చక్ నోరిస్
చక్ నోరిస్ (జ. మార్చి 10, 1940) ఒక అమెరికన్ మార్షల్ ఆర్టిస్ట్, నటుడు. ఇతనికి టాంగ్ సూ డూ, బ్రెజిలియన్ జియు జిట్సూ, జూడో లో బ్లాక్ బెల్ట్ ఉంది.[1] అమెరికన్ వైమానిక దళంలో పనిచేశాక చక్ అనేక మార్షల్ ఆర్ట్స్ పోటీల్లో గెలుపొందాడు. తర్వాత చున్ కుక్ డో అనే తనదైన శైలిని రూపొందించాడు. తర్వాత హాలీవుడ్ లో కొంతమంది సెలెబ్రిటీలకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించాడు. 1968 లో ద రెకింగ్ క్రూ అనే సినిమాలో చిన్న పాత్రలో కనిపించాడు. తర్వాత తన స్నేహితుడు, సాటి మార్షల్ ఆర్టిస్ట్ అయిన బ్రూస్ లీ సలహాతో ద వే ఆఫ్ ద డ్రాగన్ (1972) చిత్రంలో ప్రధాన ప్రతినాయక పాత్ర పోషించాడు. నోరిస్ ఇలాంటి పాత్రల్లో నటిస్తుండగానే అతని స్నేహితుడు, విద్యార్థి అయిన స్టీవ్ మెక్‌క్వీన్ అతన్ని నటనను మరింత సీరియస్ గా తీసుకోమని సలహా ఇచ్చాడు.
చక్ నోరిస్ | |
---|---|
జననం | కార్లోస్ రే నోరిస్ 1940 మార్చి 10 ర్యాన్, ఒక్లహోమా, అమెరికా |
వృత్తి | మార్షల్ ఆర్టిస్ట్, నటుడు, రచయిత |
క్రియాశీల సంవత్సరాలు | 1968–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి |
|
పిల్లలు | 5; including Mike and Eric |
బంధువులు | Aaron Norris (brother) |
Military career | |
రాజభక్తి | మూస:US |
సేవలు/శాఖ | యు.ఎస్.ఏ Air Force |
సేవా కాలం | 1958–1962 |
ర్యాంకు | Airman first class |
సంతకం | |
మూలాలు
మార్చు- ↑ "Chuck Norris Earns 3rd Degree Black Belt in BJJ". Fightland.com. Archived from the original on April 2, 2018. Retrieved April 2, 2018.