బ్రూస్ లీ
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
Chinese nameసంప్రదాయ చైనీస్李小龍సరళీకరించిన చైనీస్李小龙
బ్రూస్ లీ | |
---|---|
![]() | |
జననం | లీ జున్-ఫాన్ 1940 నవంబరు 27 శాన్ ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియా, యు.ఎస్. |
మరణం | 1973 జూలై 20 | (వయస్సు 32)
మరణ కారణం | సెరెబ్రల్ ఎడెమా |
ఇతర పేర్లు | లే యూన్-చం లే యూన్-కామ్ |
వృత్తి | నటుడు, తత్వవేత్త |
ఎత్తు | 1.72 మీ. (5 అ. 8 అం.) |
తల్లిదండ్రులు |
|
పురస్కారాలు | హాంకాంగ్ ఫిల్మ్ అవార్డ్స్ – Lifetime Achievement Award[1] 1994 Star of the Century Award[2] 2004 Golden Horse Awards – Best Mandarin Film 1972 ఫిస్ట్స్ ఆఫ్ ఫ్యూరీ[1] Special Jury Award 1972 ఫిస్ట్స్ ఆఫ్ ఫ్యూరీ |
వెబ్సైటు | బ్రూస్ లీ ఫౌండేషన్ బ్రూస్ లీ అధికార సైటు |
Transcriptions | |
---|---|
Standard Mandarin | |
Hanyu Pinyin | Lǐ Xiǎolóng |
Yue: Cantonese | |
Jyutping | Lei5 Siu2 Lung4 |
Transcriptions | |
---|---|
Standard Mandarin | |
Hanyu Pinyin | Lǐ Zhènfān |
Yue: Cantonese | |
Jyutping | Lei5 Zan3 Faan4 |
బ్రూస్ లీ (నవంబర్ 27, 1940 - జులై 20, 1973) అమెరికాలో జన్మించి, హాంకాంగ్ లో పెరిగిన కరాటే యోధుడు, నటుడు. ఆయన్ను చాలామంది 20 వ శతాబ్దంలోనే ప్రఖ్యాతి గాంచిన యుద్ధ విద్యా ప్రవీణుడిగా, సాంస్కృతిక చిహ్నంగా భావిస్తారు.[3] కుమారుడు బ్రాండన్ లీ, కుమార్తె షానన్ లీ కూడా నటులే. తమ్ముడు రాబర్ట్ 1960వ దశకంలో హాంకాంగ్ ను ఒక ఊపు ఊపిన థండర్ బర్డ్స్ అనే సంగీత బృందంలో సభ్యుడు.[4] బ్రూస్ లీ లో తన సినిమాల్లో చైనా సంప్రదాయాలను, జాతీయ గౌరవాన్ని ఎక్కువగా చూపించడం చేత చైనీయులు లీని అమితంగా అభిమానించేవారు.[5] చైనీయుల సాంప్రదాయ క్రీడయైన కుంగ్ ఫూను లీ తన సినిమాల్లో ఎక్కువగా ప్రదర్శించేవాడు.
బాల్యంసవరించు
బ్రూస్ లీ కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాన్ ఫ్రాన్సిస్కో అనే నగరంలో పుట్టి, హాంకాంగ్ లో పెరిగాడు. ఇతని అసలు పేరు లీ జూన్ ఫాన్. లీ జన్మించిన సంవత్సరం చైనీస్ క్యాలెండర్ ప్రకారం డ్రాగన్ సంవత్సరం.
నటనా జీవితంసవరించు
బ్రూస్ లీ 1973 వ సంవత్సరంలో ఎంటర్ ది డ్రాగన్ చిత్రంలో నటించాడు. కానీ, అతడు ఈ చిత్రం విడుదలకు ముందే చనిపోయాడు.
శారీరక ధారుడ్యము, పౌష్టికాహారంసవరించు
అప్పటి మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారులు ఫిజికల్ కండిషనింగ్ కోసం ఎక్కువ సమయం కేటాయించేవారు కాదని బ్రూస్ లీ అభిప్రాయపడేవాడు. అన్నిరకాలుగా ఫిట్ గా ఉండటం కోసం బాగా కసరత్తు చేసేవాడు. వింగ్ చున్ విధానంలోని వన్ ఇంచ్ పంచ్కి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చాడు. 1964లో జరిగిన లాంగ్ బీచ్ ఇంటర్నేషనల్ కరాటే చాంపియన్‌షిప్‌లో మొట్టమొదటిసారి అతను ఈ పంచ్‌ని ప్రయోగించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. వస్తువుకు కేవలం ఒక అంగుళం దూరంలో చేతిని ఉంచి, కనురెప్ప కాలంలో బలమైన పంచ్‌ని విసరడం ఎలా సాధ్యమైందో ఎవరూ గుర్తించలేకపోయారు. చాలాకాలం ఈ విధానంపై అధ్యయనాలు జరిగాయి. చివరికి టెక్నిక్‌తో మాత్రమే ఇది సాధ్యమవుతుందన్న నిర్ధారణకు వచ్చారు. సహజంగా శక్తినంతా కూడగట్టుకొని, చేతిని బలంగా విసిరితే తప్ప బలమైన దెబ్బ తగలదు. కానీ, బ్రూస్ లీ మందంగా ఉండే చెక్కను సైతం వన్ ఇంచ్ పంచ్‌తో ముక్కలు చేసేవాడు. వస్తువుకు అతి సమీపం నుంచి కొడితే అంత బలమైన దెబ్బ తగులుతుందన్నది ఆశ్చర్యం కలిగించినా, అది అక్షరసత్యమని నిరూపించాడు బ్రూస్ లీ. ఇప్పుడు అంతర్జాతీయ మార్షల్ ఆర్ట్స్‌లో వన్ ఇంచ్ పంచ్ ఒక భాగమైంది. అయితే, అపారమైన అనుభవం ఉన్నవారికే అది సాధ్యమవుతుంది. ఐదు దశాబ్దాల క్రితమే వన్ ఇంచ్ పంచ్ ని ప్రపంచానికి పరిచయం చేశాడు బ్రూస్ లీ.
బ్రూస్ లీ గురించిన కొన్ని విశేషాలుసవరించు
పీడ్ ఫైటింగ్ టెక్నిక్‌తో ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి బ్రూస్ లీ. 32 ఏళ్లకే చనిపోయిన ఈ మార్షల్ ఆర్టిస్ట్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు.
- బ్రూస్ లీ ప్రైవేట్‌గా కుంగ్ ఫూ పాఠాలు చెప్పటానికి గంటకు 275 డాలర్లు వసూలు చేసేవాడు.
- ఫైటింగ్‌లో బ్రూస్ లీ చెయ్యి కనురెప్పపాటు కంటే వేగంగా కదులుతుంది. ఈ వేగాన్ని నిరూపించటం కోసం బ్రూస్ లీ ఓ టెక్నిక్ ప్రదర్శించేవాడు. ఓ వ్యక్తి తన చేతిలో నాణాన్ని ఉంచుకుని అరచేతిని మూసేలోగా బ్రూస్ లీ ఆ నాణాన్ని దొరకపుచ్చుకునేవాడు.
- ఒక అంగుళం దూరం నుంచే పవర్‌ఫుల్ పంచ్ ఇవ్వటంలో బ్రూస్ లీ నేర్పరి.
మరణంసవరించు
1973 జులై 20 న ఎంటర్ ది డ్రాగన్ సినిమాకు గోల్డెన్ హార్వెస్ట్ అనే స్టూడియోలో డబ్బింగ్ జరుగుతుండగా లీ ఆకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. మెదడు విపరీతంగా ఉబ్బిపోవడం దీనికి కారణం. వెంటనే లీని హాంకాంగ్ బాప్టిస్ట్ హాస్పిటల్ కు తరలించారు. అప్పటికీ బ్రూస్ లీ కోమాలోకి వెళ్ళిపోయారు. ఒక గంటలోనే చనిపోయాడు.
సినిమాలుసవరించు
సంవత్సరము | శీర్షిక | పాత్ర | గమనికలు |
---|---|---|---|
1969 | మార్లో | విన్స్లో వాంగ్ | |
1971 | ది బిగ్ బాస్ | చెంగ్ చావో-అన్ | ఫిస్ట్స్ ఆఫ్ ఫ్యూరీ అని కూడా పిలుస్తారు |
1972 | ఫిస్ట్స్ ఆఫ్ ఫ్యూరీ | చెన్ జెన్ | ది చైనీస్ కనెక్షన్ అని కూడా పిలుస్తారు |
1972 | వే అఫ్ ది డ్రాగన్ | టాంగ్ లంగ్ | రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ అని కూడా పిలుస్తారు |
1972 | గేమ్ ఆఫ్ డెత్ | హై టెన్ | 1978 వరకు సినిమా తీయడం పూర్తి కాలేదు |
1973 | ఎంటర్ ది డ్రాగన్ | లీ | మరణానంతర విడుదల |
1979 | ది రియల్ బ్రూస్ లీ | మరణానికి ముందు బ్రూస్ లీ | ప్రారంభ బ్రూస్ లీ చలన చిత్రాల క్లిప్‌లతో డాక్యుమెంటరీ, బ్రూస్ లీ అనుకరించేవారితో సన్నివేశాలు. |
1981 | గేమ్ ఆఫ్ డెత్ II | దీనిని టవర్ ఆఫ్ డెత్ అని కూడా అంటారు. ఈ చిత్రం నిర్మాణానికి ముందే లీ మరణించాడు ,దృశ్యాలు అతని ఇతర చిత్రాల నుండి తీసుకోబడ్డాయి. |
మూలాలుసవరించు
- ↑ 1.0 1.1 "Awards, Honors, Achievements, and Activities". Los Angeles: Bruce Lee Foundation. Archived from the original on 2009-08-05. Retrieved 2020-04-18.
- ↑ "Enter the star of the century". The Sydney Morning Herald. Retrieved March 21, 2017.
- ↑ Stein, Joel (1999). "TIME 100: Bruce Lee". Time. Archived from the original on 2009-12-02. Retrieved 2008-05-30.
- ↑ Web UK Online, Bruce Lee Articles In The Shadow Of A Legend - Robert Lee Remembers Bruce Lee by Steve Rubinstein Archived 2009-03-30 at the Wayback Machine
- ↑ Dennis, Felix; Atyeo, Don (1974). Bruce Lee King of Kung-Fu. United States: Straight Arrow Books. ISBN 0-87932-088-5.
{{cite book}}
: CS1 maint: multiple names: authors list (link)