చంపై సోరెన్
చంపై సోరెన్ (జననం: 1956 నవంబరు 1) ఝార్ఖండ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. [2][3] అతను సెరైకెల్ల శాసనసభ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు శాసనసభ్యునిగా ఎన్నికై జార్ఖండ్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసాడు.
చంపై సోరెన్ | |||
| |||
జార్ఖండ్ ముఖ్యమంత్రి (ప్రతిపాదిత)
| |||
పదవీ కాలం 2024 ఫిబ్రవరి 2 – 4 జులై 2024 | |||
గవర్నరు | సీ.పీ. రాధాకృష్ణన్ | ||
---|---|---|---|
ముందు | హేమంత్ సోరెన్ | ||
తరువాత | హేమంత్ సోరెన్ | ||
పదవీ కాలం 29 డిసెంబర్ 2019 – 31 జనవరి 2024 | |||
శాసనసభ సభ్యుడు
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2005 | |||
ముందు | అనంత్ రామ్ తుడు | ||
నియోజకవర్గం | సెరైకెల్ల | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | నవంబర్ 1956 జిలింగ్‌గోరా గ్రామం, సరాయికేలా ఖర్సావా జిల్లా, ఝార్ఖండ్, భారతదేశం | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | జార్ఖండ్ ముక్తి మోర్చా | ||
సంతానం | నలుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు[1] |
మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను మనీ లాండరింగ్ ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు [4][5][6][7]అరెస్టు చేసిన తర్వాత 2024 జనవరి 31న ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ రాజీనామా చేయడంతో జేఎంఎం సీనియర్ నాయకుడిగా ఉన్న చంపై సోరెన్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రతిపాదించారు.[8][9] చంపై సోరెన్ 2024 ఫిబ్రవరి 2న జార్ఖండ్ 7వ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు.[10] అతను ఆ పదవిలో తిరిగి హేమంత్ సోరెన్ 2024 జూన్ 28న బెయిలుపై బయటికి వచ్చి తరిగి 2024 జులై 4న జార్ఖండ్ ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు స్వీకరించేవరకు పని చేసాడు.[11]
రాజకీయ జీవితం
మార్చుజార్ఖండ్ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో శిబు సోరెన్‌తో కలిసి చంపై చురుగ్గా పాల్గొన్ని ‘జార్ఖండ్ టైగర్’గా పేరు తెచ్చుకున్నాడు. ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం తరువాత ఆయన సరైకేలా నుండి ఎమ్మెల్యేగా గెలిచి ఆ తరువాత జార్ఖండ్ ముక్తి మోర్చాలో చేరి మంత్రిగా పని చేశాడు.
నిర్వహించిన పదవులు
మార్చుసంవత్సరం | పదవి |
---|---|
2005 - 2009 | 2వ జార్ఖండ్ అసెంబ్లీకి ఎన్నికయ్యాడు |
2009 - 2014 | 3వ జార్ఖండ్ అసెంబ్లీకి ఎన్నికయ్యాడు
|
2014 - 2019 | 4వ జార్ఖండ్ అసెంబ్లీకి ఎన్నికయ్యాడు |
2019 - 2024 | 5వ జార్ఖండ్ అసెంబ్లీకి ఎన్నికయ్యాడు
|
2024 ఫిబ్రవరి 2 -2024 జులై 4 | జార్ఖండ్ ముఖ్యమంత్రి (నియమించబడింది) |
మూలాలు
మార్చు- ↑ 10TV Telugu (31 January 2024). "ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ రాజీనామా.. కొత్త సీఎంగా చంపై సోరెన్.. ఈ 'జార్ఖండ్ టైగర్' ఎవరో తెలుసా?" (in Telugu). Archived from the original on 1 February 2024. Retrieved 1 February 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ "CHAMPAI SOREN : Bio, Political life, Family & Top stories". The Times of India. Archived from the original on 1 February 2024. Retrieved 5 February 2020.
- ↑ "Champai Soren: Champai Soren JMM from JAMSHEDPUR in Lok Sabha Elections | Champai Soren News, images and videos". The Economic Times. Archived from the original on 1 February 2024. Retrieved 5 February 2020.
- ↑ Agencies, ENS (2024-07-03). "Champai Soren resigns as Jharkhand CM, Hemant stakes claim to form govt". The New Indian Express (in ఇంగ్లీష్). Retrieved 2024-07-03.
- ↑ "'Jharkhand Tiger' Champai Soren likely to take over as Chief Minister". indiatoday.in. 31 January 2024. Archived from the original on 31 January 2024. Retrieved 31 January 2024.
- ↑ "Champai Soren to be next Jharkhand CM as Hemant Soren faces arrest by ED". Hindustan Times (in ఇంగ్లీష్). 2024-01-31. Archived from the original on 31 January 2024. Retrieved 2024-01-31.
- ↑ "Champai Soren Quits As Jharkhand Chief Minister, Paves Way For Hemant Soren". NDTV.com. Retrieved 2024-07-03.
- ↑ Andhrajyothy (31 January 2024). "హేమంత్ సోరెన్ రాజీనామా.. కొత్త సీఎంగా చంపయి సోరెన్." Archived from the original on 1 February 2024. Retrieved 1 February 2024.
- ↑ V6 Velugu (2 February 2024). "ఉత్కంఠకు తెర.. జార్ఖండ్ సీఎంగా చంపై సోరెన్ ప్రమాణం". Archived from the original on 3 February 2024. Retrieved 3 February 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Andhrajyothy (2 February 2024). "వీడిన సస్పెన్స్.. సీఎంగా ప్రమాణం చేసిన చంపయి సోరెన్." Archived from the original on 18 February 2024. Retrieved 18 February 2024.
- ↑ Telugu, ntv (2024-08-18). "Champai Soren: జార్ఖండ్ రాజకీయాల్లో కీలక పరిణామం.. బీజేపీలోకి మాజీ సీఎం చంపై సోరెన్!". NTV Telugu. Retrieved 2024-09-21.