చక్కలు

సాధారణంగా హరిదాసులు వాడే సంగీత వాయిద్యం

చిరుతలు వీటినే కొన్ని ప్రాంతాలలో చక్కలు అని అంటారు. వీటిని హరిదాసులు ఎక్కువగా వాడుతారు. భజనలు చేసేవారు కూడా వాడుతారు. ఇలా చక్కలు వాయిస్తూ చేసే భజనను చక్కభజన అని అంటారు. భజనలు చేసేవారు వాడే చెక్కలు కొంత పెద్దవిగానూ, ఆ చెక్కలలో గజ్జెలు మొదలవు వానిని అమర్చి వుంటాయి. వాటిని వాయిస్తున్నప్పుడు చప్పుడు వస్తుంది. దానికనుగుణంగా వారు భజన పాటలను పాడుతారు. దానినే చెక్కభజన అని అంటారు. దీనినే కొన్ని ప్రాంతాలలో రాంభజన అని కూడా అంటారు. ఈ రామభజనలు, చెక్క బనజలు వివిధ ప్రాంతీయ నామాలతో తెలుగు రాష్ట్రాలలో విస్త్రుతంగా వ్యాప్తిలో ఉన్నాయి.

చక్కలు
హైదరాబాదులో చిరుతల భజన చేస్తున్న కళాకారులు
ప్రపంచ జానపద దినోత్సవ వేడుకల్లో భాగంగా 2019 ఆగస్టు 31న హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ నిర్వహించిన జానపద జాతర సాంస్కృతిక కార్యక్రమంలో చిరుతల భజన ప్రదర్శన
"https://te.wikipedia.org/w/index.php?title=చక్కలు&oldid=4351949" నుండి వెలికితీశారు