చక్రవాకం (సినిమా)
కోడూరి కౌసల్యాదేవి నవల "చక్రవాకం" ఆధారంగా, డి. రామానాయుడు ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రేమనగర్ తర్వాత తీయబడ్డ ఈ చిత్రం అక్కినేని అనారోగ్య కారణంగా, శోభన్ బాబు కథానాయకుని పాత్ర పోషించారని చెబుతారు. ఎస్.వీ.ఆర్, జి.వరలక్ష్మి, వాణిశ్రీ, చంద్రకళ, రాజబాబు, శ్రీధర్ వంటి మంచి తారాబలంతో నిర్మించిన ఈ చిత్రం వాణిజ్యపరంగా సఫలం కాలేదు. చక్రవాకం అనే మకుటం సామాన్య ప్రేక్షకులకు అర్ధం కాలేదనేది ఒక కారణంగా చెబుతారు.
చక్రవాకం (1974 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | వి.మధుసూదన రావు |
---|---|
తారాగణం | శోభన్ బాబు, వాణిశ్రీ, చంద్రకళ, ఎస్.వి.రంగారావు, నాగభూషణం, రాజసులోచన |
సంగీతం | కె.వి.మహదేవన్ |
నిర్మాణ సంస్థ | సురేష్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
కథ
మార్చువాణిశ్రీ, శోభన్ లు ప్రేమికులు. ఆస్తి వేరేవారికి పోరాదని శోభన్ వదిన జి.వరలక్ష్మి అతన్ని తన చెల్లెలు చంద్రకళకు ఇచ్చి చేయాలని ప్రయత్నిస్తుంది. ప్రేమికులు దూరం కావడం, కథానాయిక కష్టాలు పాలై తండ్రిని పోగొట్టు కొవడం, చివరికి ప్రేమికుల కలయిక చిత్రకథ.
పాటలు
మార్చు- వీణలోనా, తీగలోనా, ఎక్కడున్నది రాగము, అది ఎలాగైనది రాగము - పి.సుశీల
- ఈ నదిలా నా హృదయం పరుగులు తీస్తుంది. ఏ ప్రేమ కడలినో ఏ వెచ్చని ఒడినో వెతుకుతు వెళుతుంది - వి.రామకృష్ణ, పి.సుశీల
- వీణ లేని తీగను నీవులేని బ్రతుకును మోస్తూ జీవించలేను ముగిసిందని మరణించలేని - వి.రామకృష్ణ, పి.సుశీల
- కొత్తగా పెళ్ళైన కుర్రవానికి పట్టపగలె తొందర - వి.రామకృష్ణ, పి.సుశీల
మూలాలు
మార్చు- డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.