చిటికె

(చిటికలు నుండి దారిమార్పు చెందింది)

ఒక చేతి బొటన వేలిని అదే చేతి వేరే వేలుతో తాటించడం ద్వారా చేసే శబ్దాన్ని చిటిక అంటారు. ప్రధానంగా బొటనవ్రేలుపై మరియొక వేలును ఉంచి గట్టిగా అదిమి జారేటట్టు చేస్తే జారిన వేలు అరచేతిపై పడి శబ్దం వస్తుంది. ఈ శబ్దాన్నే చిటిక లేక చిటపట శబ్దం అంటారు. చిటిక వేయడానికి మధ్యవేలు అనువుగా ఉండటమేకాకుండా ఎక్కువ ధ్వని కూడా విడుదలవుతుంది. దీనికి కారణం మధ్యవేలు బలంగా ఉండటంతో పాటు ఉంగరపు వేలు నుండి కూడా అదే సమయంలో ధ్వని విడుదలవుతుంది. కాబట్టి చిటిక వేయడానికి ఎక్కువగా, ముఖ్యంగా మధ్యవేలును ఉపయోగిస్తారు. చిటికను ఆంగ్లంలో స్న్యాప్ అంటారు.

చిటికె

చేతి చప్పట్లకు బదులు చిటికెలు వాడుతూంటారు. ఒకచేత్తో ఏదైనా వస్తువును పట్తుకున్నపుడు చప్పట్లు కొట్టడం వీలు కాదు కాబట్టి ఆ సందర్భంలో చిటికెలు వెయ్యడం ఆనవాయితీ. మిచిగాన్ విశ్వవిద్యాలయం లోని పురుషుల గ్లీ క్లబ్ లో ఈ సంప్రదాయం ఉంది. క్లబ్ చరిత్ర ఇలా చెబుతోంది, "దీని వెనుక కారణం ఏంటంటే.., ఒకచేత్తో బీరు గ్లాసు పట్టుకుని చప్పట్లు కొట్టలేరు! పైగా ప్రసంగాలు, ప్రకటనల సమయంలో చప్పట్లు కొట్టడం కంటే చిటికెలు తక్కువ శబ్దంతో తక్కువ అంతరాయం కలిగిస్తాయి." [1]

ఉపయోగాలు

మార్చు

సంగీతంలా వినడానికి, ఇతరులను చిటికేసి పిలవడానికి ఈ చిటికలు ఉపయోగపడతాయి.

ఇవి కూడా చూడండి

మార్చు

చప్పట్లు

మూలాలు

మార్చు
  1. "University of Michigan Men's Glee Club || About | History_html_5". Ummgc.org. Archived from the original on 2016-06-21. Retrieved 2011-12-28.
"https://te.wikipedia.org/w/index.php?title=చిటికె&oldid=4318629" నుండి వెలికితీశారు