వక్షోజం
. స్తన గ్రంధులు.
1. ఛాతీ గోడ
2. ఛాతి కండరాలుs
3. Lobules
4. చనుమొన
5. స్తన పరివేషం
6. పాల వాహిక
7. ఫాటీ కణజాలం
8. చర్మము
Breast | |
---|---|
వివరములు | |
లాటిన్ | mamma (mammalis "of the breast")[1] |
internal thoracic artery | |
internal thoracic vein | |
Identifiers | |
TA | A16.0.02.001 |
FMA | 19898 9601, 19898 |
Anatomical terminology |
|గర్భిణి స్త్రీ వక్షోజాలు]] చర్మములోని ఒక రకమైన స్వేద గ్రంధులు వక్షోజాలు (Breast) గా పరిణితి చెందాయి. బాలెంతరాలు చంటి పిల్లలకు చనుబాలు వక్షోజాల నుండే అందిస్తారు. తల్లిపాలు బిడ్డకు చాలా శ్రేష్టము
స్థూల రూపం
మార్చుచర్మములో ఉండే ఒక రకమైన స్వేద గ్రంధులు సుడోరిఫెరస్ గ్రందులుగా మార్పు చెంది స్త్రీ లలో వినాళ గ్రంధుల ప్రభావం వల్ల చనుబాలు ఇవ్వడానికి వక్షోజాలుగా మారాయి.
ధర్మములు
మార్చుపిల్లలకు పాలివ్వడం వీని ముఖ్యమైన ధర్మం.
భాషా విశేషాలు
మార్చు- సి.పి.బ్రౌన్ నిఘంటువు ప్రకారం స్తనము అనగా [ stanamu ] stanamu. సంస్కృతం n. A woman's breast. కుచము, చన్ను.[2] వాడు స్తనస్తవశల్య పరీక్ష చేస్తున్నాడు he makes a minute examination; literally, he will even search for a bone in a breast. స్తనంధయుడు stanan-dhayuḍu. n. A suckling, an infant at the breast. చన్ను కుడిచే మగబిడ్డ. చంటిపాప. స్తన్యము stanyamu. n. Milk. పాలు, చనుబాలు, స్తన్యపానము drinking mother's milk.
స్వీయ పరీక్ష
మార్చుమహిళలు ఎవరికి వారే తమ రొమ్ములను స్వయంగా పరీక్షించటం అనేది రొమ్ము క్యాన్సర్ను తొలిదశలోనే వెంటనే గుర్తించటానికి చక్కని మార్గం. క్యాన్సర్ సమస్య వయస్సుతో సంబంధం లేకుండా వస్తుంది, కనుక, అన్ని వయస్సుల మహిళలు తమ రొమ్ముల స్వీయ పరీక్ష ప్రతి నెలా చేయాలి. ప్రతినెలా రుతుచక్రం తర్వాత ఈ పరీక్ష జరపటం ఉత్తమం, ఎందుకంటే, ఆ సమయంలో రొమ్ములు మృదువుగా ఉండి, గడ్డలు ఏవైనా ఉంటే సులువుగా కనుక్కొనే అవకాశం ఉంటుంది. ముట్లు ఆగిపోయిన (రుతుక్రమం నిలిచిపోయిన) మహిళలు, హిస్టరెక్టమీ (పిల్లల సంచి తొలిగింపు) ఆపరేషన్ జరిగిన మహిళలు, రుతుక్రమం నెలనెలా వరుసగా జరగని మహిళలు, తమకు అనుకూలమైన సమయాన్ని ఎంచుకోవాలి.
దీనికి అవసరమైన సామాగ్రి: ఒక దిండు, ఒక అద్దం.
- మొదటి మెట్టు
రొమ్ములో మార్పులు ఏమైనా ఉన్నదీ లేనిదీ తెసుసుకోవాలి. మొదటి భంగిమలో మీ రెండు చేతులను పైకి ఎత్తండి. రెండో భంగిమలో మీ చేతులను తుంటిపై పెట్టండి. మూడో భంగిమలో మీ రెండు చేతులను స్వేచ్ఛగా మీ ముందు భాగంలో వేలాడేటట్లు వదిలేయండి. ఈ మూడు భంగిమలను అద్దంలో చూస్తూ ఒక్కో రొమ్ములో ఈ క్రింద పేర్కొన్న మార్పులను గమనించండి.
రొమ్ము ఆకారం, సైజు, కుదురు లేదా ఆకృతి, రొమ్ముపైన చర్మం రంగు వివర్ణం కావటం / కంది పోవటం లేదా సొట్టలుపడటం, బొడిపెలు / గడ్డలు, పుండ్లు లేదా చర్మం పొలుసు బారటం, చనుమొనల నుంచి పాలు కారటం లేదా చనుమొనలపై పగుళ్లు ఏర్పడటం, రొమ్ముపై సొట్టలు, కురుపులు లేవటం.
- రెండవ మెట్టు
- మంచంపై వెల్లకిలా పడుకోండి. మీ రొమ్ములో గడ్డలేమైనా ఉన్నాయో ప్రతి అంగుళాన్ని పరీక్షించి, వెతకండి.
ఎడమ వైపు రొమ్ముకు కుడి చెయ్యిని, కుడివైపు రొమ్ముకు ఎడమ చెయ్యిని ఉపయోగించండి.
- మీ చేతి మధ్యన మూడు వేళ్ల కొసభాగాలతో రొమ్ము పై గట్టిగా అదుముతూ బొడిపెలు, గడ్డలు ఏమైనా తగులుతున్నాయా గమనించండి.
- చనుమొనలతో సహా మీ రొమ్ము ప్రాంతం మొత్తం పరీక్షించటానికి వీలుగా మీరు చేసే పరీక్షను వృత్తాకారంలో గానీ, పై నుంచి కిందకు గానీ చేయండి.
- మీ పరీక్షను రొమ్ము గ్రంధులు ఉన్న చంక క్రింది వరకు విస్తరించండి.
- చనుమొనలకు అటు, ఇటు భాగాలపై మీ చేతిని తాకుతూ, కదిలిస్తూ రొమ్ము ప్రాంతం మొత్తాన్ని మీరు తడిమి చూడాలి.
- మెడ ఎముక కింద, దాని చుట్టూతా తడిమి, గడ్డలు, బొడిపెలు ఏమైనా తాకినట్లు అనిపిస్తుందా గమనించండి.
- చేతిని మార్చి ఇంకో వైపు రొమ్మును కూడా పైన పోర్కొన్న విధంగా పరీక్షించండి.
వ్యాధులు
మార్చువక్షోజాలు అనేక వ్యాదులతో ఇబ్బంది పడవచ్చు. వాటిలో ముఖ్యమైనవి వక్షోజాలు గాయపడడం, చనుబాలు ఎక్కువగా స్రవించడం వల్ల లేక చనుబాలు ఎక్కువ సేపు నిలచి ఉండడం (బ్రెస్ట్ ఎన్ గార్జమెంట్), వినాళ గ్రంధులకు సంబంధించిన వ్యాధులు, ఇన్ ఫేక్టన్స్, ఆటోఇమ్మున్ జబ్బులు
వక్షోజాలలో చనుబాలు ఎక్కువగా స్రవించందం వల్ల తరచు సూక్ష్మజీవుల వల్ల ఇన్ పెక్టన్ బారి పడుతుంటే వినాళ గంధ్రులకు సంబంధించిన జబ్బులకు కూడా పరీక్షలు చేయవలసి వస్తుంది.
- మాస్టైటిస్ - వక్షోజాల ఇన్ పెక్షన్
- బాక్టీరియా వల్ల వచ్చే ఇన్ పెక్షన్
- చనుబాలు ఎక్కువగా స్రవించడం వల్ల చనుబాలు ఎక్కువ సేపు నిలచి ఉండడం (బ్రెస్ట్ ఎన్ గార్జమెంట్) వల్ల కలిగే వక్షోజాల ఒరువు
- గవదలు వల్ల వచ్చే వక్షోజాలకు వచ్చే ఒరుపు
- దీర్ఘకాలపు మాస్టైటిస్
- దీర్ఘకాలపు చనుమెన వచ్చిన ఇన్ ఫేక్టన్
- వక్షోజాల క్షయ వ్యాధి
- వక్షోజాల సిఫిలిస్
- వక్షోజాల వెనుక చేరిన
- వక్షోజాల అక్టినోమైసిస్
- మోన్ డోర్ జబ్బు (Mondor's disease)
- చనుబాల నాళాలకు సంబంధించిన జబ్బు
- బ్రెస్ట్ ఎన్ గార్జమెంట్ (వక్షోజాలలో చనుబాలు నిలిచి ఇబ్బంది పెట్టుట)
మూలాలు
మార్చు- ↑ "mammal – Definitions from Dictionary.com". Dictionary.reference.com. Retrieved 2011-10-31.
- ↑ బ్రౌన్ నిఘంటువు ప్రకారం స్తనము పదప్రయోగాలు.[permanent dead link]