చప్పట్లు
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
చప్పట్లను ఆంగ్లంలో క్లాప్స్ అంటారు. మానవులు లేక జంతువులు తమ రెండు సమతల ఉపరితల శరీర భాగాలను ఆకర్షణీయముగా చరచటం ద్వారా విడుదల చేసే ధ్వనిని చప్పట్లు అంటారు. మానవులు వారి చేతి యొక్క అరచేతులను ఉపయోగించి చప్పట్లు కొడతారు. ప్రశంసిస్తున్న వ్యక్తిని మెచ్చుకున్నాము అని తెలియజేయడానికి లేక ప్రశంసలను ఆమోదిస్తున్నాము అని తెలియజేయడానికి, పాత్రదారునికి అభినందనలు తెలపడానికి చప్పట్లు కొడతారు. సంగీతం, నృత్య కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు సంగీతానికి, నృత్య కార్యక్రమానికి అదనపు సంగీతముగా లయ బద్ధంగా చప్పట్లు కొడతారు.
ఉపయోగాలు
మార్చుకొంత దూరంలో ఉన్నవారిని చప్పట్లు కొట్టి పిలవడానికి, వినోద కార్యక్రమాలలో అందరూ ఉత్సాహంగా, ఆనందం ఉండటానికి, నిద్రమత్తు వదిలించుకోవడానికి ఈ చప్పట్లు ఉపయోగపడతాయి.