చక్రవర్తి (సినిమా)

చక్రవర్తి 1987 లో వచ్చిన తెలుగు చిత్రం, రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో, కోడలి వెంకటేశ్వరరావు నిర్మించారు. ఈ చిత్రంలో చిరంజీవి, మోహన్ బాబు, భానుప్రియ, రమ్య కృష్ణ ముఖ్య పాత్రల్లో నటించారు. చక్రవర్తి సంగీతం అందించాడు.[1][2] ఇది తమిళ చిత్రం జ్ఞాన ఒలికి రీమేక్.

చక్రవర్తి
(1987 తెలుగు సినిమా)
TeluguFilm Chakravarthi.JPG
దర్శకత్వం రవిరాజా పినిసెట్టి
నిర్మాణం డా. కె. వెంకటేశ్వరరావు
చిత్రానువాదం రవిరాజా పినిసెట్టి
తారాగణం చిరంజీవి,
భానుప్రియ,
మోహన్ బాబు
సంగీతం కె. చక్రవర్తి
సంభాషణలు గణేష్ పాత్రో
ఛాయాగ్రహణం లోక్ సింగ్
కూర్పు వెళ్ళైస్వామి
నిర్మాణ సంస్థ వసంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

కథసవరించు

అంజి ( చిరంజీవి ) మోటు మనిషి. అతనికి తన సోదరి లక్ష్మి ( రమ్య కృష్ణ ) అంటే చాలా ఇష్టం. అతని ఊళ్ళో, ఒక స్వామీజీ ( జె.వి. సోమయజులు ) అనేక మంది అనాథలకు ఆశ్రయం కల్పిస్తాడు. అంజీకి చిన్ననాటి స్నేహితుడు మోహన్ ( మోహన్ బాబు ) పోలీస్ ఇన్స్పెక్టర్గా ఆ గ్రామానికి వస్తాడు. ఆ గ్రామ ప్రెసిడెంటు ఆశ్రమాన్ని ఏదో రకంగా ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తాడు. అతను ఆశ్రమానికి నిప్పు పెడతాడు. పిల్లలను రక్షించే ప్రయత్నంలో అంజి తన ఎడమ కన్ను కోల్పోతాడు. అంజి సోదరిని వివాహం చేసుకోవాలని స్వామీజీ మోహన్‌ను అభ్యర్థిస్తాడు. అయితే లక్ష్మి అప్పటికే తన క్లాస్‌మేట్ ప్రేంబాబుతో ప్రేమలో ఉంది. కానీ, ప్రేంబాబు అసహ్యంగా ప్రవర్తించినప్పుడు, అంజి అతన్ని తుక్కు రేగ్గొడతాడు. ప్రేంబాబు తరువాత మరణిస్తాడు. ఇప్పుడు, ఇన్స్పెక్టర్ మోహన్ చిరంజీవిని అరెస్టు చేయవలసి వస్తుంది. ఇంతలో, స్వామీజీ ఆలయ ఆభరణాల దొంగ అనే నెపంతో గ్రామంలోకి ప్రవేశించడాన్ని నిషేధిస్తారు. ఈ కుట్ర వెనుక గ్రామ ప్రెసిడెంటు ఉన్నాడు. అకస్మాత్తుగా, ప్రపంచ ప్రఖ్యాత డిస్కో డాన్సరు చక్రవర్తి ఆ గ్రామానికి వస్తాడు. అతడు మారువేషంలో ఉన్న అంజియే. ప్రేంబాబు హత్య కేసులో తన నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకుంటాడు. అన్ని చెడు సంఘటనలకు ప్రెసిడెంటే దోషిని అని తేలుతుంది. అతన్ని అరెస్టు చేస్తారు. మోహన్ లక్ష్మిని పెళ్ళి చేసుకోవడంతో కథ ముగుస్తుంది.

తారాగణంసవరించు

పాటలుసవరించు

లేదు. పాట గాయకులు సాహిత్యం పొడవు (m: ss)
1 "ఊపిరినిండా" ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 04.19
2 "వన్నెలరాణి" ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, జానకి 04.22
3 "సందిట్లో చిక్కిందమ్మ" ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సుశీల 04.09
4 "మొక్కజోన్నా" ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, జానకి 04.16
5 "ఏరు జోలపాడేనయ్య" ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 04.34
6 "మబ్బులు విడివడిపోయే" ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సుశీల 04.23

మూలాలుసవరించు

  1. "Chakravarthy". filmibeat.com. Retrieved 2014-10-26.
  2. "Chakravarthy". .gomolo.com. Archived from the original on 2014-10-26. Retrieved 2014-10-26.