చతుర్వేదుల నరసింహశాస్త్రి

అమరేంద్ర కలం పేరుతో ప్రసిద్ధులైన సాహిత్యవేత్త అసలు పేరు చతుర్వేదుల నరసింహశాస్త్రి (జూన్ 24, 1924 - డిసెంబర్ 8, 1991).

బాల్యం చదువు

మార్చు

వీరి అసలు పేరు చతుర్వేదుల నరసింహశాస్త్రి. కాని ఈయన ‘అమరేంద్ర’ గానే వీరు సుప్రసిద్దులు. అమరేంద్ర అనగ అతని కలము పేరు. ఈయన కృష్ణా జిల్లా లోని చిరివాడ అనే గ్రామంలో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు వెంకట సుబ్బమ్మ, వెంకట సుబ్రహ్మణ్యం. ఈయన గాంధిజీ, అరవిందులు, రవీంద్రులు ఆధునిక త్రిమూర్తులనే భావంతో వున్న వాతావరణంలో పెరిగిన వ్యక్తి.

మచిలీపట్నం లోనిగల హిందూ ఉన్నత పాఠశాలలో పాఠశాల చదువు జరిగింది. గుంటూరు హిందూ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివారు. అదేవిధంగా ఈయన డిగ్రీ బి.ఏ.ను ఏ.సి. కళాశాలలో పూర్తి చేశారు. బి. ఏ ఆంగ్లసాహిత్యంలో ఆంధ్రవిశ్వ కళాపరిషత్ ప్రథమ స్ధానం పొంది, ‘మెక్ డోనాల్డ్ సువర్ణ పతకం’ పొందారు.

ఇతని ఎం. ఏ. డిగ్రీ చదువును చెన్నై ప్రెసిడెన్సి కళాశాలలో పూర్తి చేసి ఆంగ్ల సాహిత్యంలో ఎం.ఏ. డిగ్రీ తీసుకునారు. ఉస్మా నియా విశ్వ విద్యాలయం నుండి ‘రవీంద్రుడు – వాల్డ్ విట్ మన్’ తులనాత్మక పరిశీలనకు పి.హెచ్.డి. లభించింది. ఇతని చదువు లనిటి ముగించుకొనిన తర్వాత ఉద్యోగ అన్వేషణ మొదలు పెట్టారు.

ఈ అన్వేషణలో ఫలించి 1947 నుండి 1984 వరకు వివిధ విద్యాలయాలలో పనిచేశారు. ఆ తరువాత గుంటూరులోని ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో పనిచేసారు. ఆ తరువాత అమరేంద్ర గారు తన ఇంటర్మిడియట్ పూర్తి చేసిన హిందూ కళాశాల లో ఉపన్యాసకులుగా పనిచేశారు. తాను చదివిన కళాశాలలోనే ఉపన్యాసకులుగా పనిచేయటం తన అదృష్టంగా భావించారు.

ఈయన పనిచేసిన కాలమంతా విద్యార్థులను ఎంత గానోతీర్చిదిద్దారు. ఆ తరువాత పొన్నూరు పి.బి.ఎన్. లాలేజిలో ప్రిన్సిపల్ గా, పుట్టపర్తి శ్రీసత్యసాయిబాబా కళాశాలలో కూడా పనిచేశారు. అదేవిధంగా గుంటూరు జే.కే.సి. కళాశాలలో ప్రిన్సిపల్ గానూ పనిచేశారు. వీరు మృదుల స్వభావులు, మాట మృదువు, చక్కని సరళమైన భాషలో, అందమైన ఉచారణతో, ఆకర్షణీయమైన శైలిలో బోధించి విద్యాలోకాన్ని మురిపించిన అధ్యాపకులు.

ఇతని రచనలు, జీవిత పయనం

మార్చు

‘పారడైజ్ లాస్ట్’, షేక్స్పియర్ నాటకాలను బోధించడంలో వీరు నిష్ణాతులు. బంకిన్ చంద్రఛటర్జి, శరత్ చంద్రఛటర్జీ, రవీంద్రనాథ్ ఠాగూర్ లాంటి భావ కవులు, జాషువా, వేంకట పార్వతీశకవులు, శ్రీ శ్రీ మొదలగు ఆధునిక కవులు పోతరాజు, త్యాగరాజు, రామదాస భక్త కవులు, వేమన వీరిని ప్రాభావితం చేశారు, వీరి కథాసంకలనాలు ‘పంజరం’, ‘ఇంద్రధనస్సు’, ‘జీవన సంధ్య’, ‘కూలిన శిఖరాలు’, ఉభయ భాషలలోనూ సమాన పాండిత్యం వుండటం వలన వీరు ఇంగ్లీషు నుండి తెలుగులోకి, తెలుగు నుండి ఇంగ్లీషులోకి ఎన్నో అనువాదాలు చేశారు.

షేక్స్పియర్ అంటోనీ అండ్ క్లియోపాత్రా’, టెంపెస్ట్’, ‘హిమింగ్వే ఫర్ హూమ్ ది బెల్ టోల్స్’, ఠాకూర్ ‘గీతాంజలి’ కబీరు పద్యాలు. మనోజ్ దాస్ ‘అరవిందులు’, మెక్ మిల్లన్ వారి ‘అమృతమూర్తి’, బీరేంద్ర కుమార్ భట్టాచార్య 'జనవాహిని', శ్రీశ్రీ కవితా! ఓ కవితా ! మహా భాగవత దశమి స్కంధం, రంధి సోమరాజు ‘రాజీ’ గురజాడ వారి ‘దిద్దుబాటు’ కథానికా, వీలూరి శివరామశాస్త్రిగారి ‘సుల్తాని’ కృష్ణశాస్త్రిగారి భక్తి గీతాలు ‘వేట్ రోజేస్’, మొదలైనవి వీరి అనువాద ప్రక్రియకు కీర్తి ఆర్జించిన రచనలు. డాక్టరు డి. నారాయణరెడ్డిగారి ‘విశ్వంభర’ చేసి ఆంగ్లానువాదాన్ని ఒక మంచి ఆధునిక తెలుగు కావ్యాన్ని ఆంగ్లపాఠక లోకానికి అందించడానికి సాయపడ్డారు. కేరళ సాహిత్య అకాడమీకి, కేంద్ర సాహిత్య అకాడమివారి ‘ఎన్ సైక్లోపీడియా ఆఫ్ ఇండియన్ లిటరేచర్’ సంకలనంలోనూ వీరి పాత్ర, కృషి ఎంతో ఉంది.

ఇక వీరి రేడియో ప్రసంగాలు, జాతీయ సదస్సులలో తెలుగు ప్రతినిధులుగా పాల్గొని లెక్కకు మించి, విజయవాడ ఆకాశవాణి ప్రతినిధిగా ‘భావవీణ’ ప్రసంగం వినూత్నం, సంచ లనాత్మకం. కొన్నిటికి జాతీయ బహుమతులు కూడా వచ్చాయి. కళాభారతి, శ్రీనాధపీఠం, హిందూకళాశాలవారు వీరిని ఘనంగా సన్మానించారు. వీరి వ్యక్తిత్వం, ఆచారత్వం,ఆద్యాత్మికత మరువలేనివి.‘నీ పేరే గీతం’ అనే వీరి కవిత రష్యన్ భాషలోకి తర్జుమా చేయబడింది. 1991 డిసెంబరు 8 న వీరు పరమపదించిన తరువాత వీరి కొన్ని కవితలు ‘హంసగీతి’గా వీరి కుమారులు ప్రచురించారు.