జింబాబ్వే
మాట్లాడేవారి సంఖ్య: 46.1 million[1] 
ర్యాంకు: 26
భాషా కుటుంబము:
 ఇండో-ఇరానియన్
  ఇండో-ఆర్యన్
   Western Indo-Aryan
    గుజరాతీ 
వ్రాసే పద్ధతి: గుజరాతి లిపి 
అధికారిక స్థాయి
అధికార భాష: గుజరాత్ (భారతదేశం)[1][2]
నియంత్రణ: అధికారిక నియంత్రణ లేదు
భాషా సంజ్ఞలు
ISO 639-1: gu
ISO 639-2: guj
ISO 639-3: guj
Indic script
This page contains Indic text. Without rendering support you may see irregular vowel positioning and a lack of conjuncts. More...

ప్రపంచంలో దాదాపు 4.6కోట్లమంది గుజరాతీ మాట్లాడేవారుకలరు. ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే 26వ భాష (రోమానీ మరియు సింధీ భాషలతో కలిపి). ఇది పశ్చిమభారతంలో మాట్లాడు నవీన ఇండో-ఆర్యన్ భాష. భారత జాతిపిత మహాత్మాగాంధీ, పాకిస్తాన్ జాతిపిత ముహమ్మద్ అలీ జిన్నా, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయి పటేల్ ల ప్రథమభాష గుజరాతీ.

  1. 1.0 1.1 Gordon 2005
  2. Dwyer 1995, p. 5