చర్చ:అలీ నవాజ్ జంగ్ బహాదుర్
తాజా వ్యాఖ్య: 10 సంవత్సరాల క్రితం. రాసినది: వైజాసత్య
వైజాసత్య గారూ, బహదూర్ కు బదులు బహాదుర్ అని మార్చగలరా! "అలీ నవాజ్ జంగ్ బహాదుర్" అని. బహదూర్ అనే పేరు గాని పదము గాని లేదు, ఆ పదము "బహాదుర్" అనగా ఆంగ్లంలో అర్థం "brave", తెలుగులో "శౌర్యవంతుడు" అనీ. తెలుగు వ్యావహారికంలో ఉర్దూ పదాల ఉచ్ఛారణ మూలంగా బహాదుర్ "బహదూర్" లా మారింది. అహ్మద్ నిసార్ (చర్చ) 06:45, 1 అక్టోబరు 2014 (UTC)
- అలాగే, తెలియజేసినందుకు ధన్యవాదాలు --వైజాసత్య (చర్చ) 03:40, 2 అక్టోబరు 2014 (UTC)
- అహ్మద్ నిసార్ గారూ, ఈ వ్యాసంలో ఉర్దూ పేరు బహాదర్ అని ఉందా? లేక అలాగే వ్రాస్తారా? అందుకే నాకు ఉర్దూ కంటే అరబిక్ చదవటం సులభమేమో అనిపిస్తుంది. నాది చాలా వచ్చీరానీ ఉర్దూ లెండి. ఊరకే కుతూహలంతో అడిగా --వైజాసత్య (చర్చ) 04:18, 2 అక్టోబరు 2014 (UTC)
- సత్య గారూ, ఉర్దూ, పర్షియన్, అరబీ భాషలు, ఆర్.టి.ఎల్. లిపులు, అలాగే వీటి వర్ణమాలలో అచ్చులు హల్లులు చూస్తే, జబర్ (తెలుగు అచ్చులలో "అ"కారం-హ్రస్వం), జేర్ (తెలుగు అచ్చులలో "ఇ"కారం-హ్రస్వం), పేష్ (తెలుగు అచ్చులలో "ఉ"కారం-హ్రస్వం), ఖడీ జబర్, ఖడీ జేర్, ఖడీ పేష్- ఇవన్నీ దీర్ఘాలు. నేర్చుకునే సమయంలో ఇవి ఉపయోగిస్తారు. నేర్చుకునిన తరువాత ఇవన్నీ 'understandings' అయి కూర్చుంటాయి. మీరు చూసినది ఉర్దూలో بہادر ఈ పదంలో వేటికీ అచ్చులు (vowel, semivowel) వాడలేదు (అలీఫ్ తప్ప), ఇక్కడ "د" పైన "పేష్"-ఉ కారం హ్రస్వం వుంది, కాని వ్రాయబడలేదు. కాబట్టి బ+హా+దు+ర్ అయినది. ఇంట వ్రాయడానికి కారణం మీ ఉత్సాహమే. ఖురాన్ చూడండి, అరబ్బు దేశాలలోని సౌదీ అరేబియాలో వాడబడే ఖురాన్ లలో ఈ జబర్ జేర్ పేష్ లు వుండవు, ఎందుకంటే వారి మాతృభాష అరబీ. అదే నాన్ అరబిక్ దేశాలలో వాడబడే ఖురాన్ లలో ఈ జబర్ జేర్ పేష్ లు తు.చ. ఉంటాయి, కారణం ఉచ్ఛారణ దోషాలు మరియు వొకాబులరీ దోషాలు దొర్లకూడదని. అహ్మద్ నిసార్ (చర్చ) 06:00, 2 అక్టోబరు 2014 (UTC)
- ఓహో, అలాగా, హీబ్రూలో కూడా అంతే అచ్చులు సాధారణంగా వాడరు కానీ కొత్తగా నేర్చుకునే వారికి మాత్రం అచ్చులతో సహా ముద్రించిన పుస్తకాలు దొరుకుతాయి. తెలియజేసినందుకు ధన్యవాదాలు --వైజాసత్య (చర్చ) 10:39, 4 అక్టోబరు 2014 (UTC)