సి.రంగరాజన్
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
చక్రవర్తి రంగరాజన్, 1932లో జన్మించిన భారతదేశానికి చెందిన ఆర్థిక వేత్త. 1964లో పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో పి.హెచ్.డి.పట్టా పొందాడు. ఇతడు దశాబ్దం కాలానికి పైగా 1982 నుంచి 1991 వరకు భారతీయ రిజర్వ్ బాంక్ డిప్యూటీ గవర్నరుగా పనిచేశాడు. ఆ తర్వాత 1992 డిసెంబరు 22 నుంచి 1997 డిసెంబరు 21 వరకు రిజర్వ్ బ్యాంక్ గవర్నరుగా పనిచేశాడు. 1997, నవంబరు 24 నుంచి 2003, జనవరి 3 వరకు ఆంధ్రప్రదేశ్ గవర్నరుగా పనిచేసాడు. ఆ తర్వాత 12 వ ఆర్థిక కమీషన్ చైర్మెన్ గా పదవి చేపట్టాడు. ప్రధానమంత్రి ఆర్థిక సలహా కౌన్సిల్ చైర్మెన్ పదవిలో [1] కొనసాగి రాజీనామా చేశాడు. 2008, ఆగష్టు 13న రాజ్యసభకు నియమితుడయ్యాడు.[2] ఆంధ్రప్రదేశ్ గవర్నరుగా ఉన్న సమయంలో 1998 నుంచి 1999 వరకు ఒడిశా గవర్నరుగా, 2001 నుంచి 2002 వరకు తమిళనాడు గవర్నరుగా అదనపు బాధ్యతల్ని చేపట్టాడు.
సి.రంగరాజన్ | |
---|---|
Chairman of the Prime Minister's Economic Advisory Council | |
In office August 2009 – 16 May 2014 | |
తరువాత వారు | Bibek Debroy |
In office 2005 – 2008 | |
అంతకు ముందు వారు | Suresh D. Tendulkar |
Member of Rajya Sabha | |
In office August 2008 – August 2009 | |
Chairman of the Twelfth Finance Commission of India | |
In office 2003–2004 | |
అంతకు ముందు వారు | A. M. Khusro |
తరువాత వారు | Vijay Kelkar |
16th Governor of Andhra Pradesh | |
In office 24 November 1997 – 3 January 2003 | |
అంతకు ముందు వారు | Krishan Kant |
తరువాత వారు | Surjit Singh Barnala |
19th Governor of Reserve Bank of India | |
In office 22 December 1992 – 21 November 1997 | |
అంతకు ముందు వారు | S. Venkitaramanan |
తరువాత వారు | Bimal Jalan |
Member of Planning Commission of Government of India | |
In office 21 August 1991 – 21 December 1992 | |
Deputy Governor of Reserve Bank of India | |
In office 12 February 1982 – 20 August 1991 | |
గవర్నర్ | Manmohan Singh Amitav Ghosh (banker) R.N. Malhotra S. Venkitaramanan |
వ్యక్తిగత వివరాలు | |
రాజకీయ పార్టీ | Independent |
కళాశాల | National College, Trichy University of Madras (B.A.) University of Pennsylvania (Ph.D.) |
నైపుణ్యం | Economist Civil servant |
సంతకం |
2002లో భారత ప్రభుత్వం అతనికి రెండో అత్యున్నత పౌర అవార్డు అయిన పద్మ విభూషణ్ ఇచ్చి సత్కరించింది.
మూలాలు
మార్చు- ↑ "List of Governors". Reserve Bank of India. Archived from the original on 2008-09-16. Retrieved 2006-12-08.
- ↑ C. Rangarajan nominated to Rajya Sabha - The Hindu Business Line