హిందూ కళాశాల (గుంటూరు)

గుంటూరులోని కళాశాల

హిందూ కళాశాల గుంటూరులో మొదట సంస్కృత పాఠశాలగా ప్రారంభమై 1935లో సర్వేపల్లి రాధాకృష్ణన్ చేతులమీదుగా కళాశాలగా రూపాంతరం చెందింది. 1947లో ప్రథమ శ్రేణి కళాశాలగా అభివృద్ధి చెందింది. మొదట ఆంధ్ర విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న ఈ కళాశాల ప్రస్తుతం నాగార్జున విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉంది.

హిందూ కళాశాల
నినాదంతమసోమా జ్యోతిర్గమయ
రకంకళాశాల
స్థాపితం1935
ప్రధానాధ్యాపకుడుడాక్టర్ కె.కనకదుర్గ
చిరునామGuntur 522 003, India, గుంటూరు, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
16°17′47.8″N 80°26′33.1″E / 16.296611°N 80.442528°E / 16.296611; 80.442528
కాంపస్పట్టణ
అనుబంధాలు
జాలగూడుhttp://hcg.ac.in/

చరిత్ర

మార్చు

1860లో సంస్కృత పాఠశాలగా ప్రారంభమై 1906లో టౌన్ హైస్కూలుగా మారిన ఈ సంస్థ 1935లో ఇంగ్లీషు, తెలుగు, సంస్కృతం, చరిత్ర, గణితం, వాణిజ్య శాస్త్రం బోధించే కళాశాలగా రూపాంతరం చెందింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆనాటి ఉపకులపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ ఈ కళాశాలను ప్రారంభించాడు. 1940లో హిందీ, 1942లో వ్యవసాయ, భౌతిక, రసాయన శాస్త్రాల బోధన ప్రారంభించబడింది. 1945లో ద్వితీయశ్రేణి కళాశాలగా, 1947లో ప్రథమశ్రేణి కళాశాలగా గుర్తింపు పొందింది. కొంపల్లి కోటిలింగం, దేశిరాజు నాగభూషణం, మాజేటి హనుమంతరావు, ఎం.మస్తాన్ సాహెబ్, టేకుమళ్ల జాలయ్య, టి.వెంకటరావు, ఆర్.భాస్కరరావు, మద్ది సుదర్శనం, ఎ.లక్ష్మీనరసింహం, ఆర్.ఎల్.సోమయాజి, పి.ఎస్.టి.శాయి, పోలూరి వెంకటేశ్వరరావు, ఎన్.ఎస్.ఆర్.పంతులు, మాధవపెద్ది రాధాకృష్ణమూర్తి, ఎ.ఎల్.నారాయణరావు మొదలైన వారు ఈ కళాశాల కమిటీలో అధ్యక్షులు, కార్యదర్శులుగా పనిచేసి కళాశాల అభివృద్ధికి పాటుపడ్డారు.

పూర్వ అధ్యాపకులు

మార్చు

పూర్వ విద్యార్థులు

మార్చు

మూలాలు

మార్చు

వెలుపలి లంకెలు

మార్చు