రవిరాజా పినిశెట్టి

రవిరాజా పినిశెట్టి చలనచిత్ర దర్శకుడు, రచయిత. ఈయన తెలుగు, తమిళ భాషలలో ఇంతవరకు దాదాపు 35 చిత్రాలకు దర్శకత్వం వహించారు. యముడికి మొగుడు, పెదరాయుడు, బంగారు బుల్లోడు, చంటి, కొండపల్లి రాజా లాంటి చిత్రాలు ఆయన కెరీర్లో ముఖ్యమైన చిత్రాలు. ఆయన దర్శకత్వం వహించిన సినిమాల్లో ఎక్కువ భాగం పునర్నిర్మాణాలే. తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విజయవంతమైన చిత్రాలను తెలుగులో పునర్నిర్మాణం చేసిన సినిమాలకు దర్శకత్వం వహించాడు.[1]

రవిరాజా పినిశెట్టి
జననంజులై 14[1]
వృత్తిదర్శకుడు, రచయిత
క్రియాశీల సంవత్సరాలు1985 - ప్రస్తుతం
జీవిత భాగస్వామిరాధారాణి
పిల్లలుఆది పినిశెట్టి, సత్యప్రభాస్

కెరీర్ సవరించు

దర్శకుడిగా రవిరాజా మొదటి సినిమా వీరభద్రుడు (1984). చిరంజీవి, రవిరాజా పినిశెట్టి కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా జ్వాల (1985). ఇది బాక్సాఫీసు వద్ద విజయం సాధించింది.[2] 1995 లో మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటించిన పెదరాయుడు ఆయన కెరీర్లో పెద్ద విజయం సాధించిన చిత్రాల్లో ముఖ్యమైనది.


దర్శకత్వం వహించిన చిత్రాల జాబితా సవరించు

తెలుగు సవరించు

తమిళము సవరించు

  • యెమాట్రటే యెమాట్రటే (1988)

మూలాలు సవరించు

  1. 1.0 1.1 "విస్కీ బాటిళ్లతో సీనియర్ దర్శకుడు.. తలపట్టుకున్న హీరో తల్లి". Samayam Telugu. Retrieved 2021-02-22.
  2. "Chiranjeevi: చిరంజీవి, దర్శకుడు రవిరాజా పినిశెట్టి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు ఇవే." News18 Telugu. 2020-09-19. Retrieved 2021-02-22.

బయటి లింకులు సవరించు