చమనీ సెనెవిరత్నే

శ్రీలంక మాజీ క్రికెటర్

చమనీ రోషిని సెనెవిరత్నే, శ్రీలంక మాజీ క్రికెటర్. ప్రస్తుతం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తరపున కుడిచేతి మీడియం బౌలర్ గా, కుడిచేతి వాటం బ్యాటర్‌గా రాణిస్తున్నది. 1997- 2013 మధ్య శ్రీలంక తరపున అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లలో ఆడింది. ఒక టెస్ట్ మ్యాచ్, 80 వన్డే ఇంటర్నేషనల్స్, 32 ట్వంటీ 20 ఇంటర్నేషనల్స్‌లో పాల్గొన్నది.

చమనీ సెనెవిరత్నే
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
చమనీ రోషిని సెనెవిరత్నే
పుట్టిన తేదీ (1978-11-14) 1978 నవంబరు 14 (వయసు 45)
అనురాధపుర, శ్రీలంక
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్ బౌలింగ్
పాత్రఆల్ రౌండరు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టులు
ఏకైక టెస్టు (క్యాప్ 9)1998 ఏప్రిల్ 17 
శ్రీలంక - పాకిస్తాన్ తో
తొలి వన్‌డే (క్యాప్ 9)1997 నవంబరు 25 
శ్రీలంక - నెదర్లాండ్స్ తో
చివరి వన్‌డే2009 ఫిబ్రవరి 17 
శ్రీలంక - పాకిస్తాన్ తో
తొలి T20I (క్యాప్ 15/10)2010 ఏప్రిల్ 21 
శ్రీలంక - వెస్టిండీస్ తో
చివరి T20I2021 ఏప్రిల్ 29 
UAE - Hong Kong తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2007–2008/09స్లిమ్‌లైన్ స్పోర్ట్స్ క్లబ్
2009/10–2010/11కోల్ట్స్ క్రికెట్ క్లబ్
2012/13–2014Sri Lanka Air Force Sports Club
కెరీర్ గణాంకాలు
పోటీ మటె మవన్‌డే మటి20 మలిఎ
మ్యాచ్‌లు 1 80 55 136
చేసిన పరుగులు 148 832 493 1,688
బ్యాటింగు సగటు 148.00 14.85 13.32 20.83
100లు/50లు 1/0 0/1 0/2 1/6
అత్యుత్తమ స్కోరు 105* 56 63 105*
వేసిన బంతులు 209 3,289 977 5,352
వికెట్లు 7 72 56 143
బౌలింగు సగటు 8.42 26.08 13.75 18.26
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 1 0 1 1
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 5/31 4/23 5/3 5/15
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 27/– 17/– 40/–
మూలం: CricketArchive, 12 November 2022

జననం మార్చు

చమనీ రోషిని సెనెవిరత్నే 1978, నవంబరు 14న శ్రీలంకలోని అనురాధపురలో జన్మించింది.

క్రికెట్ రంగం మార్చు

1998 ఏప్రిల్ లో పాకిస్తాన్‌పై 105 * పరుగులతో మహిళల టెస్ట్ క్రికెట్‌లో శ్రీలంక క్రికెట్ లో ఏకైక సెంచరీని సాధించింది.[1] అరంగేట్రంలో టెస్ట్ సెంచరీ చేసిన ఎనిమిదో బ్యాటర్‌గా కూడా నిలిచింది. మహిళల టెస్టుల్లో 8వ స్థానంలో లేదా అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్ చేసినప్పుడు అత్యధిక స్కోరు చేసిన మహిళగా రికార్డు సాధించింది.[2][3][4] 148 పరుగుల టెస్టు అరంగేట్రంలో ఒక మహిళ సాధించిన ఐదో అత్యధిక పరుగులు ఇవి.[5]

2018 మేలో 2018 ఐసీసీ మహిళల ప్రపంచ ట్వంటీ20 క్వాలిఫైయర్ టోర్నమెంట్ కోసం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జట్టులో ఎంపికైంది.[6] 2018 జూలై 7న వరల్డ్ ట్వంటీ20 క్వాలిఫైయర్‌లో నెదర్లాండ్స్‌తో యుఏఈ తరపున మహిళల ట్వంటీ20 ఇంటర్నేషనల్ [7] ఆడింది.

2019 ఫిబ్రవరి 19న కువైట్‌తో జరిగిన 2019 ఐసీసీ ఉమెన్స్ క్వాలిఫైయర్ ఆసియా మ్యాచ్‌లో, మహిళల టీ20లలో మొదటి ఐదు వికెట్లు తీసింది.[8] 2020 జూన్ లో కరోనా-19 మహమ్మారి కారణంగా అబుదాబిలో కోచింగ్ ఉద్యోగాన్ని కోల్పోయింది.[9]

మూలాలు మార్చు

  1. "Career Batting and Fielding for Sri Lanka in Women's Test Matches (Ordered by Name)". CricketArchive. Retrieved 2023-08-23.[permanent dead link]
  2. "Sri Lanka Women v Pakistan Women". CricketArchive. Retrieved 2023-08-23.
  3. "Records | Women's Test matches | Batting records | Hundred on debut | ESPN Cricinfo". Cricinfo. Retrieved 2023-08-23.
  4. "Records | Women's Test matches | Batting records | Most runs in an innings (by batting position) | ESPN Cricinfo". Cricinfo. Retrieved 2023-08-23.
  5. "Records | Women's Test matches | Batting records | Most runs in debut match | ESPN Cricinfo". Cricinfo. Retrieved 2023-08-23.
  6. "UAE women's cricket team for World Twenty20 Qualifier announced". The National. Retrieved 2023-08-23.
  7. "3rd Match, Group A, ICC Women's World Twenty20 Qualifier at Utrecht, Jul 7 2018". ESPN Cricinfo. Retrieved 2023-08-23.
  8. "A great day for China while UAE make it two wins from two". International Cricket Council. Retrieved 2023-08-23.
  9. "Former skipper Chamani Seneviratne stranded in the UAE". The Papare. Retrieved 2023-08-23.

బాహ్య లింకులు మార్చు